Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్ – ఫ్యాన్స్‌కు ట్రిపుల్ ధమాకా
ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా కల్కి 2 నుంచి మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. సలార్ 2ను అఫీషియల్‌గా ప్రకటించారు. ఇవే కాకుండా ఫౌజీ నుంచి ఓ స్పెషల్ పోస్టర్‌ను కూడా మేకర్స్ అభిమానులతో పంచుకున్నారు. ఈ మూడు అప్‌డేట్స్ తాలూకు ఫొటోలు, వీడియోలు రెబెల్ స్టార్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
Entertainment | Published On Oct 23, 2026, 4.21 pm IST
ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా కల్కి 2తో పాటు ఫౌజీ, సలార్ 2 సినిమాల నుంచి స్పెషల్ అప్‌డేట్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ అప్‌డేట్స్‌తో రెబల్‌స్టార్ ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతోన్నారు.
భైరవ ఈజ్ బ్యాక్...
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతోన్న మూవీ కల్కి 2 . సైన్స్‌ఫిక్షన్ యాక్షన్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో విలక్షణ నటుడు కమల్‌హాసన్ విలన్‌గా నటిస్తోన్నారు. అమితాబ్‌బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రభాస్ పుట్టినరోజును పురస్కరించుకొని ఈ సినిమా నుంచి ఆయన పాత్రకు సంబంధించిన భైరవ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. కల్కి 2 సెట్స్‌లో ప్రభాస్ అడుగుపెట్టినట్లుగా ఈ వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చారు. భైరవ ఈజ్ బ్యాక్ అంటూ మేకర్స్ షేర్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతోంది.కల్కి మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాను వైజయంతి మూవీస్ నిర్మిస్తోంది. ఈ సీక్వెల్‌లో సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తోన్నట్లు ప్రచారం జరుగుతోంది.
సలార్ 2
ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ కీల్ కాంబినేషన్‌లో వచ్చిన సలార్ మూవీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. ఈ సినిమాకు రెండో పార్ట్ కూడా ఉంది. అయితే ప్రభాస్ బిజీ షెడ్యూల్స్ కారణంగా సలార్ 2 ఉండకపోవచ్చునంటూ చాలా రోజులుగా రూమర్లు వినిపిస్తున్నాయి. ఈ పుకార్లపై ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. సలార్ 2ను అఫీషియల్‌గా ప్రకటించారు. ప్రస్తుతం ఎన్టీఆర్‌తో డ్రాగన్ సినిమా చేస్తోన్నాడు ప్రశాంత్ నీల్. ఈ మూవీ పూర్తయిన తర్వాత సలార్ 2 ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టబోతున్నారు.
ఫౌజీ
ప్రభాస్ కథానాయకుడిగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న ఫౌజీ నుంచి శుక్రవారం స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో పాత కాలం నాటి కాయిన్‌పై మిలటరీ గెటప్‌లో ప్రభాస్ లుక్ కనిపిస్తోంది. ఈ కాయిన్‌పై దేవనాగరి లిపిలో అజ్ఞాతపర్వ అని రాసి ఉంది. పోస్టర్ బ్యాక్‌గ్రౌండ్‌లో సంస్కృత శ్లోకాలు, మంటల్లో కాలిపోతున్న ఓ జెండా కనిపిస్తోన్నాయి. వాటిలో పాటు ఆర్మీ మ్యాప్‌లు, సీక్రెట్ కోడ్‌లు ఉన్నాయి. ఈ పోస్టర్ ప్రభాస్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది.
స్వాతంత్య్రానికి పూర్వ కాలం నాటి కథతో హిస్టారికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా హను రాఘవపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తోన్నారు. ఫౌజీలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ ఇమాన్వీ ఇస్మాయిల్ హీరోయిన్‌గా నటిస్తోంది. మిథున్ చక్రవర్తి, జయప్రద, అనుపమ్ ఖేర్ కీలక పాత్రల్లో నటిస్తోన్నారు. వచ్చే ఏడాది మార్చిలో ఈ మూవీ థియేటర్లలోకి రానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
స్పిరిట్ సెట్స్‌లో ప్రభాస్‌తో డైరెక్టర్ సందీప్ వంగా...
To the superhero of Indian Cinema…
Happy Birthday to the Darling of every generation, Rebel Star #Prabhas.We are excited to embark on another epic cinematic journey with you… #Kalki2898AD ⚡ https://t.co/uE5GQAOr4c
— Kalki 2898 AD (@Kalki2898AD) October 23, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Idupu Kayitham | అచ్చ తెలంగాణ ఎమోషన్స్‌తో ఇడుపుకాయితం – రిలీజ్ డేట్ చెప్పేశారు
అక్టోబర్ 23, 2026

Rukmini Vasanth | హిట్టు కోసం జానర్ మార్చిన ఎన్టీఆర్ హీరోయిన్ – లేడీ ఓరియెంటెడ్ కథలో..
అక్టోబర్ 23, 2026

418 Movie Review | 418 రివ్యూ – ప్రశాంత్ నీల్ హారర్ మూవీ భయపెట్టిందా? లేదా?…
అక్టోబర్ 23, 2026
తాజావార్తలు
- ●Heart Stroke | అమెరికాలో గుండెపోటుతో ఖమ్మం యువతి మృతి
- ●Graduate MLC Elections | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. సీపీఐ మద్దతు కోరిన కాంగ్రెస్
- ●Vande Mataram | వందేమాతరం ఓ మతపరమైన యుద్ధ గేయం : మాజీ ఐఏఎస్ అధికారి
- ●Revanth Reddy | మహారాష్ట్రతో చర్చలకు సిద్ధం కండి.. తుమ్మడిహెట్టి నివేదికలన్నీ రెడీగా ఉంచండి
- ●Hyderabad | సూరారంలో విషాదం.. నీళ్ల బకెట్లో చిన్నారి పడి మృతి..
- ●Ramachander Rao | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు..?

Heart Stroke | అమెరికాలో గుండెపోటుతో ఖమ్మం యువతి మృతి

Graduate MLC Elections | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. సీపీఐ మద్దతు కోరిన కాంగ్రెస్

Vande Mataram | వందేమాతరం ఓ మతపరమైన యుద్ధ గేయం : మాజీ ఐఏఎస్ అధికారి

Revanth Reddy | మహారాష్ట్రతో చర్చలకు సిద్ధం కండి.. తుమ్మడిహెట్టి నివేదికలన్నీ రెడీగా ఉంచండి



