Nivetha Pethuraj | డీ గ్లామర్ పాత్రలో నివేదా – టాలీవుడ్ హీరోతో రెండోసారి రొమాన్స్
సింగ్ గీతంతో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన నివేదా పేతురాజ్ బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్లు అందుకుంటోంది. ఇటీవలే చిరంజీవి, బాబీ మూవీ సెట్స్‌లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ తాజాగా మరో ఆఫర్ అందుకున్నట్లు సమాచారం. రామ్ పోతినేని డైరెక్షనల్ డెబ్యూ సినిమాలో ఓ హీరోయిన్‌గా నివేదా పేతురాజ్ నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.
Entertainment | Published On Jun 23, 2026, 2.47 pm IST
Nivetha Pethuraj | సింగ్ గీతం సినిమాతో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది నివేదా పేతురాజ్. కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ సినిమాలో స్పెషల్ రోల్‌లో కనిపించి సర్‌ప్రైజ్ చేసింది. మెగాస్టార్ చిరంజీవి, బాబీ డైరెక్షన్‌లో రూపొందుతోన్న సినిమాకు నివేదా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమా షూటింగ్‌లోనూ అడుగుపెట్టింది. తాజాగా టాలీవుడ్‌లో ఈ తమిళ బ్యూటీ మరో బంపరాఫర్ అందుకున్నట్లు సమాచారం. రామ్ పోతినేని సినిమాలో ఛాన్స్ దక్కించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
సైకలాజికల్ థ్రిల్లర్...
రామ్ పోతినేని దర్శకుడిగా ఎంట్రీ ఇస్తూ ఓ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీని రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో అతడే హీరోగా కనిపించబోతున్నాడు. ప్రస్తుతం రామ్ డైరెక్షనల్ డెబ్యూ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతోన్నాయి. రామ్ తమ్ముడు కృష్ణ చైతన్య ఈ పాన్ ఇండియన్ సినిమాను నిర్మిస్తున్నారు.
డీ గ్లామర్ పాత్రలో...
కథానుగుణంగా ఈ సినిమాలో ఇద్దరూ హీరోయిన్లు ఉంటారని టాక్. ఓ హీరోయిన్‌గా నివేదా పేతురాజ్‌ను ఫైనల్ చేశారట. డీ గ్లామర్ పాత్రలో ఈ కోలీవుడ్ సుందరి కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. రామ్, నివేదా కాంబినేషన్‌లో ఇది సెకండ్ మూవీ. రామ్ రెడ్ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా నివేదా నటించింది. కాగా మూడేళ్ల పాటు టాలీవుడ్‌కు దూరంగా ఉన్న ఈ బ్యూటీ బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్లు అందుకోవడం ఆసక్తికరంగా మారింది. రామ్ సినిమాలో నివేదాపాటు మరో హీరోయిన్‌గా కయదు లోహర్ నటిస్తోన్నట్లు వార్తలొస్తున్నాయి.US-Israel-Iran WarUS-Israel-Iran War
బడ్జెట్ తగ్గింపు....
డైరెక్టర్‌గా తన తొలి సినిమాను 30 కోట్ల లోపు కంప్లీట్ చేయాలని రామ్ అనుకున్నారట. కానీ రెమ్యూనరేషన్లతో కలిపి మొత్తం బడ్జెట్ 45 కోట్లను దాటినట్లు సమాచారం. ప్రస్తుతం బడ్జెట్ తగ్గించే మార్గాల గురించి అన్వేషిస్తున్నారట. ఈ సినిమాకు నేషనల్ అవార్డ్ విన్నర్ తిరు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. రామ్ హిట్టు అందుకొని చాలా కాలమైంది. అతడి కెరీర్‌కు ఈ సినిమా కీలకంగా మారింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Nageshwar Rao | రాజకీయాల్లోకి సీబీఐ మాజీ డైరెక్టర్.. ఎస్ఎస్పీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు
- ●Supreme Court | సుప్రీంకోర్టులో జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలు.. 250 పోస్టులతో నోటిఫికేషన్
- ●Weekly Horoscope | అక్టోబర్ 5 నుంచి 11 వరకు.. ఈ రాశుల వారికి శుభ ఫలితాలు
- ●Singeetham Srinivasa Rao | ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
- ●తిరిగేది తక్కువ… రిలాక్స్ అయ్యేది ఎక్కువ! యువత ‘రూమ్ రాటింగ్’
- ●Horoscope | అక్టోబర్ 4 ఆదివారం.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే?

Nageshwar Rao | రాజకీయాల్లోకి సీబీఐ మాజీ డైరెక్టర్.. ఎస్ఎస్పీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు

Supreme Court | సుప్రీంకోర్టులో జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలు.. 250 పోస్టులతో నోటిఫికేషన్

Weekly Horoscope | అక్టోబర్ 5 నుంచి 11 వరకు.. ఈ రాశుల వారికి శుభ ఫలితాలు

Singeetham Srinivasa Rao | ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత





