Ponnam Prabhakar | ఇది అవమానం.. మన పోరాటంపై దాడి.. గౌరవంపై గాయం: పొన్నం ప్రభాకర్
Ponnam Prabhakar | తెలంగాణ అంటే గౌరవం.. తెలంగాణ అంటే ఆత్మగౌరవం.. మన గౌరవాన్ని ఎవరూ తాకలేరు.. మన చరిత్రను ఎవరూ వక్రీకరించలేరు మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. మన గొంతు వినిపించి ఆవేశం చూపించాలని.. మనందరం కలిసి “తెలంగాణ గౌరవం మా ప్రాణం” అని చాటాలని కోరారు. ఎట్టిపరిస్థితుల్లోనూ “అవమానాన్ని సహించమని తక్షణమే క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.
త్రినేత్ర.న్యూస్: తెలంగాణ అంటే గౌరవం.. తెలంగాణ అంటే ఆత్మగౌరవం.. మన గౌరవాన్ని ఎవరూ తాకలేరు.. మన చరిత్రను ఎవరూ వక్రీకరించలేరు మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. మన గొంతు వినిపించి ఆవేశం చూపించాలని.. మనందరం కలిసి “తెలంగాణ గౌరవం మా ప్రాణం” అని చాటాలని కోరారు. ఎట్టిపరిస్థితుల్లోనూ “అవమానాన్ని సహించమని తక్షణమే క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. గాంధీ భవన్(Gandhi Bhavan)లో ఆయన మీడియా(Press meet)తో మాట్లాడుతూ తేజస్వీ సూర్యపై నిప్పులు చెరిగారు.
తెలంగాణ సోదరీ సోదరిమణులారా.. ఈ నేల కోసం పోరాడిన ప్రతి విద్యార్థికి… ప్రాణాలు అర్పించిన ప్రతి యువకుడికి… కన్నీళ్లు పెట్టుకున్న ప్రతి తల్లికి… నా వందనం! ఈ రోజు మన గౌరవం మీద దాడి జరిగింది! తెజస్వీ సూర్య (Tejasvi Surya) అనే వ్యక్తి పార్లమెంట్‌లో నిలబడి… తెలంగాణ ఏర్పాటును దేశ విభజనతో పోల్చాడు. ఇది మాట కాదు.. ఇది తెలంగాణ ప్రజలపై అవమానం. ఇది మన పోరాటంపై దాడి. ఇది మన ఆత్మగౌరవంపై గాయం. తెలంగాణ ఎలా వచ్చింది? ఇది రక్తంతో కాదు… ఇది రాజ్యాంగంతో వచ్చింది. ఇది హింసతో కాదు… ఇది ప్రజాస్వామ్యంతో వచ్చింది. అలాంటి పవిత్రమైన ఉద్యమాన్ని… దేశ విభజనతో పోల్చే హక్కు ఎవరికీ లేదు. ఇది తప్పు కాదు అంటారా? కాదు… ఇది చరిత్రను వక్రీకరించడం. ఇది తెలంగాణను తక్కువ చేయాలనే ప్రయత్నం.
తెలంగాణ ప్రజలారా… మనం నిశ్శబ్దంగా ఉందామా? లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. ఇలాంటి వ్యాఖ్యలు ఏమి చేస్తాయి? రాష్ట్రాల మధ్య విద్వేషాలు పెంచుతాయి. ప్రజల మధ్య అపోహలు కలిగిస్తాయి. దేశ ఐక్యతను దెబ్బతీస్తాయి. పార్లమెంట్ అంటే గౌరవం ఉండాలి… అది చౌకబారు రాజకీయాల వేదిక కాదు! ఈ వేదిక నుండి నేను స్పష్టంగా చెబుతున్నాను, ఆ వ్యాఖ్యలను వెంటనే లోక్‌సభ రికార్డ్స్ నుండి తొలగించాలి. ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి! ఇది పార్లమెంటరీ నియమావళి ఉల్లంఘనగా పరిగణించాలి! అవసరమైతే సభ్యత్వంపై కూడా చర్యలు తీసుకోవాలి!
తెలంగాణ అంటే గౌరవం… తెలంగాణ అంటే ఆత్మగౌరవం… మన గౌరవాన్ని ఎవరూ తాకలేరు! మన చరిత్రను ఎవరూ వక్రీకరించలేరు! తెలంగాణ ప్రజలారా…మన గొంతు వినిపించాలి… మన ఆవేశం చూపించాలి…మనందరం కలిసి ఒక్క మాట చెబుదాం..“తెలంగాణ గౌరవం మా ప్రాణం”.. “అవమానాన్ని సహించం”.. “ తక్షణమే క్షమాపణ చెప్పాల్సిందే” అని పొన్నం డిమాండ్ చేశారు.
సంబంధిత వార్తలు

Seating Row | మీడియా సమావేశంలో కుర్చీ కోసం లొల్లి.. జిల్లా మాజీ అధ్యక్షుడి చెంప చెల్లుమనిపించిన నేత
అక్టోబర్ 4, 2026

Telangana Auto Drivers Welfare Board | ఆటో డ్రైవర్లకు తెలంగాణ సర్కార్ శుభవార్త: త్వరలో వెల్ఫేర్ బోర్డు.. ఒక్కో ఆటోకు రూ.1.5 లక్షల సబ్సిడీ
అక్టోబర్ 3, 2026

Saleem Pasha | రాష్ట్రంలో 90 లక్షలకు పైగా ఓట్లు తొలగించే కుట్ర : సలీం పాషా
అక్టోబర్ 3, 2026
తాజావార్తలు
- ●Medicover | కంగ్రాట్స్ రేవంత్ రెడ్డిగారు.. రూ.13,200 కోట్లు.. హైదరాబాద్‌లో వెలసిన ఫ్లెక్సీలు..
- ●Singeetham Srinivasa Rao | చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లతో సింగీతం సినిమాలు - అనౌన్స్మెంట్తోనే సంచలనం ..కానీ...
- ●పెగ్‌తో నిద్ర ఓకే… మరి ఫ్రెష్‌నెస్ ఎక్కడ?
- ●Theenmar Mallanna | బహుజన్ వర్కర్స్ యూనియన్ను గెలిపిస్తే.. ఆరు నెలల్లో ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
- ●Community Kitchen | మునగాలలో కమ్యూనిటీ కిచెన్.. 60 వేల మంది విద్యార్థులకు అల్పాహారం
- ●Seating Row | మీడియా సమావేశంలో కుర్చీ కోసం లొల్లి.. జిల్లా మాజీ అధ్యక్షుడి చెంప చెల్లుమనిపించిన నేత

Medicover | కంగ్రాట్స్ రేవంత్ రెడ్డిగారు.. రూ.13,200 కోట్లు.. హైదరాబాద్‌లో వెలసిన ఫ్లెక్సీలు..

Singeetham Srinivasa Rao | చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లతో సింగీతం సినిమాలు - అనౌన్స్మెంట్తోనే సంచలనం ..కానీ...

పెగ్‌తో నిద్ర ఓకే… మరి ఫ్రెష్‌నెస్ ఎక్కడ?

Theenmar Mallanna | బహుజన్ వర్కర్స్ యూనియన్ను గెలిపిస్తే.. ఆరు నెలల్లో ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న



