త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Arijit Singh | పాలిటిక్స్‌లోకి ఆర్జిత్ సింగ్ – అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీచేయ‌నున్నారా?

సింగింగ్ కెరీర్‌కు ఇటీవ‌లే గుడ్‌బై చెప్పాడు బాలీవుడ్ గాయ‌కుడు ఆర్జిత్ సింగ్‌. టాప్ సింగ‌ర్‌గా కొన‌సాగుతోన్న అత‌డు హ‌ఠాత్తుగా కెరీర్‌కు ముగింపు ప‌ల‌క‌డంపై భిన్న‌ వాద‌న‌లు వినిపిస్తోన్నాయి. ఆర్జిత్ సింగ్ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్లు చెబుతున్నారు.

N

Entertainment | Published On Jan 29, 2026, 8.01 pm IST

Arijit Singh | పాలిటిక్స్‌లోకి ఆర్జిత్ సింగ్ – అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీచేయ‌నున్నారా?
Advertisement

Arijit Singh | బాలీవుడ్ సింగ‌ర్ ఆర్జిత్ సింగ్ రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇటీవ‌లే సింగింగ్ కెరీర్‌కు గుడ్‌బై చెబుతున్న‌ట్లు ప్ర‌క‌టించి మ్యూజిక్ ల‌వ‌ర్స్‌కు షాకిచ్చాడు ఆర్జిత్ సింగ్‌. ఒకే త‌ర‌హా పాట‌లు పాడి బోర్ కొట్టింద‌ని, క్లాసిక్ మ్యూజిక్ గురించి తెలుసుకోవ‌డానికే రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించాన‌ని ఆర్జిత్ సింగ్ క్లారిటీ ఇచ్చాడు. కొత్త సింగ‌ర్స్‌ను ప్రోత్స‌హించాల‌నే ఆలోచ‌న‌తోనే తాను వైదొలుగుతున్న‌ట్లు వెల్ల‌డించాడు. బాలీవుడ్‌లో టాప్ సింగ‌ర్‌గా కొన‌సాగుతోన్న ఆర్జిత్ సింగ్ స‌డెన్‌గా రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించ‌డం వెనుక ఇంత‌కుమించి ఏదో బ‌ల‌మైన కార‌ణం ఉండి ఉంటుంద‌ని నెటిజ‌న్లు అంటున్నారు.

పాలిటిక్స్‌లోకి...

తాజాగా ఆర్జిత్ సింగ్ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్లు బాలీవుడ్‌లో పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌, మే నెల‌ల్లో ప‌శ్చిమ‌బెంగాల్‌లో ఎలెక్ష‌న్స్ జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో ఆర్జిత్ సింగ్ పోటీచేయ‌డం ఖాయ‌మ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఊరి కోసం అభివృద్ధి ప‌నులు..

ప‌శ్చిమ‌బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాకు చెందిన జియాగంజ్‌లో ఆర్జిత్ సింగ్ జ‌న్మించారు. తాను పుట్టిన ఊరి అభివృద్ది కోసం చాలా ఏళ్లుగా పాటుప‌డుతున్నారు. త‌న త‌ల్లి పేరిట ఓ హాస్పిట‌ల్ నిర్మించ‌బోతున్న‌ట్లు ఆర్జిత్ సింగ్ ప్ర‌క‌టించారు. ఆర్జిత్ సింగ్ హాస్పిట‌ల్ నిర్మాణానికి త‌మ ప్ర‌భుత్వం కూడా సాయం చేస్తుంద‌ని ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ కూడా మాటిచ్చింది. ప్ర‌స్తుతం ఈ హాస్పిట‌ల్ నిర్మాణ ప‌నులు జ‌రుగుతున్నాయ‌ట‌. ఓ స్కూల్‌తో పాటు న‌ర్సింగ్ కాలేజీని కూడా ఆర్జిత్ సింగ్ నిర్మిస్తున్నార‌ట‌.

హోట‌ల్‌...

జియా గంజ్‌లో హేష‌ల్ పేరుతో ఆర్జిత్ సింగ్ కుటుంబం ఓ రెస్టారెంట్‌ను న‌డుపుతోంది. లాభాపేక్ష‌తో కాకుండా కేవ‌లం న‌ల‌భై రూపాయ‌ల త‌క్కువ ధ‌ర‌ల‌కే సామాన్యుల‌కుఇందులో భోజ‌నాన్ని అందిస్తున్నారు. ధృతి పేరుతో ఓ ఎన్టీవోను స్థాపించారు ఆర్జిత్ సింగ్‌. ఈ ఎన్జీవో ద్వారా పేద‌ల‌కు సాయం చేస్తున్నారు.

ఎన్నిక‌ల్లో పోటీ...

జియాగంజ్‌లో ఆర్జిత్ సింగ్‌కు మంచి పేరు, గుర్తింపు, గౌర‌వం ఉన్నాయి. దాంతో రానున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆర్జిత్ సింగ్ పోటీ చేయ‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకొనే ఆయ‌న సింగింగ్ కెరీర్‌క్‌ గుడ్‌బై చెప్పిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.
ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తారా? అధికార టీఎమ్‌సీలో చేరుతారా? లేదంటే బీజేపీ నుంచి పోటీ చేస్తారా అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. టీఎమ్‌సీ, బీజేపీల‌తో జాయిన్ కాకుండా తానే సొంతంగా ఆర్జిత్ సింగ్ ఓ పార్టీని నెల‌కొల్పే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు కూడా టాక్ వినిపిస్తోంది.

Advertisement

తాజావార్తలు

Advertisement