Asha Bhosle | భర్తతో విడాకులు – మ్యూజిక్ డైరెక్టర్‌తో ప్రేమాయణం – ఆశా భోస్లే జీవితంలో సినిమాకు మించిన ట్విస్ట్‌లు
సింగర్‌గా ఎనలేని పేరు ప్రఖ్యాతులు, అవార్డులు అందుకున్న అశా భోస్లే వ్యక్తిగతం జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించారు. పదహారేళ్ల వయసులోనే పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్న ఆశా భోస్లే భర్త మోసానికి గురై ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత విడాకులు తీసుకుంది. ఆ తర్వాత తనకంటే ఆరేళ్లు చిన్నవాడైన మ్యూజిక్ డైరెక్టర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
Entertainment | Published On Apr 12, 2026, 3.06 pm IST
Asha Bhosle | దిగ్గజ గాయనిగా తన సుమధుర గాత్రంతో దాదాపు ఎనభై ఏళ్ల పాటు సంగీత ప్రియులను మెప్పించింది ఆశా భోస్లే. 1950 నుంచి 2010 ఆరేడు దశాబ్దాలు పాటు బాలీవుడ్‌లో టాప్ సింగర్‌గా కొనసాగింది. వ్యాంప్ సాంగ్స్‌కు మాత్రమే పనికొస్తుందనే ముద్ర నుంచి ఏకంగా పద్మవిభూషణ్ అందుకునే స్థాయికి ఎదిగిన ఆశా భోస్తే జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం. దశాబ్దాలు గడిచినా ఆమె గొంతులోని మాధుర్యం మాత్రం మారలేదు. 1950 దశకంలో ఎంత ఉత్సాహంగా పాటలు పాడిందో అదే హుషారుతనం 2020లో కనిపించింది. హిప్‌హాప్, రాక్, మెలోడీ, రొమాంటిక్...పాట ఏదైనా దానికి తగ్గట్లుగా తన గళంలో వైవిధ్యత కనబరచడం అశా భోస్లేకే చెల్లింది. ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకుంది.
పెద్దలను ఎదురించి
ఆశా భోస్లే సినీ జీవితం అద్భుతంగా సాగింది. గాయనిగా ఆమె అందుకొని అవార్డు లేదు. ఆమె గళానికి ఫిదాకానీ సెలిబ్రిటీలు లేరు. కానీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఆశా భోస్లే ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. పదహారేళ్ల వయసులోనే పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకుంది. కానీ విభేదాల కారణంగా ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత భర్తకు విడాకులు ఇచ్చింది. ఆ తర్వాత తనకంటే ఆరేళ్లు చిన్నవాడైన మ్యూజిక్ డైరెక్టర్ ఆర్‌డీ బర్మన్‌తో ప్రేమలో పడ్డ ఆశా భోస్లే అతడిని పెళ్లి చేసుకుంది.
మొదటి పెళ్లి...
ఆశా భోస్లే మొదటి పెళ్లి పదహారేళ్ల వయసులోనే జరిగింది. లతా మంగేఫ్కర్‌తో పాటు తనకు పీఏగా పనిచేసే గణపతిరావు భోస్లేను వివాహం చేసుకుంది. ఇద్దరి మధ్య పదిహేనేళ్లు వ్యత్యాసం ఉండటంతో వీరి పెళ్లికి లతా మంగేష్కర్‌తో పాటు కుటుంబసభ్యులు అడ్డు చెప్పారు. అయినా పెద్దలను ఎదురించి గణపతిరావు భోస్లేను ఇష్టపడి వివాహమాడింది. విభేదాల కారణంగా వారి కాపురం సజావుగా సాగలేదు. డబ్బు కోసం ఆశాను వేధించడం మొదలుపెట్టాడట గణపతిరావు. సింగింగ్ కెరీర్ కు అడ్డు చెప్పాడట. భర్త పెట్టిన హింసలు భరించలేక ఒకానొక దశలో ఆశా ఆత్మహత్య చేసుకోవాలని అనుకుందట. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత భర్తకు దూరమైంది. అప్పటికీ ఆశా భోస్లే గర్భిణిగా ఉన్నారు. 1960లో గణపతిరావు నుంచి విడాకులు తీసుకున్నది. ముగ్గురు పిల్లలను కష్టపడి పెంచింది.
