త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Raashi Khanna | ఓ వైపు సినిమా – మ‌రోవైపు వెబ్‌సిరీస్ – బ్రేక్ లేకుండా క‌ష్ట‌ప‌డుతోన్న రాశీఖ‌న్నా

స‌క్సెస్‌లు లేక‌పోతే ఇండ‌స్ట్రీలో అవ‌కాశాలు రావ‌డం క‌ష్ట‌మ‌ని అంటుంటారు. కానీ రాశీఖ‌న్నా కెరీర్ ఇందుకు మిన‌హాయింపుగా సాగుతోంది. కెరీర్‌లో చెప్పుకోద‌గ్గ బ్లాక్‌బ‌స్ట‌ర్లు లేక‌పోయినా అవ‌కాశాలు ప‌రంగా జోరుమీదుంది. సినిమాలు, వెబ్‌సిరీస్‌ల‌తో బ్రేక్ లేకుండా క‌ష్ట‌ప‌డుతోంది.

N

Naresh N

Entertainment | Published On Nov 23, 2026, 7.46 pm IST

 త‌మిళ మూవీ ధ‌ర్మ‌న్‌లో ర‌జ‌నీకాంత్ కూతురిగా న‌టిస్తోంది రాశీఖ‌న్నా. అశ్వ‌త్ మారిముత్తు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా షూటింగ్‌తో మొన్న‌టివ‌ర‌కు బిజీగా ఉంది.
01/04

ధ‌ర్మ‌న్ షూటింగ్ షెడ్యూల్ ముగియ‌గానే ఒక్క రోజు కూడా గ్యాప్ లేకుండా ఫ‌ర్జీ 2 వెబ్‌సిరీస్ సెట్స్‌లో అడుగుపెట్టింది.
02/04

ప్ర‌స్తుతం ముంబైలో ఫ‌ర్జీ 2 చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. ఈ క్రైమ్ థ్రిల్ల‌ర్ వెబ్‌సిరీస్‌లో రాశీఖ‌న్నాతో పాటు షాహిద్‌క‌పూర్‌, విజ‌య్ సేతుప‌తి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. రాజ్ అండ్ డీకే ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.
03/04

ఫ‌ర్జీ వెబ్‌సిరీస్ షూటింగ్ ఫొటోల‌ను రాశీఖ‌న్నా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ సిరీస్ నుంచి త‌ప్పుకున్న‌ట్లు వ‌స్తోన్న వార్త‌ల‌కు ఫొటోల‌తో చెక్ పెట్టింది.
04/04

Advertisement