Dreame L50 Plus | డ్రిమీ ఎల్50 సిరీస్ రోబోటిక్ వ్యాక్యూమ్‌లు.. ఆకట్టుకునే ఫీచర్లు..
Dreame L50 Plus | డ్రిమీ టెక్నాలజీ భారత్‌లో కొత్తగా డ్రిమీ ఎల్50 ప్లస్, డ్రిమీ ఎల్50 రోబోటిక్ వ్యాక్యూమ్ క్లీనర్లను విడుదల చేసింది. అధిక సక్షన్ పవర్, స్మార్ట్ నావిగేషన్, మాపింగ్ ఫీచర్లతోపాటు తక్కువ నిర్వహణ అవసరమయ్యే విధంగా ఈ డివైస్‌లను రూపొందించింది. డ్రిమీ ఎల్50 ప్లస్ 25వేల పాస్కల్ సక్షన్ పవర్‌తో వస్తుంది.
Technology | Published On Jul 6, 2026, 3.26 pm IST
Dreame L50 Plus | డ్రిమీ టెక్నాలజీ భారత్‌లో కొత్తగా డ్రిమీ ఎల్50 ప్లస్, డ్రిమీ ఎల్50 రోబోటిక్ వ్యాక్యూమ్ క్లీనర్లను విడుదల చేసింది. అధిక సక్షన్ పవర్, స్మార్ట్ నావిగేషన్, మాపింగ్ ఫీచర్లతోపాటు తక్కువ నిర్వహణ అవసరమయ్యే విధంగా ఈ డివైస్‌లను రూపొందించింది. డ్రిమీ ఎల్50 ప్లస్ 25వేల పాస్కల్ సక్షన్ పవర్‌తో వస్తుంది. ఇందులో 5 లీటర్ల డస్ట్ బ్యాగ్ ఆధారిత 120 రోజుల హ్యాండ్స్-ఫ్రీ డస్ట్ కలెక్షన్ సిస్టమ్ ఉండటంతో తరచూ డస్ట్ ఖాళీ చేయాల్సిన అవసరం ఉండదు. డ్యూయల్ రొటరీ మాప్ ప్యాడ్స్‌తో పాటు మాప్ ఎక్స్‌టెండ్ టెక్నాలజీ ఉండటంతో గోడల అంచులు, మూలలను కూడా సమర్థంగా శుభ్రం చేస్తుంది. హెయిర్ చిక్కుకుపోకుండా ఉండేందుకు డ్యూయల్ యాంటీ-టాంగిల్ బ్రష్ సిస్టమ్‌ను అందించారు. కార్పెట్‌ను గుర్తించిన వెంటనే 10.5 మిల్లీమీటర్ల ఇంటెలిజెంట్ మాప్ లిఫ్ట్ ద్వారా మాప్ ప్యాడ్లు పైకి విస్తరిస్తాయి. అదే సమయంలో సక్షన్ పవర్‌ను ఆటోమేటిక్‌గా పెంచి మెరుగైన క్లీనింగ్‌ను అందిస్తుంది.
స్మార్ట్ పాత్ ఫైండర్ నావిగేషన్..
ఇందులో స్మార్ట్ పాత్‌ఫైండర్ నావిగేషన్, 3డి స్ట్రక్చర్డ్ లైట్ టెక్నాలజీ ఉండటంతో ఇంటి మ్యాపింగ్, సరైన రూట్ ప్లానింగ్, అడ్డంకులను గుర్తించి తప్పించుకునే సామర్థ్యం లభిస్తుంది. అలాగే 300 మిల్లీలీటర్ల వాటర్ ట్యాంక్, 230 మిల్లీలీటర్ల డస్ట్ బాక్స్, 32 స్థాయిల వాటర్ ఫ్లో అడ్జస్ట్‌మెంట్‌ను అందించారు. దీంతో వ్యాక్యూమింగ్, మాపింగ్ పనులను ఒకేసారి నిర్వహించవచ్చు.
25వేల పాస్కల్ సక్షన్ పవర్..
డ్రిమీ ఎల్50 ప్లస్ రోబోట్ వ్యాక్యూమ్ పరిమాణం 350 × 350 × 97 మిల్లీమీటర్లు. బేస్ స్టేషన్ పరిమాణం 440 × 298 × 426 మిల్లీమీటర్లు. బేస్ స్టేషన్ బరువు 3.82 కిలోలు కాగా, రోబోట్ వ్యాక్యూమ్ బరువు 3.85 కిలోలు. ఇందులో 4 లీటర్ల డస్ట్ బ్యాగ్, 300 మిల్లీలీటర్ల వాటర్ ట్యాంక్, 230 మిల్లీలీటర్ల డస్ట్ బాక్స్, 20 మిల్లీమీటర్ల అడ్డంకులను దాటే సామర్థ్యం, 5200ఎంఏహెచ్ బ్యాటరీ, థర్డ్ పార్టీ వాయిస్ కంట్రోల్ సపోర్ట్ ఉన్నాయి. డ్రిమీ ఎల్50 కూడా 25వేల పాస్కల్ సక్షన్ పవర్‌తోనే వస్తుంది. అల్ట్రాసోనిక్ కార్పెట్ డిటెక్షన్ ద్వారా కార్పెట్‌ను గుర్తించిన వెంటనే సక్షన్ పవర్‌ను ఆటోమేటిక్‌గా పెంచి లోతైన క్లీనింగ్‌ను అందిస్తుంది. ఇందులో కూడా డ్యూయల్ రొటరీ మాప్ ప్యాడ్స్, మాప్ ఎక్స్‌టెండ్ ఎడ్జ్ క్లీనింగ్, 10.5 మిల్లీమీటర్ల ఇంటెలిజెంట్ మాప్ లిఫ్ట్ ఉన్నాయి. ఎల్‌డీఎస్ లేజర్ నావిగేషన్ ద్వారా మ్యాపింగ్, రూట్ ప్లానింగ్, అడ్డంకుల గుర్తింపు వంటి ఫీచర్లను అందిస్తుంది.
