త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Traffic Restrictions | హైద‌రాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్ష‌లు

Traffic Restrictions | రాష్ట్ర‌ప‌తి (President) ద్రౌప‌దీ ముర్ము (Droupadi Murmu) ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో న‌గ‌రంలో ట్రాఫిక్ ఆంక్ష‌లు (Traffic Restrictions) విధిస్తున్న‌ట్లు సైబ‌రాబాద్ (Cyberabad) ట్రాఫిక్ జాయింట్ క‌మిష‌న‌ర్ ఆఫ్ పోలీస్ (Traffic Joint CP) జోయ‌ల్ డేవిస్ (Joel Davis) తెలిపారు.

A

News | Published On Dec 19, 2025, 4.46 pm IST

Traffic Restrictions | హైద‌రాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్ష‌లు
Advertisement

Traffic Restrictions | భార‌త రాష్ట్ర‌ప‌తి (President) ద్రౌప‌దీ ముర్ము (Droupadi Murmu) ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో న‌గ‌రంలో ట్రాఫిక్ ఆంక్ష‌లు (Traffic Restrictions) విధిస్తున్న‌ట్లు సైబ‌రాబాద్ (Cyberabad) ట్రాఫిక్ జాయింట్ క‌మిష‌న‌ర్ ఆఫ్ పోలీస్ (Traffic Joint CP) జోయ‌ల్ డేవిస్ (Joel Davis) తెలిపారు. ఈ ఆంక్ష‌ల కార‌ణంగా ప్ర‌ధానంగా గ‌చ్చిబౌలి (Gachibowli), ట్రిపుల్ ఐటీ (IIIT), ఐటీసీ కోహినూర్ (ITC Kohinoor) జంక్ష‌న్లలో ప్ర‌భావం ఉంటుంద‌ని తెలిపారు. ఈ ఆంక్ష‌లు శ‌నివారం మ‌ధ్యాహ్నం మూడు గంట‌ల నుంచి రాత్రి ఏడు గంట‌ల వ‌ర‌కు అమ‌లులో ఉంటాయ‌ని పేర్కొన్నారు.

శీతాకాల విడిదిలో భాగంగా హైద‌రాబాద్ న‌గ‌రంలో ఉన్న రాష్ట్ర‌ప‌తి ముర్ము శ‌నివారం రాష్ట్ర‌ప‌తి నిల‌యం నుంచి గ‌చ్చిబౌలిలోని బ్ర‌హ్మ‌కుమారీస్‌కు ప్ర‌యాణించ‌నున్నారు. రోడ్ నెంబ‌ర్ 45, కేబుల్ బ్రిడ్జి, ఐకియా ఫ్లైఓవ‌ర్‌, ఆర్బిట్రేష‌న్ రోడ్‌, డెలాయిట్‌, గ‌చ్చిబౌలి జంక్ష‌న్‌, ఇందిరా న‌గ‌ర్‌, ట్రిపుల్ ఐటీ జంక్ష‌న్‌, పుల్లెల గోపీచంద్ అకాడ‌మీ, బ్ర‌హ్మ‌కుమారీస్ రోడ్ మార్గం గుండా ఆమె ప్ర‌యాణిస్తుంద‌ని వివ‌రించారు.

వాహ‌నదారులు, ప్ర‌యాణీకులు ఆ దారి గుండా ప్ర‌యాణించ‌కుండా ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను చూసుకోవాల‌ని సూచించారు. సాధార‌ణ ప్ర‌జానీకం త‌మ ప్ర‌యాణాల‌ను అందుకు అనుగుణంగా మార్చుకోవాల‌ని చెప్పారు. ట్రాఫిక్ స‌జావుగా సాగేందుకు ట్రాఫిక్‌ పోలీసుల‌కు స‌హ‌క‌రించాల‌ని కోరారు.

Advertisement

తాజావార్తలు

Advertisement