Sankranti Movies | సంక్రాంతి సినిమాల టికెట్ ధరలు పెరగనున్నాయా? – సినీ లవర్స్‌పై భారం పడనుందా?
సంక్రాంతి సినిమాల టికెట్ ధరలు పెరగనున్నాయా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. భారీ బడ్జెట్ సినిమాలకు టికెట్ ధరలు పెంచక తప్పదనేది నిర్మాతల వాదన. మరోవైపు టికెట్ ధరలు పెంచితే సినిమా లవర్స్‌పై అదనపు భారం పడుతుందని నెటిజన్లు అంటున్నారు.
Entertainment | Published On Jan 5, 2026, 9.56 am IST
Sankranti Movies | సినీ పరిశ్రమలో సంక్రాంతి సీజన్ ఎప్పుడు ప్రత్యేకమే. సంక్రాంతి బెర్తుల కోసం పోటీ ఇండస్ట్రీలో గట్టిగానే ఉంటుంది. ఏడాది ముందు నుంచే పండుగ బరిలో నిలిచేందుకు సినిమాలను రెడీ చేస్తుంటారు మేకర్స్. సంక్రాంతికి అగ్ర హీరోల సినిమాలు రిలీజ్ కావడం ఆనవాయితీగా వస్తోంది. ప్రతి ఏటా పండుగకు మూడు నాలుగు సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఈ సంక్రాంతి క్లాష్ మాత్రం ఆసక్తికరంగా మారింది. ఈ సారి ఏకంగా ఏడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. చిరంజీవి, ప్రభాస్, రవితేజ, దళపతి విజయ్ వంటి స్టార్ హీరోల సినిమాలు సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. వీరిలో విజేతగా ఎవరు నిలుస్తారన్నది ఉత్కంఠను పంచుతోంది.
1500 కోట్ల పందెం...
అనగనగా ఒక రాజు మినహా ఈ సంక్రాంతికి అన్ని పెద్ద సినిమాలే రిలీజ్ అవుతోన్నాయి. ఈ ఏడు సినిమాల బడ్జెట్ 1500 కోట్లకుపైనే ఉంటుందని టాక్ వినిపిస్తోంది. వీటిలో రాజాసాబ్ 500 కోట్లతో హయ్యెస్ట్ బడ్జెట్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మన శంకర వరప్రసాద్ గారు సినిమాను 200 కోట్లతో తెరకెక్కించినట్లు సమాచారం. జననాయగన్ బడ్జెట్ కూడా అటు ఇటుగా నాలుగు వందల కోట్ల వరకు ఉంటుందని చెబుతున్నారు.
ప్రభాస్ రాజాసాబ్ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే ఆరు నుంచి ఏడు వందల కోట్లకుపైనే కలెక్షన్స్ రాబట్టాల్సివుంటుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. పోటీ మధ్య అన్ని వందల కోట్లు రాబట్టడమంటే అంత ఈజీ కాదు. టాక్ బాగుంటే ఓకే...ఏ మాత్రం నెగెటివ్‌గా వచ్చినా నిర్మాతలకు రిస్కే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
బెనిఫిట్ షోలు...
ఈ భారీ బడ్జెట్‌లు రికవరీ కావాలంటే టికెట్ ధరలు పెంచడం ఒక్కటే మార్గమనే భావనలో నిర్మాతలు ఉన్నారట. 100 రూపాయల టికెట్ ధర పెద్ద సినిమాలకు వర్కవుట్ కాదన్నది నిర్మాతల వాదన. స్టార్ హీరోల సినిమాలకు టికెట్ ధరల పెంపు, ప్రీమియర్ షోలకు అనుమతులు ఇవ్వడం తెలుగు రాష్ట్రాల్లో చాలా రోజులుగా జరుగుతున్న తంతే. సంక్రాంతికి రిలీజ్ అవుతోన్న సినిమాల్లో రాజాసాబ్, మన శంకర వరప్రసాద్ గారుకు టికెట్ రేట్లు, బెనిఫిట్ షోలకు సంబంధించిన జీవోలు ఒకటి రెండు రోజుల్లో రావచ్చునని అంటున్నారు. ప్రీమియర్ షో టికెట్ ధరలు రాజాసాబ్‌కు 800, మన శంకర వరప్రసాద్‌కు 500 వరకు ఉండొచ్చని టాక్ వినిపిస్తోంది. వారం రోజుల పాటు సింగిల్ స్క్రీన్స్‌తో పాటు మల్టీప్లెక్స్‌లలో వంద రూపాయల వరకు టికెట్ ధరలు పెంచుకునేలా అనుమతులు రావచ్చుననే వార్తలు వినిపిస్తున్నాయి. మిగిలిన సినిమాలకు బెనిఫిట్ షోలు లేకపోయినా టికెట్ ధరల పెరగొచ్చని అంటున్నారు.
సినీ లవర్స్ డిమాండ్....
ఈ టికెట్ ధరల పెంపు వల్ల సినీ లవర్స్‌పై భారం పడే అవకాశం కనిపిస్తోంది. పెరిగే టికెట్ ధరలతో కనీసం ఐదు సినిమాలు చూడాలంటే ఒక్కో ఆడియెన్ 2500 వరకు ఖర్చు చేయాల్సివస్తుందని అంటున్నారు. నలుగురు కుటుంబసభ్యులున్న ఫ్యామిలీలో కనీసం రెండు సినిమాలు చూడాలన్న ఐదారు వేలకు పైనే అవుతుంది. పాప్‌కార్న్, కూల్ డ్రింక్ ధరలు అదనం. అంతంత టికెట్ ధరలు పెట్టి ఫ్యామిలీ ఆడియెన్స్ సినిమాలను చూడటానికి వస్తారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. టికెట్ ధరలు పెంచద్దొంటూ సినీ లవర్స్ డిమాండ్ చేస్తున్నారు. ఆడియెన్స్ డిమాండ్స్‌ను మేకర్స్ పట్టించుకుంటారా? టికెట్ ధరలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



