త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

10th Results | రేపే తెలంగాణ‌ టెన్త్ ఫ‌లితాలు

10th Results | తెలంగాణలో పదో తరగతి పరీక్షా ఫలితాలు రేపు విడుద‌ల కానున్నాయి. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలు వెలువ‌డుతాయ‌ని ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారులు తెలిపారు.

S

News | Published On Apr 28, 2026, 2.07 pm IST

10th Results | రేపే తెలంగాణ‌ టెన్త్ ఫ‌లితాలు
Advertisement

10th Results | త్రినేత్ర‌.న్యూస్‌: తెలంగాణలో పదో తరగతి పరీక్షా ఫలితాలు రేపు విడుద‌ల కానున్నాయి. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలు వెలువ‌డుతాయ‌ని ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారులు తెలిపారు. ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు (K. Keshava Rao) ఈ ఫలితాలను విడుదల చేయనున్నట్లు ప్ర‌క‌టించారు.

కాగా మార్చి 14 నుంచి ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ప్రారంభ‌మై ఈ నెల 13తో ముగిశాయి. సుమారు 5.15 లక్షల మంది రెగ్యులర్‌ విద్యార్థులు పరీక్షల‌కు హాజ‌ర‌య్యారు. ఈ నెల 23వ తేదీతో జవాబుపత్రాల మూల్యాంకనం పూర్తి కావ‌డంతో అధికారులు ఫ‌లితాల‌ను వెల్ల‌డించేందుకు సిద్ధ‌మ‌య్యారు. మే మొదటి వారంలో ఫలితాలు విడుదల చేస్తామని ముందు నుంచి చెబుతున్న‌ప్ప‌టికీ మూల్యాంక‌నం పూర్తి కావ‌డంతో విడుద‌ల తేదీని అధికారులు ప్ర‌క‌టించారు.

Advertisement
Advertisement