Asha Bhosle | ఆశా భోస్లే ఫ్యామిలీలో అందరూ సింగర్లే… బిజినెస్‌లోనూ సక్సెస్….
అశా భోస్లే ఫ్యామిలీలో అందరూ సంగీతకారులే ఉన్నారు. అశా భోస్లే అక్కాచెల్లెళ్లతో సింగర్స్‌గా బాలీవుడ్‌లో మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. అశా భోస్లే ఇద్దరూ కుమారులతో పాటు కూతురు కూడా తల్లి బాటలోనే సింగింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్నారు.
Entertainment | Published On Apr 12, 2026, 4.45 pm IST
Asha Bhosle | దిగ్గజ గాయని ఆశా భోస్లే మరణంతో బాలీవుడ్‌లో విషాదం అలుముకుంది. ఎన్నో ఏళ్లుగా సంగీతప్రియులను అలరించిన సంగీత స్వరం మూగబోయింది అంటూ సినీ ప్రముఖులతో పాటు అభిమానులు ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు. సినీ సంగీత రంగానికి అశా భోస్లే చేసిన సేవలను, ఆమెతో ముడిపడిన మధుర జ్ఞాపకాలను పలువురు గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్‌లు పెడుతున్నారు.
అందరూ సింగర్సే..
అశా భోస్లే కుటుంబంలో మొత్తం సంగీత కళాకారులే ఉన్నారు. అశా భోస్లే తల్లిదండ్రులు పండిత్ దీననాథ్ మంగేష్కర్, శీవంతి బ్రిటీష్ ఇండియా హయంలో శాస్త్రీయ సంగీతకారులుగా పేరు తెచ్చుకున్నారు. 1993లో వీరికి ఆశా భోస్లే జన్మించింది. దీననాథ్ మంగేష్కర్‌కు నలుగురు కూతుళ్లు ఓ కుమారుడు జన్మించారు. ఆశా భోస్లే అక్కాచెల్లెళ్లు లతా మంగేష్కర్‌తో పాటు మీనా, ఉషా, సోదరుడు హృదయనాథ్ మంగేష్కర్ గాయనీగాయకులుగా బాలీవుడ్‌లో సెటిలయ్యారు. సక్సెస్ అయ్యారు.
తల్లి బాటలోనే...
అశా భోస్లే ఇద్దరు కుమారులతో పాటు కూతురు కూడా తల్లి బాటలోనే సింగింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్నారు. కానీ అనుకున్నంత సక్సెస్ కాలేకపోయారు. ఆశా భోస్లే తనయుల్లో హేమంత్ కొన్ని సినిమాలకు మ్యూజిక్ అందించారు. క్యాన్సర్‌తో 2015లో కన్నుమూశాడు. కూతురు వర్ష కూడా సింగర్‌గా, జర్నలిస్ట్‌గా కొనసాగింది. కుటుంబసమస్యల కారణంగా 2012లో ఆమె ఆత్మహత్య చేసుకుంది. చిన్నకుమారుడు ఆనంద్ భోస్లే దర్శకుడిగా, సింగర్‌గా పలు సినిమాలలు చేశారు.
ఆశాస్ రెస్టారెంట్...
సింగర్‌గానే కాకుండా సక్సెస్‌ఫుల్ బిజినెస్ఉమెన్‌గా ఆశా భోస్లే పేరు తెచ్చుకున్నారు. దుబాయ్, కువైట్, యూకేతో పాటు పలు దేశాల్లో ఆశాస్ పేరుతో రెస్టారెంట్లను నడుపుతున్నారు. అశా భోస్లేకు స్వతహాగా వంట చేయడం అంటే ఇష్టమట. ఆ ఇష్టంతోనే రెస్టారెంట్స్ బిజినెస్‌లోకి అడుగుపెట్టినట్లు చెప్పింది. ఆమె మొత్తం ఆస్తి విలువ 100 నుంచి 250 కోట్ల మధ్య ఉంటుందని సమాచారం.
సంబంధిత వార్తలు

Athiya Shetty | క్రికెటర్ కేఎల్ రాహుల్ భార్యను ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు – కారణం ఇదే!
ఏప్రిల్ 13, 2026

Asha Bhosle | గిన్నిస్ బుక్‌లో స్థానం – గ్రామీ అవార్డుకు నామినేట్ – ఆశా భోస్లే గురించి ఎవరికీ తెలియని విషయాలు ఇవే
ఏప్రిల్ 12, 2026

Asha Bhosle | ఆశా భోస్లే లీడ్ రోల్లో నటించిన ఒకే ఒక సినిమా ఇదే – సచిన్ టెండూల్కర్ గెస్ట్‌గా ఆడియో రిలీజ్
ఏప్రిల్ 12, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



