Udit Narayan | నాకు తెలియకుండా నా గర్భసంచి తీయించేశాడు – సింగర్ ఉదిత్ నారాయణన్‌పై మొదటి భార్య కంప్లైంట్
సింగర్ ఉదిత్ నారాయణన్‌పై అతడి మొదటి భార్య రంజన పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. వైద్య పరీక్షల పేరుతో తన అంగీకారం లేకుండా గర్భసంచిని తొలగించారని, రెండో భార్య దీపాతో కలిసి తనపై కుట్రలు పన్నారని రంజన ఆరోపించారు.
Udit Narayan | లెజెండరీ సింగర్ ఉదిత్ నారాయణన్ చిక్కుల్లో పడ్డారు. ఆయనపై మొదటి భార్య రంజన ఝా బీహార్‌లోని సుపాల్ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చింది. ఉదిత్ నారాయణన్, ఆయన సోదరులతో పాటు రెండో భార్య దీపా నారాయణన్‌పైన పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అసలేమిటి వివాదం...
1996లో వైద్య పరీక్షల పేరుతో ఉదిత్ నారాయణన్ తనను ఢిల్లీలోని ఓ హాస్పిటల్‌కు తీసుకెళ్లారని, తన అంగీకారం లేకుండానే గర్భసంచిని తొలగించారని రంజన ఝా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. తాను తల్లి కాకుండా ఉండటానికే రెండో భార్య దీపాతో కలిసి ఉదిత్ నారాయణన్ ఈ కుట్ర పన్నారని తన ఫిర్యాదులో రంజన పేర్కొన్నారు.గర్భసంచిని తొలగించిన విషయం చాలా ఏళ్ల తర్వాత మరో వైద్య పరీక్షలో తనకు తెలిసిందని, అప్పటి నుంచే న్యాయం కోసం తాను పోరాడుతున్నానని రంజన పేర్కొన్నది. రంజన ఫిర్యాదు స్వీకరించిన సుపాల్ సింగర్‌పై కేసు నమోదు చేశారు.
తన భార్య కాదంటూ....
ఉదిత్ నారాయణన్ రంజనను 1984లో పెళ్లి చేసుకున్నారట. హిందూ సంప్రదాయ పద్దతిలో తమ వివాహం జరిగిందని రంజన తెలిపింది. ఆ తర్వాత ఏడాదే సింగర్‌గా అవకాశాల కోసం ప్రయత్నించడానికి ఉదిత్ ముంబై షిప్టయ్యారట. 1985లో తనకు తెలియకుండా రహస్యంగా దీపాను ఉదిత్ నారాయణన్ వివాహం చేసుకున్నారంటూ రంజన చాలా రోజులుగా ఆరోపణలు చేస్తోంది.
2006లో గొడవలు...
2006లో ఉదిత్ నారాయణన్ ఇంటి ముందు రంజన గొడవలు చేయడంతో మొదటి పెళ్లి రహస్యం బయటపడింది. బలవంతంగా ఉదిత్ నారాయణన్ ఇంట్లోకి వెళ్లడానికి రంజన ప్రయత్నించడం, దీపా అడ్డుకోవడం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. ఉదిత్ నారాయణన్ స్వస్థలం నేపాల్‌లో కూడా రంజన వెళ్లడం రచ్చ రచ్చగా మారింది. ఉదిత్ నారాయణన్‌పై 2006 లో రంజన కోర్టును ఆశ్రయించింది. కానీ సింగర్ మాత్రం ఆమె తన భార్య కాదంటూ ఆరోపణలు చేశారు. మొదటి పెళ్లికి సంబంధించి పూర్తి ఆధారాలు రంజన కోర్టుకు సమర్పించి షాకిచ్చింది. దాంతో రంజనను తన భార్యగా ఉదిత్ నారాయణన్ ఒప్పుకోక తప్పలేదు. ఆమెకు నెలకు ఇరవై ఐదు వేలు భరణంగా ఇవ్వడానికి అంగీకరించారట. తాను ఇచ్చిన హామీలేవి కూడా ఉదిత్ నారాయణన్ నెరవేర్చలేకపోయారని చాలా రోజులుగా రంజన ఆరోపిస్తున్నారు. మరోవైపు దీపా కూడా భర్త మొదటి పెళ్లి గురించి తనకు తెలియదని కొన్ని ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు. ఉదిత్ నారాయణన్, దీపాలకు కుమారుడు ఆదిత్య నారాయణన్ ఉన్నారు. తండ్రి బాటలోనే సింగర్‌గా కొనసాగుతోన్నారు.
170 కోట్లు...
బాలీవుడ్‌లో రిచెస్ట్ సింగర్స్‌లో ఒకరిగా కొనసాగుతోన్నారు ఉదిత్ నారాయణన్. ఆయన మొత్తం ఆస్తుల విలువ 170 కోట్లకుపైనే ఉంటుందట. సింగర్‌గా ఒక్కో పాట పాడటానికి 15 నుండి 20 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్, యూబ్యూబ్ ఛానల్స్ నుంచి తన పాటలకు సంబంధించిన రాయల్టీల రూపంలో ప్రతి ఏటా కోట్లలో సంపాదిస్తున్నారు ఉదిత్ నారాయణన్.
25 వేల పాటలు...
సుదీర్ఘ కెరీర్‌లో మొత్తం 36 భాషల్లో 25 వేలకుపైగా పాటలు పాడారు ఉదిత్ నారాయణన్. తెలుగులో 1990 దశకంలో టాప్ సింగర్‌గా కొనసాగారు. రామ్మ చిలకమ్మ (చూడాలని ఉంది), నా మనసుకేమయింది(నువ్వే నువ్వే),
చెప్పవే చిరుగాలి (ఒక్కడు), అందాల ఆడబొమ్మ (సమరసింహారెడ్డి), రాధే గోవిందా (ఇంద్ర)తో పాటు పలు సూపర్ హిట్ సాంగ్స్‌తో మ్యూజిక్ లవర్స్‌ను మెప్పించారు. లాంగ్ గ్యాప్ తర్వాత ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన మన శంకర వరప్రసాద్‌గారుతో టాలీవుడ్‌లోకి సింగర్‌గా రీఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో మీసాల పిల్లా పాట పాడాడు.
సంబంధిత వార్తలు

Asha Bhosle | ఆశా భోస్లే ఫ్యామిలీలో అందరూ సింగర్లే… బిజినెస్‌లోనూ సక్సెస్….
ఏప్రిల్ 12, 2026

Asha Bhosle | భర్తతో విడాకులు – మ్యూజిక్ డైరెక్టర్‌తో ప్రేమాయణం – ఆశా భోస్లే జీవితంలో సినిమాకు మించిన ట్విస్ట్‌లు
ఏప్రిల్ 12, 2026

Arijit Singh | పాలిటిక్స్‌లోకి ఆర్జిత్ సింగ్ – అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయనున్నారా?
జనవరి 29, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



