త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MGNREGA | ఉపాధిహామీ చట్టాన్ని నీరుగార్చే బిల్లును ఉపసంహరించుకోవాలి: సీపీఎం

MGNREGA | ఉపాధి హామీ చ‌ట్టాన్ని (MGNREGA) నీరుగార్చే బిల్లును త‌క్ష‌ణ‌మే ఉప‌సంహ‌రించుకోవాల‌ని సీపీఎం (CPM) రాష్ట్ర కార్య‌ద‌ర్శి జాన్ వెస్లీ (John Wesley) డిమాండ్ చేశారు. బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 18, 19 తేదీల్లో గ్రామ గ్రామాన నిరసన తెలుపుతూ బిల్లు ప్రతులను ద‌హ‌నం చేయాలని, 20వ తేదీన మండల కేంద్రాల్లో నిరసనలు తెల‌పాల‌ని పిలుపునిచ్చారు.

A

News | Published On Dec 17, 2025, 6.39 pm IST

MGNREGA | ఉపాధిహామీ చట్టాన్ని నీరుగార్చే బిల్లును ఉపసంహరించుకోవాలి: సీపీఎం
Advertisement

MGNREGA | ఉపాధి హామీ చ‌ట్టాన్ని నీరుగార్చే బిల్లును త‌క్ష‌ణ‌మే ఉప‌సంహ‌రించుకోవాల‌ని సీపీఎం (CPM) రాష్ట్ర కార్య‌ద‌ర్శి జాన్ వెస్లీ (John Wesley) డిమాండ్ చేశారు. కేంద్రంలో అధికారంలో వున్న బిజేపి (BJP) ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశపెట్టిందని మండిప‌డ్డారు. వ్యవసాయ కార్మికులు, పేదలకు తీవ్రంగా నష్టం చేసే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 18, 19 తేదీల్లో గ్రామ గ్రామాన నిరసన తెలుపుతూ బిల్లు ప్రతులను ద‌హ‌నం చేయాలని, 20వ తేదీన మండల కేంద్రాల్లో నిరసనలు తెల‌పాల‌ని పిలుపునిచ్చారు.
దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాలకు చెందిన 30 కోట్లమందికి పైగా పేదలకు ఉపాధి కల్పిస్తున్న ఈ చట్టాన్ని నీరుగారుస్తున్నారని జాన్ వెస్లీ ఆవేదన వ్య‌క్తం చేశారు. పనిదినాలను పెంచామనే పేరుతో కూలీల సంఖ్యను భారీగా తగ్గిస్తున్నారని ఆరోపించారు. ఇపుడున్న చట్టంలో 90శాతం నిధులను కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి వుండగా, దాన్ని 60శాతానికి కుదిస్తున్నారని మండిప‌డ్డారు. కోత పెడుతున్న 40శాతం నిధులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలని చెప్తున్నారని అన్నారు. దీంతో నిధుల కొరత వున్న రాష్ట్రప్రభుత్వాలు ఈ పథకాన్ని ఎత్తివేసే ప్రమాద‌ముంద‌ని అనుమానం వ్య‌క్తం చేశారు.
నూత‌న బిల్లు ప్ర‌కారం వ్యవసాయ పనులు ఉన్న సమయంలో 60 రోజుల పనిని నిషేధిస్తున్నారని చెప్పారు. దీంతో కూలీలకు పని దొరకని స్థితి ఏర్పడుతుందని వాపోయారు. ప‌థ‌కానికి మహాత్మా గాంధీ పేరు తొలగించి చట్టం పేరుమార్చి ''వికసిత్‌ భారత్ - గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ అజీవిక మిషన్‌ గ్రామీణ్ (వీబీ - జీ రాం జీ)పేరు పెట్టార‌ని దుయ్య‌బ‌ట్టారు. ఇప్పుడు అమ‌లవుతున్న ఉపాధి హామీ చట్టం ప్రకారం 100 రోజుల‌కు తగ్గకుండా పని కల్పించాలని, పనిదినాలు 200 రోజులకు పెంచాలని డిమాండ్ చేశారు. కూలీని రూ.307 నుండి రూ.600 కు పెంచాలని కోరారు. ఇప్ప‌టి వ‌ర‌కు అమ‌లవుతున్న ఉపాధి చట్టాన్ని య‌ధాత‌థంగా అమ‌లు చేయాల‌ని, నూత‌న బిల్లును త‌క్ష‌ణ‌మే ఉప‌సంహ‌రించుకోవాల‌ని డిమాండ్ చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement