Vakiti Srihari | ఖేలో ఇండియా పోటీల కోసం ప్రతిభ ఆధారంగానే అవకాశాలు
Vakiti Srihari | వచ్చే డిసెంబర్‌లో హైదరాబాద్‌లో నిర్వహించే ఖేలో ఇండియా గేమ్స్ (Khelo India Games) కోసం ప్రతిభ ఆధారంగానే అవకాశాలు కల్పిస్తామని క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) అన్నారు.
- డిసెంబర్ 11 నుంచి 22 వరకు నిర్వహించే ఆటల కోసం పకడ్బందీ కార్యాచరణ
- క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి
Vakiti Srihari | త్రినేత్ర న్యూస్: వచ్చే డిసెంబర్‌లో హైదరాబాద్‌లో నిర్వహించే ఖేలో ఇండియా గేమ్స్ (Khelo India Games) కోసం ప్రతిభ ఆధారంగానే అవకాశాలు కల్పిస్తామని క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) అన్నారు. గ్రామీణ స్థాయి నుంచే ప్రతిభావంతులైన క్రీడాకారులు ఉంటారన్నారు. ఆటల నిర్వహణ కోసం పకడ్బందీ కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. డిసెంబర్ 11 నుంచి 22 వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఏర్పాట్లు, క్రీడాకారుల ఎంపిక, స్టేడియాల సిద్ధత, శిక్షణ తదితర అంశాలపై శుక్రవారం సచివాలయంలో ఆయన అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో ఖేలో ఇండియా గేమ్స్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. దేశవ్యాప్తంగా వచ్చే క్రీడాకారులు, కోచ్‌లు, ప్రతినిధులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి, జాతీయ స్థాయిలో రాణించేలా క్రీడాకారులను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. 27 రకాల క్రీడాంశాల్లో 1:4, 1:2, 1:1 నిష్పత్తుల ఆధారంగా క్రీడాకారులను దశల వారీగా గుర్తించి, అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని ఖేలో ఇండియా పోటీలకు సిద్ధం చేయాలని సూచించారు.
27 క్రీడాంశాల్లో..
క్రీడాకారుల ఎంపికలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రతిభ ఆధారంగానే అవకాశాలు కల్పించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. 27 క్రీడాంశాల్లో ప్రతిభావంతుల ఎంపిక ఉంటుందన్నారు. కేవలం పోటీల నిర్వహణకే పరిమితం కాకుండా, తెలంగాణ క్రీడాకారులు జాతీయ స్థాయిలో పతకాలు సాధించేలా దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు సాగాలని తెలిపారు.
ఖేలో ఇండియా పోటీలు నిర్వహించే క్రీడా వేదికలు, స్టేడియాలను గుర్తించి, వాటిలో అవసరమైన మౌలిక సదుపాయాలు, క్రీడా పరికరాలు, ఇతర ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. పోటీల నిర్వహణకు సంబంధించి ప్రతి అంశంపై ప్రత్యేక దృష్టి సారించి, అధికారులకు బాధ్యతలు అప్పగించాలని సూచించారు.
క్రీడాకారుల శారీరక దృఢత్వం, సామర్థ్యం పెంపొందించేందుకు నాణ్యమైన శిక్షణతోపాటు పోషకాలు సమృద్ధిగా ఉండే ఆహారాన్ని ప్రభుత్వ పరంగా అందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. క్రీడాకారులకు అవసరమైన శిక్షణ, వైద్య సహాయం, వసతి, రవాణా వంటి సదుపాయాల కల్పనపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణలో నిర్వహించనున్న ఖేలో ఇండియా గేమ్స్ దేశానికే దిక్సూచిగా నిలిచేలా ఏర్పాట్లు ఉండాలని మంత్రి వాకిటి ఆకాంక్షించారు. క్రీడాకారులకు అత్యుత్తమ వసతులు కల్పిస్తూ, పోటీల నిర్వహణలో ఎక్కడా లోపాలు లేకుండా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని చెప్పారు. ఈ పోటీలు తెలంగాణ క్రీడా రంగానికి కొత్త దిశానిర్దేశం చేయడంతోపాటు రాష్ట్ర యువతలో క్రీడల పట్ల ఆసక్తిని మరింత పెంచేలా ఉండాలని పేర్కొన్నారు.
సమీక్షా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారు, తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడు ఏపీ జితేందర్ రెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సోని బాలాదేవి, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి మల్లారెడ్డి, ప్రవీణ్ కుమార్ మల్లారెడ్డి, డిప్యూటీ డైరెక్టర్లు రవీందర్, రవితేజ, అశోక్, శ్రీనివాస్, ఇంజినీర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ●Karnataka High Court | సోషల్ మీడియా పోస్టులు.. విచారణ లేకుండా యంత్రాల్లా ఎఫ్ఐఆర్లు నమోదు చేయడమేంటి..?
- ●Sridhar Babu | 1100 కాల్ చేస్తే.. మీ ఇంటికే మీ సేవ సర్టిఫికెట్లు
- ●Ponguleti Srinivas Reddy | క్యూర్ పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణమే లక్ష్యం.. యుద్ధ ప్రతిపాదికన స్థలాలు గుర్తించాలి
- ●Heart Stroke | అమెరికాలో గుండెపోటుతో ఖమ్మం యువతి మృతి
- ●Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్ - ఫ్యాన్స్‌కు ట్రిపుల్ ధమాకా
- ●Graduate MLC Elections | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. సీపీఐ మద్దతు కోరిన కాంగ్రెస్

Karnataka High Court | సోషల్ మీడియా పోస్టులు.. విచారణ లేకుండా యంత్రాల్లా ఎఫ్ఐఆర్లు నమోదు చేయడమేంటి..?

Sridhar Babu | 1100 కాల్ చేస్తే.. మీ ఇంటికే మీ సేవ సర్టిఫికెట్లు

Ponguleti Srinivas Reddy | క్యూర్ పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణమే లక్ష్యం.. యుద్ధ ప్రతిపాదికన స్థలాలు గుర్తించాలి

Heart Stroke | అమెరికాలో గుండెపోటుతో ఖమ్మం యువతి మృతి




