Web Series | ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ – తల లేని డెడ్‌బాడీ మిస్టరీతో…
నరేష్ అగస్త్య ప్రధాన పాత్రలో తెలుగులో ఓ క్రైమ్ ఇన్వేస్టిగేట్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ తెరకెక్కుతోంది. రుద్రవనం పీఎస్ పేరుతో రూపొందుతున్న ఈ వెబ్‌సిరీస్ అక్టోబర్ 30 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది.
Entertainment | Published On Oct 22, 2026, 4.20 pm IST
Web Series | ఓ వైపు కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథాంశాలతో కూడిన చిన్న సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్‌సిరీస్‌లలో నటిస్తున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో నరేష్ అగస్త్య. తాజాగా అతడు ప్రధాన పాత్రలో నటించిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ వచ్చే వారం ఓటీటీలో సందడి చేయబోతుంది. రుద్రవనం పీఎస్ పేరుతో రూపొందిన వెబ్‌సిరీస్‌కు శశిధర్ మున్నంగి దర్శకత్వం వహించారు. ఈ వెబ్‌సిరీస్‌లో బెనర్జీ, శివ అలపాటి, సుగాలి సిలోని, శ్రావణి రెడ్డి కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. అక్టోబర్ 30 నుంచి జీ5 ఓటీటీలో ఈ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుంది.
రుద్రవనం మిస్టరీ...
రుద్రవనం ఊరిలో ఓ తల లేని మృతదేహం దొరుకుతుంది. తర్వాత మరో వ్యక్తి అదృశ్యమవుతాడు . ఈ కేసుని డీల్ చేసే బాధ్యతను ఎస్ఐ శివకుమార్ చేపడతాడు. ఒక్కో ఆధారం బయటపడుతున్న కొద్దీ అవినీతి, స్థానిక రాజకీయాలు, ఎన్నో ఏళ్లుగా బయటకు రాని రహస్యాలు వెలుగులోకి వస్తాయి. పైకి కనిపించేంత చిన్న కేసు కాదని తెలుసుకున్న శివకుమార్ ఏం చేశాడు? శివకుమార్ ఇన్వేస్టిగేషన్ కారణంగా ఓ ఊరిలో ఎలాంటి గొడవలు జరిగాయి? అసలు కిల్లర్ ఎవరు అనే అంశాలతో ఈ వెబ్‌సిరీస్ తెరకెక్కుతోంది.
ఆర్ఎక్స్ 100 ఫేమ్...
ఆర్ఎక్స్ 100, జాంబీరెడ్డి, మంగళవారం సినిమాలకు డైలాగ్స్ అందించిన తాజ్ సయ్యద్ ఈ వెబ్‌సిరీస్‌కు రైటర్‌గా వర్క్ చేశారు. ఇందులో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా నరేష్ అగస్త్య నటన ఈ సిరీస్‌కు హైలైట్‌గా ఉండబోతున్నట్లు మేకర్స్ పేర్కొన్నారు. ఏడు ఎపిసోడ్స్‌తో ఈ వెబ్‌సిరీస్ తెరకెక్కుతోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Paradise OTT | ఓటీటీలోకి నాని ప్యారడైజ్ – ఎక్స్ట్రా సీన్లతో నాలుగు భాషల్లో రిలీజ్
అక్టోబర్ 17, 2026

OTT Releases | శుక్రవారం ఒక్కరోజే ఓటీటీలో 30 సినిమాలు రిలీజ్ – ఒక్కోటి ఒక్కో జానర్
అక్టోబర్ 16, 2026

Malayalam OTT | ఓటీటీలోకి మణిరత్నం హీరోయిన్ మలయాళం సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ -బట్టర్ఫ్లై ఎఫెక్ట్ తో
అక్టోబర్ 13, 2026
తాజావార్తలు
- ●Aadhaar Authentication to TDR Portal | టీడీఆర్ పోర్టల్‌కు ఆధార్ అథెంటికేషన్.. ఉత్తర్వులు జారీ
- ●Harish Rao | అధికారులను కాదు.. సీఎంను సస్పెండ్ చేయాలి
- ●Pune Dengue Death 2026 | పూణేలో కలకలం.. డెంగ్యూతో 9 ఏళ్ల చిన్నారి మృతి.. అసలు ఏం జరిగింది?
- ●Flipkart | ఫుడ్ డెలివరీ రంగంలోకి ఫ్లిప్‌కార్ట్.. జొమాటో, స్విగ్గీకి పోటీ..
- ●Sumanth Prabhas | తెలంగాణ ప్రేమకథతో సుమంత్ ప్రభాస్ కొత్త మూవీ - హీరోయిన్గా మిస్ కేరళ
- ●Hyderabad | తడి ఆరుతున్న భాగ్యనగరం..

Aadhaar Authentication to TDR Portal | టీడీఆర్ పోర్టల్‌కు ఆధార్ అథెంటికేషన్.. ఉత్తర్వులు జారీ

Harish Rao | అధికారులను కాదు.. సీఎంను సస్పెండ్ చేయాలి

Pune Dengue Death 2026 | పూణేలో కలకలం.. డెంగ్యూతో 9 ఏళ్ల చిన్నారి మృతి.. అసలు ఏం జరిగింది?

Flipkart | ఫుడ్ డెలివరీ రంగంలోకి ఫ్లిప్‌కార్ట్.. జొమాటో, స్విగ్గీకి పోటీ..



