ChatGPT | ఏఐ అనేది మన జీవితంలో ఎలా భాగం అవుతుందో చూడండి. ఒకప్పుడు ఏఐ అంటే ఏంటో తెలియదు. కానీ.. రాను రాను ఏఐ లేకపోతే బతకలేం అనే విధంగా ఏఐ మన జీవితం మీద, మన వర్క్ మీద ప్రభావం చూపిస్తోంది. 100 మంది ఉద్యోగులు చేసే పని ఒక్క ఏఐతో చేయించుకుంటున్నారు. అంతవరకు బాగానే ఉంది కానీ.. ఓ వ్యక్తి మాత్రం ఎవ్వరూ వినియోగించని విధంగా ఏఐని ఉపయోగించుకున్నాడు. చాట్‌జీపీటీ జనరేటివ్ ఏఐని ఉపయోగించి 12 వారాల్లో 27 కిలోల బరువు తగ్గాడు. జిమ్ లేదు.. ఫ్యాన్సీ డైట్ ప్లాన్స్ లేవు. పర్సనల్ ట్రెయినర్ లేడు. కేవలం చాట్‌జీపీటీకి కొన్ని ప్రాంప్ట్స్ ఇచ్చి అది ఇచ్చిన రెస్పాన్స్ని ఫాలో అవుతూ వెళ్లాడు. అంతే.. సింపుల్‌గా 12 వారాల్లో 27 కిలోల బరువు తగ్గాడు. నేను చాట్‌జీపీటీని వాడి 27 కిలోలు తగ్గాను అంటూ ఆ వ్యక్తి సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టాడు. ఆ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాట్‌జీపీటీనే నాకు పర్సనల్ ట్రెయినర్ అయింది. రోజూ క్రమశిక్షణ ప్లస్ చాట్‌జీపీటీ ప్రాంప్ట్స్.. ఈ రెండింటి వల్లనే ఇది సాధ్యమైంది.. అని ఆ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కేవలం 7 ప్రాంప్ట్స్ని తూచా తప్పకుండా పాటించి ఆ వ్యక్తి బరువు తగ్గడంతో ఏఐలను తక్కువగా అంచనా వేసిన వాళ్లంతా ఆశ్చర్యపోతున్నారు. తన ప్రస్తుత బరువు, పొడవు, వయసు, లింగం, ఎలా బరువు తగ్గాలనుకుంటున్నాడు. 12 వారాల ఫిట్నెస్, న్యూట్రిషన్ ప్లాన్ ఎలాంటి జిమ్ చేయకుండా ఎలా తగ్గాలి అంటూ చాట్‌జీపీటీకి ప్రాంప్ట్ ఇచ్చాడు. వారానికి 7 రోజుల మీల్ ప్లాన్, అంటే రోజుకి 1800 కేలరీలు, 120 గ్రాముల ప్రొటీన్, ఇలా స్పెసిఫిక్‌గా ప్రాంప్ట్స్ పొంది దాని ప్రకారంగా 12 వారాలు ఫాలో అవడం వల్ల ఆ వ్యక్తి 27 కిలోల బరువు తగ్గాడు. పర్సనల్ ట్రెయినర్గానూ చాట్‌జీపీటీని ఉపయోగించుకుంటున్నారంటే మీరు గ్రేట్. ఏఐని కొన్ని పనులకు వాడుకోవచ్చు కానీ.. ఆరోగ్యానికి సంబంధించిన వాటిలో కొంచెం ఆచీతూచీ ఆలోచించాలి. అది ఎలాంటి ప్రాంప్ట్స్ ఇచ్చినా గుడ్డిగా నమ్మకూడదు అంటూ కొందరు ఆ వ్యక్తి పోస్టుపై కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా.. ఏఐని మంచికి వాడుకుంటే, మంచే జరుగుతుందని ఈ వ్యక్తి నిరూపించాడు. I LOST 27 KILOS WITH CHATGPT AS MY PERSONAL TRAINER. No gym. No expensive apps. No BS. Just daily discipline + prompts that actually gave me structure. Here’s the 7 Prompts that can do the same for you: — Hasan (@Ubermenscchh) January 1, 2026