Ponguleti Srinivas Reddy | క్యూర్ పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణమే లక్ష్యం.. యుద్ధ ప్రతిపాదికన స్థలాలు గుర్తించాలి
Ponguleti Srinivas Reddy | పేదల ఉపాధికి ఎలాంటి ఆటంకం కలగకుండా, వారు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకు సమీపంలోనే ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.
ఈ నెలాఖరులోగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి
సాంకేతిక పరిజ్ఞానంతో ఆన్‌లైన్ డ్రా
లబ్ధిదారులు ఎప్పుడైనా యూట్యూబ్‌లో వివరాలు చూసుకునే అవకాశం
Ponguleti Srinivas Reddy | త్రినేత్ర న్యూస్ : పేదల ఉపాధికి ఎలాంటి ఆటంకం కలగకుండా, వారు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకు సమీపంలోనే ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఒకవైపు ప్రభుత్వ భూములను పరిరక్షిస్తూనే, మరోవైపు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి అవసరమైన భూములను యుద్ధప్రాతిపదికన గుర్తించాలని అధికారులను ఆదేశించారు.
శుక్రవారం సచివాలయంలోని తన ఛాంబర్‌లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లు, ఆర్డీవోలు, హౌసింగ్ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం, రెండో, మూడో విడతలకు అవసరమైన భూముల గుర్తింపు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ కార్యదర్శి డీఎస్ లోకేష్ కుమార్, హౌసింగ్ శాఖ కార్యదర్శి వీపీ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. క్యూర్ పరిధిలో మొత్తం లక్ష ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు. మొదటి విడతలో ప్రతి నియోజకవర్గంలో సుమారు 500 ఇళ్ల చొప్పున నిర్మాణాలు చేపడుతున్నామని వెల్లడించారు. మొదటి విడతకు సంబంధించి రెండు, మూడు నియోజకవర్గాలకు అవసరమైన స్థలాల గుర్తింపును వేగవంతం చేయాలని, మిగిలిన నియోజకవర్గాల్లో రెండో, మూడో విడతల నిర్మాణాలకు అవసరమైన భూములను కూడా ముందుగానే గుర్తించి సిద్ధంగా ఉంచాలని కలెక్టర్లను ఆదేశించారు.
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల ఎంపికలో పారదర్శకతకు పెద్దపీట
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల్లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అర్హులైన లబ్ధిదారులకు న్యాయం జరిగేలా ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. హౌసింగ్ కార్పొరేషన్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి లబ్ధిదారుల ఎంపిక కోసం డ్రా నిర్వహించాలని సూచించారు. హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల్లోనూ ఇదే విధానాన్ని అనుసరించాలని ఆదేశించారు. లబ్ధిదారుల వివరాలన్నింటినీ సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేసి, ఆన్‌లైన్ విధానంలో డ్రా నిర్వహించడం ద్వారా ఎంపిక ప్రక్రియలో పారదర్శకతను మరింత పెంచవచ్చని పేర్కొన్నారు.
డ్రా ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం చేసేలా ఏర్పాట్లు చేయాలని, ప్రత్యక్షంగా వీక్షించలేని వారు కూడా డ్రాకు సంబంధించిన వివరాలను యూట్యూబ్‌లో లబ్ధిదారులు తమ వివరాలు ఎంపిక జాబితాలో ఉన్నాయో లేదో ఎప్పుడైనా పరిశీలించుకునే అవకాశం ఉంటుందని వివరించారు.
తాజావార్తలు
- ●Heart Stroke | అమెరికాలో గుండెపోటుతో ఖమ్మం యువతి మృతి
- ●Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్ - ఫ్యాన్స్‌కు ట్రిపుల్ ధమాకా
- ●Graduate MLC Elections | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. సీపీఐ మద్దతు కోరిన కాంగ్రెస్
- ●Vande Mataram | వందేమాతరం ఓ మతపరమైన యుద్ధ గేయం : మాజీ ఐఏఎస్ అధికారి
- ●Revanth Reddy | మహారాష్ట్రతో చర్చలకు సిద్ధం కండి.. తుమ్మడిహెట్టి నివేదికలన్నీ రెడీగా ఉంచండి
- ●Hyderabad | సూరారంలో విషాదం.. నీళ్ల బకెట్లో చిన్నారి పడి మృతి..

Heart Stroke | అమెరికాలో గుండెపోటుతో ఖమ్మం యువతి మృతి

Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్ - ఫ్యాన్స్‌కు ట్రిపుల్ ధమాకా

Graduate MLC Elections | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. సీపీఐ మద్దతు కోరిన కాంగ్రెస్

Vande Mataram | వందేమాతరం ఓ మతపరమైన యుద్ధ గేయం : మాజీ ఐఏఎస్ అధికారి




