త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

NIA | గాదె ఇన్న‌య్యను అరెస్టు చేసిన ఎన్ఐఏ

NIA | సామాజిక ఉద్యమకారుడు, మాజీ మావోయిస్టు (Ex Maoist) గాదె ఇన్నయ్య (Gade Innaiah) ను ఎన్ఐఏ (NIA) అధికారులు అరెస్ట్‌ చేశారు.

A

News | Published On Dec 21, 2025, 2.04 pm IST

NIA | గాదె ఇన్న‌య్యను అరెస్టు చేసిన ఎన్ఐఏ
Advertisement

NIA | సామాజిక ఉద్యమకారుడు, మాజీ మావోయిస్టు (Ex Maoist) గాదె ఇన్నయ్య (Gade Innaiah) ను ఎన్ఐఏ (NIA) అధికారులు అరెస్ట్‌ చేశారు. జనగామ జిల్లా జాఫర్‌గఢ్‌ మండల కేంద్రంలో ఇన్నయ్య నిర్వహిస్తున్న అనాథాశ్రమానికి నాలుగు వాహనాల్లో వచ్చిన NIA అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల మరణించిన మావోయిస్టు (Maoist) నేత కాతా రామచంద్రారెడ్డి అంత్యక్రియలకు ఇన్నయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా మావోయిస్టులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేసి ప్రజలను ప్రేరేపించారనే ఆరోపణలు రావడంతో ఆయన్ను అరెస్టు చేశారు. ఆయ‌న‌పై యూఏపీఏ (UAPA) కింద కేసు న‌మోదు చేసిన‌ట్లు స‌మాచారం.

ఇటీవ‌ల మావోయిస్టుల‌కు అనుకూలంగా...

ఇటీవ‌లి కాలంలో మావోయిస్టుల‌కు అనుకూలంగా గాదె ఇన్న‌య్య మీడియాలో మాట్లాడుతున్నారు. కొన్ని రోజుల క్రితం ఎన్‌కౌంట‌ర్‌లో మ‌ర‌ణించిన హిడ్మా (Hidma) సొంతూరు పువ‌ర్తికి మీడియాతో క‌లిసి వెళ్లారు. ఈ నేప‌థ్యంలో ఇన్న‌య్య ఇంటిలో ఎన్ఐఏ సోదాలు నిర్వ‌హించింది. అరెస్టు చేసిన ఇన్న‌య్య‌ను హైద‌రాబాద్‌కు త‌ర‌లిస్తున్నట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల భోగట్టా.

Advertisement

తాజావార్తలు

Advertisement