Alia Bhatt | ప్రభాస్ కల్కి 2లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ – దీపికా పడుకోణ్ ప్లేస్‌లో ఆర్ఆర్ఆర్ బ్యూటీ?
ప్రభాస్ కల్కి 2లో కమల్‌హాసన్, అమితాబ్‌బచ్చన్‌తో పాటు పలువురు పాన్ ఇండియన్ యాక్టర్లు నటిస్తోన్నారు. తాజాగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియాభట్ కూడా జాయిన్ అయినట్లు సమాచారం. ఈ సీక్వెల్‌లో ఓ కీలక పాత్రలో ఆర్ఆర్ఆర్ బ్యూటీ కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Entertainment | Published On Jun 16, 2026, 12.59 pm IST
Alia Bhatt | ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతోన్న కల్కి 2 మూవీపై మరో ఇంట్రెస్టింగ్ రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రభాస్‌తో పాటు ఈ సినిమాలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ సహా పలువురు పాన్ ఇండియన్ యాక్టర్లు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. తాజాగా మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కల్కి 2లో నటించబోతుందట. అంతే కాకుండా సైలెంట్‌గా ఈ సినిమా సెట్స్‌లో కూడా అడుగుపెట్టిందట. ఆ హీరోయిన్ మరెవరో కాదు అలియా భట్.
బాలీవుడ్ బ్యూటీ...
ప్రస్తుతం కల్కి 2 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. హైదరాబాద్‌తో పాటు చెన్నైలో వేసిన స్పెషల్ సెట్స్‌లో ప్రధాన తారాగణంపై నాగ్ అశ్విన్ కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. జూలై నుంచి ఈ సీక్వెల్ చిత్రీకరణలో ప్రభాస్ భాగం కాబోతున్నారు.. తాజాగా కల్కి 2లో ఓ కీలక పాత్ర కోసం మేకర్స్ బాలీవుడ్ బ్యూటీ అలియాభట్‌ను తీసుకున్నట్లు సమాచారం. . ఇటీవలే ఈ సినిమా సెట్స్‌లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ ఐదు రోజులు షూటింగ్‌ను కూడా పూర్తిచేసిందట. కల్కి పార్ట్ వన్‌లో దీపికా పడుకోణ్ హీరోయిన్‌గా నటించింది. క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా సీక్వెల్ నుంచి మేకర్స్ దీపికాను తప్పించారు. దీపికా ప్లేస్‌లో అలియాభట్ ఎంపికైనట్లు ప్రచారం జరుగుతోంది. కానీ ఆ వార్తల్లో నిజం లేదని సమాచారం. దీపికా క్యారెక్టర్లో కాకుండా మరో సర్‌ప్రైజింగ్ రోల్ కోసం అలియాను మేకర్స్ తీసుకున్నారట. పాత్ర లెంగ్త్ తక్కువే అయినా కథను మలుపుతిప్పిలా ఈ బాలీవుడ్ బ్యూటీ పాత్ర ఉంటుందని అంటున్నారు. బాలీవుడ్‌లో అలియాకు ఉన్న క్రేజ్ కూడా కల్కి 2 హిందీ ప్రమోషన్స్‌కు హెల్పవుతుందని ఆలోచనతోనే మేకర్స్ ఉన్నట్లు సమాచారం. ఆర్ఆర్ఆర్ తర్వాత తెలుగులో అలియా భట్ చేస్తోన్న సెకండ్ మూవీ ఇది.
సాయిపల్లవితో రీప్లేస్...
కాగా కల్కి 2లో దీపికా పడుకోణ్ పాత్రను సాయిపల్లవితో రీప్లేస్ చేయబోతున్నట్లు చాలా కాలంగా వార్తలొస్తున్నాయి. ఈ రూమర్లపై సింగ్ గీతం ప్రమోషన్స్‌లో డైరెక్టర్ నాగ్ అశ్విన్ రియాక్ట్ అయ్యారు. ఈ పాత్రకు ఎవరిని తీసుకోవాలా అన్న దానిపై డిస్కషన్స్ జరుగుతోన్నాయని, త్వరలోనే ఈ రోల్‌పై క్లారిటీ ఇస్తామని అన్నారు.కల్కి పార్ట్ వన్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. 1100 కోట్లకుపైగా వసూళ్లను సాధించడంతో సీక్వెల్‌పై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Kishan Reddy | దేవుళ్లపై అవాకులుచెవాకులు.. గ్యారంటీలు అమలుచేయకుండా నాటకాలు.. సీఎం రేవంత్‌పై కిషన్ రెడ్డి ఫైర్
- ●Vijaya Reddy | ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఆపండి.. హైకోర్టును ఆశ్రయించిన విజయారెడ్డి
- ●Instagram | ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఏఐ టూల్.. క్రియేటర్లకు ఇక డేటానే గైడ్..
- ●Badam Ki Jali | హైదరాబాద్ అంటే బిర్యానీ మాత్రమే కాదు.. 200 ఏళ్ల నాటి నిజామీ మిఠాయి గురించి తెలుసా..?
- ●Telangana | రాష్ట్రంలో ఇక వానలు లేనట్టే.. ఎండాకాలాన్ని తలపించేలా అక్టోబర్..!
- ●Congress | కాంగ్రెస్‌లో బిగ్ ట్విస్ట్.. పీసీసీ చీఫ్ రాజీనామా

Kishan Reddy | దేవుళ్లపై అవాకులుచెవాకులు.. గ్యారంటీలు అమలుచేయకుండా నాటకాలు.. సీఎం రేవంత్‌పై కిషన్ రెడ్డి ఫైర్

Vijaya Reddy | ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఆపండి.. హైకోర్టును ఆశ్రయించిన విజయారెడ్డి

Instagram | ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఏఐ టూల్.. క్రియేటర్లకు ఇక డేటానే గైడ్..

Badam Ki Jali | హైదరాబాద్ అంటే బిర్యానీ మాత్రమే కాదు.. 200 ఏళ్ల నాటి నిజామీ మిఠాయి గురించి తెలుసా..?