5 లెవల్స్‌లో క్లీనింగ్..
క్లీనింగ్‌ను 5 సక్షన్ లెవెల్స్, 32 వాటర్ ఫ్లో లెవెల్స్ ద్వారా వినియోగదారులు తమ అవసరానికి అనుగుణంగా సెట్ చేసుకోవచ్చు. 5200ఎంఏహెచ్ బ్యాటరీతో గరిష్టంగా 250 నిమిషాల వరకు పనిచేస్తుంది. యాప్ ద్వారా మ్యాపింగ్, జోనింగ్, షెడ్యూలింగ్, వాయిస్ అసిస్టెంట్ ఇంటిగ్రేషన్ వంటి సదుపాయాలు పొందవచ్చు. పెంపుడు జంతువుల వెంట్రుకలు లేదా పొడవైన జుట్టు చిక్కుకోకుండా ఉండే యాంటీ-టాంగిల్ బ్రష్ సిస్టమ్‌ను కూడా ఇందులో అందించారు. డ్రిమీ ఎల్50 రోబోట్ వ్యాక్యూమ్ పరిమాణం 350 × 350 × 96.9 మిల్లీమీటర్లు. ఛార్జింగ్ డాక్ పరిమాణం 126 × 130 × 93 మిల్లీమీటర్లు. రోబోట్ వ్యాక్యూమ్ బరువు 3.80 కిలోలు కాగా, ఛార్జింగ్ డాక్ బరువు 0.37 కిలోలు. ఇందులో 300 మిల్లీలీటర్ల వాటర్ ట్యాంక్, 400 మిల్లీలీటర్ల డస్ట్ బాక్స్, 20 మిల్లీమీటర్ల అడ్డంకులను దాటే సామర్థ్యం, 5200ఎంఏహెచ్ బ్యాటరీ, థర్డ్ పార్టీ వాయిస్ కంట్రోల్ సపోర్ట్ ఉన్నాయి. ఈ మోడల్‌లో ఆటో-ఎంప్టీ ఫీచర్ మాత్రం లేదు.
ధర ఎంతంటే..
భారత్‌లో డ్రిమీ ఎల్50 ప్లస్ ధర రూ.34,999 ఉండగా, డ్రిమీ ఎల్50 ధరను రూ.27,999గా నిర్ణయించారు. ఈ రెండు మోడళ్లు అమెజాన్ ఇండియా, డ్రిమీ ఇండియా వెబ్‌సైట్‌లో లభ్యమవుతున్నాయి. సోమవారం నుంచే వీటిని విక్రయిస్తున్నారు. ఈ డివైస్‌లపై ఒక సంవత్సరం వారంటీ అందిస్తున్నారు. అలాగే దేశవ్యాప్తంగా 160కు పైగా నగరాల్లో అమ్మకాల అనంతర సేవలు, ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఇన్‌స్టాలేషన్‌తోపాటు పిక్-అప్, డ్రాప్ సర్వీసులను కూడా కంపెనీ అందిస్తోంది.
తాజావార్తలు
- ●Telangana Man Dies in Bahrain | బహ్రెయిన్‌లో విషాదం.. సముద్రంలో మునిగి తెలంగాణ వాసి మృతి
- ●Tummala Nageswara Rao | ఇప్పటికి రైతు ఖాతాల్లో రూ.7490.72 కోట్లు జమ
- ●Revanth Reddy | నగర ఎకోపార్కులన్నీ అభివృద్ధి చేయాలి.. గుర్రంగూడ ఎకోపార్క్ తరహాలో ఉండాలి
- ●Egg | గుడ్డు పగలగొట్టగానే కనిపించే తెల్లని దారం లాంటి పదార్థం ఏమిటి? దాన్ని తినవచ్చా..?
- ●LPG Imports | ఇంధన భద్రతే లక్ష్యం.. అమెరికా నుంచి ఎల్పీజీ దిగుమతులను పెంచే యోచనలో భారత్..!
- ●Living Woman Funeral Jharkhand | బతికుండగానే కూతురికి దహన సంస్కారాలు.. కులాంతర వివాహం చేసుకుందని కన్నవాళ్ల దారుణం

Telangana Man Dies in Bahrain | బహ్రెయిన్‌లో విషాదం.. సముద్రంలో మునిగి తెలంగాణ వాసి మృతి

Tummala Nageswara Rao | ఇప్పటికి రైతు ఖాతాల్లో రూ.7490.72 కోట్లు జమ

Revanth Reddy | నగర ఎకోపార్కులన్నీ అభివృద్ధి చేయాలి.. గుర్రంగూడ ఎకోపార్క్ తరహాలో ఉండాలి

Egg | గుడ్డు పగలగొట్టగానే కనిపించే తెల్లని దారం లాంటి పదార్థం ఏమిటి? దాన్ని తినవచ్చా..?