ఆరేళ్లు చిన్నవాడు...
ఆ తర్వాత 1980లో మరోసారి మ్యూజిక్ డైరెక్టర్ ఆర్‌డీ బర్మన్‌తో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది ఆశా భోస్లే. ఆర్‌డీ బర్మన్ దర్శకత్వంలో వచ్చిన తీస్రీ మంజిల్ మూవీతోనే సింగర్‌గా ఫేమస్ అయ్యింది ఆశా భోస్లే. ఈ సినిమాలో ఆశా పడిన ఓ మేరా సోనారే సోనా, ఆజా ఆజా మై హూ ప్యార్ తేరా పాటలు పెద్ద హిట్టయ్యాయి. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో కారావ్యాన్, యాదోంకీ భరాత్, ఖేల్ ఖేల్ మే, దీ గ్రేట్ గ్యాంబ్లర్‌తో పాటు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. హరే రామ హరే కృష్ణలోని దమ్ మరో దమ్....కారావ్యాన్‌లోని పీయాతూ అబ్ తో ఆజా...పాటలు సింగర్‌గా ఆశకు ఎనలేని పేరుప్రఖ్యాతులు తీసుకొచ్చాయి. ఆశా భోస్లేలోని ఎలాంటి పాటలు అయినా పాడగలదని ఆర్ డీ బర్మన్ సినిమాలు నిరూపించాయి.
1994లో ఆర్‌డీ బర్మన్ మరణం
సినిమాలతో మొదలైన ఆశా భోస్తే, ఆర్‌డీ బర్మన్ పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. 1980లో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఆ టైమ్‌లో ఆశా భోస్లే బాలీవుడ్‌లో టాప్ సింగర్ కాగా...ఆర్‌డీ బర్మన్ అప్‌కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్. ఆశా భోస్లే కంటే బర్మన్ ఆరేళ్లు చిన్నవాడు. అప్పటికే విడాకులు తీసుకొని ముగ్గురు పిల్లలతో ఒంటరిగా ఉంటున్నారు అశా భోస్లే. దాంతో ఆర్‌డీ బర్మన్‌తో పెళ్లి విషయంలో వెనకడుగు వేశారట. అతడి పెళ్లి ప్రపోజల్‌ను తిరస్కరించార. అయినా ఆర్‌డీ బర్మన్ మాత్రం పట్టువీడలేదని, పెళ్లికి ఒప్పుకునేవరకు తన వెంట పడ్డారని ఓ ఇంటర్వ్యూలో ఆశా భోస్లే చెప్పింది. బర్మన్ ప్రేమకు కరిగిపోయిన ఆశా చివరకు పెళ్లికి ఓకే చెప్పింది. పధ్నాలుగేళ్ల పాటు వారి దాంపత్యం జీవితం ఆనందంగా సాగింది. 1994లో ఆర్‌డీ బర్మన్ మరణం ఆశాను చాలా కృంగదీసింది. ఈ బాధ నుంచి తేరుకోవడానికి చాలా కాలమే పట్టింది.
సంబంధిత వార్తలు

Athiya Shetty | క్రికెటర్ కేఎల్ రాహుల్ భార్యను ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు – కారణం ఇదే!
ఏప్రిల్ 13, 2026

Asha Bhosle | గిన్నిస్ బుక్‌లో స్థానం – గ్రామీ అవార్డుకు నామినేట్ – ఆశా భోస్లే గురించి ఎవరికీ తెలియని విషయాలు ఇవే
ఏప్రిల్ 12, 2026

Asha Bhosle | ఆశా భోస్లే లీడ్ రోల్లో నటించిన ఒకే ఒక సినిమా ఇదే – సచిన్ టెండూల్కర్ గెస్ట్‌గా ఆడియో రిలీజ్
ఏప్రిల్ 12, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



