Errabelli Dayakar Rao | TTA ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం.. పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి
Errabelli Dayakar Rao | చార్లెట్‌లో జరుగుతున్న TTA సభలకి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రత్యేక అతిథిగా హాజరై శ్రీ శ్రీనివాస కళ్యాణం మహోత్సవం వేడుకలో పాల్గొన్నారు.
Errabelli Dayakar Rao | త్రినేత్ర.న్యూస్ : చార్లెట్‌లో జరుగుతున్న TTA సభలకి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రత్యేక అతిథిగా హాజరై శ్రీ శ్రీనివాస కళ్యాణం మహోత్సవం వేడుకలో పాల్గొన్నారు. అమెరికాలోని నార్త్ కరోలీనా రాష్ట్రం చార్లెట్ మహానగరంలో మొట్టమొదటిసారిగా జరుగుతున్న తెలంగాణా అమెరికన్ తెలుగు అసోషియేషన్ మెగా కన్వెన్షన్‌కి TTA వ్యవస్థాపకులు డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి ప్రత్యేక ఆహ్వానం మేరకు ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరై శ్రీనివాస కళ్యాణం మహోత్సవం వేడుకలో పాల్గొని స్వామి వారి సేవ చేసి వేద పండితుల ఆశీస్సులు అందుకున్నారు.
ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. మనం ఎంత ఎదిగినా మన తెలుగు మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఈ కార్యక్రమాలు పండుగలా జరుపుకోవటం ఆనందంగా ఉందన్నారు. అలాగే మీ పిల్లలకు కూడా తెలుగు భాష సంస్కృతి గురించి నేర్పించాలని మీ కన్న తల్లిదండ్రులకు రోజూ ఫోన్ చేసి మాట్లాడాలని కనీసం సంవత్సరానికి ఒకసారి అయినా వారి వద్దకు వెళ్లి రావాలని వారు కోరారు.

ఈ కార్యక్రమంలో TTA అధ్యక్షులు నవీన్ రెడ్డి మల్లిపెద్ది, కన్వీనర్ ప్రవీణ్ చింత, కోర్డినేటర్ నరేన్ దేవరపల్లి, శేఖర్ రెడ్డి, పలు ఐటీ కంపెనీల ప్రతినిధులు CEO వంశీ రెడ్డి పలు సినీ నిర్మాతలు, దర్శకులు దిల్ రాజు,రాంగోపాల్ వర్మా, ప్రముఖ వైద్యు నిపుణులు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, డాక్టర్ గురువారెడ్డి పలు రాజకీయ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.
చార్లెట్ లో జరుగుతున్న
తెలంగాణా అమెరికన్ తెలుగు అసోషియేషన్ TTA వ్యవస్థాపకులు డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి గారి ప్రత్యేక ఆహ్వానం మేరకు ఈ సభలకి హాజరై శ్రీ శ్రీనివాస కళ్యాణ వేడుకలో పాల్గొని స్వామి వారి సేవ చేసి వేద పండితుల ఆశీస్సులు పొందిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గార pic.twitter.com/xwO6zU39sK— Errabelli Dayakar Rao (@EDRBRS) July 20, 2026
తాజావార్తలు
- ●Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల
- ●Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు
- ●Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!
- ●Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన
- ●Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!
- ●Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!

Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల

Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు

Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!

Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన





