Panchayath Elections | అమెరికా నుంచి వచ్చిన మామ ఓటుతో గెలిచిన కోడలు
Panchayath Elections | అమెరికా (America) నుంచి మామ వచ్చి ఓటేయడంతో పంచాయతీ ఎన్నికల్లో (Panchayath Elections) కోడలు ఒక్క ఓటు తేడాతో గెలిచింది.
Panchayath Elections | కోడలు పంచాయతీ ఎన్నికల్లో (Panchayath Elections) బరిలోకి దిగడంతో అమెరికా (America)నుంచి మామ వచ్చి ఓటేశాడు. తీరా ఓట్ల లెక్కింపు పూర్తయిన అనంతరం ఆమె ఒకే ఒక ఓటు తేడాతో విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో ఆమె వెంటనే మామ ఆశీర్వాదం తీసుకుని కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఘటన నిర్మల్ (Nirmal) జిల్లా లోకేశ్వరం మండలం బాగాపూర్ (Bagapur) లో చోటు చేసుకుంది.
బాగాపూర్ గ్రామ పంచాయితీ ఎన్నికలను అధికారులు రెండవ విడతలో నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ముత్యాల శ్రీవేద సర్పంచ్‌గా బరిలో నిలిచారు. విషయం తెలుసుకున్న ఆమె మామ ముత్యాల ఇంద్రకరణ్‌రెడ్డి అమెరికా నుంచి వచ్చి మరీ తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. ఊళ్లో మొత్తం 426 ఓట్లు ఉండగా, వాటిలో 378 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో శ్రీవేదకు 189 ఓట్లు రాగా, ప్రత్యర్థి హర్ష స్వాతికి 188 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఒక ఓటు చెల్లకపోవడంతో శ్రీవేదను విజేతగా అధికారులు ప్రకటించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Peddi Sudarshan Reddy | బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హఠాన్మరణం
- ●Kukatpally | క్రికెట్ ఆడటానికి వెళ్తూ.. కానరాని లోకాలకు..
- ●Komuravelli Railway Station | సాకారమైన దశాబ్దాల కల.. నేడు కొమురెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ ప్రారంభం..
- ●Jurala Project | జూరాలను తాకిన కృష్ణమ్మ.. కాలువలకు నీరు విడుదల చేస్తారా?
- ●Pralhad Joshi | నూతన విద్యాశాఖ మంత్రి ఏం చదువుకున్నారంటే?
- ●Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి

Peddi Sudarshan Reddy | బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హఠాన్మరణం

Kukatpally | క్రికెట్ ఆడటానికి వెళ్తూ.. కానరాని లోకాలకు..

Komuravelli Railway Station | సాకారమైన దశాబ్దాల కల.. నేడు కొమురెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ ప్రారంభం..

Jurala Project | జూరాలను తాకిన కృష్ణమ్మ.. కాలువలకు నీరు విడుదల చేస్తారా?






