Keerthy Suresh | బర్త్‌డే రోజు డబుల్ ట్రీట్ ఇచ్చిన కీర్తి సురేష్ – ఒకటి క్లాస్ – మరోటి మాస్
కీర్తి సురేష్ బర్త్‌డే సందర్భంగా జనవరి 12 విడుదల మూవీ నుంచి ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. లతా రెడ్డితో స్టైలిష్ లుక్‌లో కీర్తి కనిపించింది. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ వెబ్‌సిరీస్ అక్క టీజర్ రిలీజైంది. ఇందులో కరుగుగట్టిన లేడీ గ్యాంగ్‌స్టర్‌గా మాస్ రోల్లో కీర్తి సురేష్ అదరగొట్టింది.
Entertainment | Published On Oct 17, 2026, 2.45 pm IST
Keerthy Suresh | బర్త్‌డే సందర్భంగా అభిమానులకు కీర్తి సురేష్ డబుల్ ట్రీట్ ఇచ్చింది. టాలీవుడ్ మల్టీస్టారర్ మూవీ జనవరి 12 విడుదల నుంచి ఆమె ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. బాలీవుడ్ వెబ్‌సిరీస్ అక్క టీజర్ కూడా విడుదలచేశారు. తెలుగు మూవీలో క్లాస్ లుక్‌లో కనిపించిన ఈ ముద్దుగుమ్మ హిందీ వెబ్‌సిరీస్‌లో మాస్ రోల్లో అదరగొట్టింది.
జనవరి 12 విడుదల...
వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న మల్టీస్టారర్ మూవీ జనవరి 12 విడుదల. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో ఫన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ ఈ సినిమా వచ్చే సంక్రాంతికి థియేటర్లలోకి రాబోతుంది. ఈ సినిమాలో కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
లతా రెడ్డి...
కీర్తి సురేష్ బర్త్‌డే సందర్భంగా శనివారం ఆమె ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఇందులో లతా రెడ్డి అనే పాత్రలో ఈ కోలీవుడ్ బ్యూటీ కనిపించబోతున్నట్లు వెల్లడించారు. ఈ పోస్టర్లో ట్రాక్టర్ నడుపుతూ కీర్తి సురేష్ కనిపిస్తోంది. తలపాగా చుట్టుకొని కళ్లద్ధాలు పెట్టుకొని లంగా ఓణీలో కీర్తి సురేష్ లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది.
ధైర్యం, పట్టుదల కలిగిన అహంభావ మనస్తత్వమున్న అమ్మాయిగా జనవరి 12 విడుదలలో కీర్తి సురేష్ నటిస్తోన్నట్లు సమాచారం. ఈ కామెడీ మూవీకి జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో బావబావమరుదుల అనుబంధంతో అనిల్ రావిపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తోన్నారు.
మాఫియా గ్యాంగ్ లీడర్‌గా...
కీర్తి సురేష్ బాలీవుడ్లో అక్క పేరుతో గ్యాంగ్‌స్టర్ యాక్షన్ వెబ్‌సిరీస్ చేస్తోంది. యశ్‌రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సిరీస్ అక్టోబర్ 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. ధర్మరాజ్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. అక్క వెబ్‌సిరీస్ టీజర్ శనివారం రిలీజైంది. ఇందులో భవానీ అనే కరుడుగట్టిన లేడీ గ్యాంగ్‌స్టర్‌గా మాస్ రోల్లో కీర్తి సురేష్ అదరగొట్టింది. ఆమె లుక్, మ్యానరిజమ్స్ డిఫరెంట్‌గా ఉన్నాయి. 800 ఏళ్లుగా పేర్నూరును మహిళలే ఏలుతుంటారు. ఆ రాజ్యానికి భవానీ నాయకురాలిగా కొనసాగుతుంటోంది. తన వ్యాపారానికి, అధికారికి అడ్డొచ్చిన వారు ఎవరైనా వారిని చంపడానికి కూడా వెనకాడని యువతిగా కీర్తి సురేష్ రోల్ టీజర్లో చాలా పవర్‌ఫుల్‌గా సాగింది. భవానీకి పోటీగా వచ్చిన దుర్గ ఎవరు? దుర్గ బారి నుంచి తన సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి భవానీ ఏం చేసిందనే అంశాలతో ఈ సిరీస్ తెరకెక్కుతోన్నట్లు కనిపిస్తోంది. అక్క వెబ్‌సిరీస్‌లో కీర్తి సురేష్‌తో పాటు రాధిక శెట్టి కీలక పాత్రలో కనిపించబోతుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Keerthy Suresh | పన్నెండేళ్ల తర్వాత ఊటీలో కీర్తి సురేష్ సినిమా షూటింగ్ – వెంకటేష్‌తో రొమాంటిక్ డ్యూయెట్
అక్టోబర్ 12, 2026

Keerthy Suresh | ఓటీటీలోకి కీర్తి సురేష్ బోల్డ్ మూవీ – తమిళంలో హిట్ – తెలుగులో డిజాస్టర్
అక్టోబర్ 11, 2026

Raashi Khanna | సమంత భర్త బాలీవుడ్ వెబ్‌సిరీస్ నుంచి రాశీఖన్నా ఔట్ – టాలీవుడ్ బ్యూటీకి ఛాన్స్
అక్టోబర్ 4, 2026
తాజావార్తలు
- ●Green India Challenge | గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. పద్మాక్షి గుట్టలో మొక్కలు నాటిన ప్రముఖులు
- ●ChatGPT | చాట్ జీపీటీలో కొత్త ఫీచర్.. ఫామ్‌లను అలవోకగా నింపుతుంది..
- ●UN | యువశక్తి దేశంపై ఇంతటి నిరాధారమైన ఆరోపణలా..? ఐరాస నివేదికపై భారత్ ఆగ్రహం
- ●US lawmakers letter to Marco Rubio | మార్కో రూబియో పర్యటన వేళ భారత్‌లో నిరసనలపై అమెరికా ఎంపీల లేఖాస్త్రం.. భారత్ స్ట్రాంగ్ కౌంటర్
- ●Un Employees | నవంబర్ 7న మహాధర్నాకు నిరుద్యోగ యువత పిలుపు
- ●MLC Dasoju Sravan | నిరుద్యోగుల మొర వినండి.. బేషజాలకు పోకుండా పరీక్షల తేదీలు మార్చండి

Green India Challenge | గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. పద్మాక్షి గుట్టలో మొక్కలు నాటిన ప్రముఖులు

ChatGPT | చాట్ జీపీటీలో కొత్త ఫీచర్.. ఫామ్‌లను అలవోకగా నింపుతుంది..

UN | యువశక్తి దేశంపై ఇంతటి నిరాధారమైన ఆరోపణలా..? ఐరాస నివేదికపై భారత్ ఆగ్రహం

US lawmakers letter to Marco Rubio | మార్కో రూబియో పర్యటన వేళ భారత్‌లో నిరసనలపై అమెరికా ఎంపీల లేఖాస్త్రం.. భారత్ స్ట్రాంగ్ కౌంటర్



