Nivetha Pethuraj | సినిమాలు వదిలేసి హిమాలయాలకు వెళ్లిపోవాలనుకున్నా – అల్లు అర్జున్ హీరోయిన్ కామెంట్స్
సినిమాలు వదిలేసి హిమాలయాలకు వెళ్లిపోవాలని అనుకున్నానని నివేదా పేతురాజ్ చెప్పింది. మళ్లీ సినిమాలు చేస్తానని ఊహించలేదని అన్నది. ఇటీవల రిలీజైన సింగ్ గీతం మూవీతో దాదాపు మూడేళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది నివేదా పేతురాజ్. తన రీఎంట్రీపై సింగ్ గీతం సక్సెస్ మీట్‌లో ఆసక్తికర కామెంట్స్ చేసింది.
Entertainment | Published On Jun 15, 2026, 3.57 pm IST
Nivetha Pethuraj | సింగ్ గీతం మూవీతో దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత కెమెరా ముందుకొచ్చింది హీరోయిన్ నివేదా పేతురాజ్. సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ సినిమాలో స్పెషల్ రోల్‌లో కనిపించి ఆడియెన్స్‌ను సర్‌ప్రైజ్ చేసింది. తెలుగులో 2023లో వచ్చిన విశ్వక్‌సేన్ ధమ్కీ తర్వాత సడెన్‌గా సినిమాలకు దూరమైంది నివేదా పేతురాజ్.
ప్రేమ...పెళ్లి....
దుబాయ్‌కి చెందిన ఓ వ్యాపారవేత్తను ప్రేమించిన ఈ కోలీవుడ్ బ్యూటీ అతడిని పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. కానీ ఎంగేజ్‌మెంట్‌తోనే ఈ అమ్మడి ప్రేమ, పెళ్లి కథకు పుల్‌స్టాప్ పడింది. సినిమాలకు దూరం కావడం, వ్యక్తిగత జీవితంలోని ఒడిదుడుకులపై సింగ్ గీతం సక్సెస్ మీట్‌లో నివేదా పేతురాజ్ రియాక్ట్ అయ్యింది. ఈ వేడుకలో మాట్లాడుతూ స్టేజ్‌పైనే ఎమోషనల్ అయ్యింది.
సినిమాలకు గుడ్‌బై
"హీరోయిన్‌గా కెరీర్ సాఫీగా సాగిపోతున్న టైమ్‌లోనే కొన్ని పరిస్థితుల వల్ల 2023లో సినిమాలకు గుడ్‌బై చెప్పాలని అనుకున్నా. యాక్టింగ్ లైఫ్ వద్దనిపించింది. వచ్చిన ఆఫర్లను రిజెక్ట్ చేశా. హిమాలయాలకు వెళ్లిపోయి మెడిటేషన్ చేసుకుంటూ ప్రశాంత జీవితం గడపాలని అనుకున్నా. కొన్ని సార్లు అనాలోచితంగా తీసుకునే తప్పుడు నిర్ణయాలు జీవితాన్ని గందరగోళంలో పడేస్తాయి. ఏం జరుగుతుందో, ఎటు వెళుతున్నామో అర్థం కాదు. నా లైఫ్‌లో అదే జరిగింది. మళ్లీ సినిమాల్లోకి వస్తానని, కెమెరా ముందు నటిస్తానని అస్సలు ఊహించలేదు. సింగ్ గీతంలో నన్ను నేను స్క్రీన్‌పై చూసుకోగానే కన్నీళ్లు ఆగలేదు" అని నివేదా పేతురాజ్ చెప్పింది.
చిరంజీవి సినిమాలో...
సింగ్ గీతం సినిమాతో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన నివేదా పేతురాజ్ ఆఫర్లు గట్టిగానే వస్తోన్నాయి. ప్రస్తుతం చిరంజీవి హీరోగా బాబీ డైరెక్షన్‌లో రూపొందుతోన్న మెగా 158 మూవీలో నివేదా పేతురాజ్ ఓ కీలక పాత్రలో కనిపించబోతుంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ అయ్యింది. అలాగే వెంకటేష్ ఆదర్శ కుటుంబం సినిమాలో స్పెషల్ సాంగ్ నివేదా పేతురాజ్ కనిపించబోతున్నది.
అల వైకుంఠపురములో...
తెలుగులో మెంటల్ మదిలో, చిత్రలహరి, బ్రోచేవారెవరరురాతో పాటు మరికొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్‌లో రూపొందిన అల వైకుంఠపురములో సినిమాలో పూజా హెగ్డేతో పాటు మరో నాయికగా నివేదా పేతురాజ్ కనిపించింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Singeetham Srinivasa Rao | ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
అక్టోబర్ 4, 2026

Naga Chaitanya | టైమ్ ట్రావెల్ లవ్‌స్టోరీలో అక్కినేని హీరో – కొత్త హీరోయిన్‌తో రొమాన్స్
అక్టోబర్ 2, 2026

Sudigali Sudheer | ఎట్టకేలకు థియేటర్లలోకి సుడిగాలి సుధీర్ కాంట్రవర్షియల్ మూవీ – హీరోయిన్‌గా కోలీవుడ్ బోల్డ్ బ్యూటీ
అక్టోబర్ 1, 2026
తాజావార్తలు
- ●Nageshwar Rao | రాజకీయాల్లోకి సీబీఐ మాజీ డైరెక్టర్.. ఎస్ఎస్పీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు
- ●Supreme Court | సుప్రీంకోర్టులో జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలు.. 250 పోస్టులతో నోటిఫికేషన్
- ●Weekly Horoscope | అక్టోబర్ 5 నుంచి 11 వరకు.. ఈ రాశుల వారికి శుభ ఫలితాలు
- ●Singeetham Srinivasa Rao | ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
- ●తిరిగేది తక్కువ… రిలాక్స్ అయ్యేది ఎక్కువ! యువత ‘రూమ్ రాటింగ్’
- ●Horoscope | అక్టోబర్ 4 ఆదివారం.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే?

Nageshwar Rao | రాజకీయాల్లోకి సీబీఐ మాజీ డైరెక్టర్.. ఎస్ఎస్పీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు

Supreme Court | సుప్రీంకోర్టులో జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలు.. 250 పోస్టులతో నోటిఫికేషన్

Weekly Horoscope | అక్టోబర్ 5 నుంచి 11 వరకు.. ఈ రాశుల వారికి శుభ ఫలితాలు

Singeetham Srinivasa Rao | ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత



