త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Fastfoods | ఫాస్ట్‌ఫుడ్ సెంట‌ర్ల‌లో ఫుడ్ తింటున్నారా..? అయితే జాగ్ర‌త్త‌..!

Fastfoods | ప్ర‌స్తుతం ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్లు అధిక‌మ‌య్యాయ‌ని చెప్ప‌వ‌చ్చు. ప్ర‌తి వీధికి ఒక ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ వెలుస్తోంది. అక్క‌డి నుంచి వ‌చ్చే వాస‌న‌ల‌కు అంద‌రికీ నోరూరిపోతుంది. దీంతో ఫాస్ట్ ఫుడ్‌ను ఒక ప‌ట్టు ప‌ట్టాల‌ని చూస్తుంటారు. మంచూరియా, నూడుల్స్‌, ఫ్రైడ్ రైస్.. ఇలా ప‌లు రకాల ఫాస్ట్ ఫుడ్స్ ను తింటుంటారు.

S

Lifestyle | Published On Jan 3, 2026, 6.25 am IST

Fastfoods | ఫాస్ట్‌ఫుడ్ సెంట‌ర్ల‌లో ఫుడ్ తింటున్నారా..? అయితే జాగ్ర‌త్త‌..!
Advertisement

Fastfoods | ప్ర‌స్తుతం ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్లు అధిక‌మ‌య్యాయ‌ని చెప్ప‌వ‌చ్చు. ప్ర‌తి వీధికి ఒక ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ వెలుస్తోంది. అక్క‌డి నుంచి వ‌చ్చే వాస‌న‌ల‌కు అంద‌రికీ నోరూరిపోతుంది. దీంతో ఫాస్ట్ ఫుడ్‌ను ఒక ప‌ట్టు ప‌ట్టాల‌ని చూస్తుంటారు. మంచూరియా, నూడుల్స్‌, ఫ్రైడ్ రైస్.. ఇలా ప‌లు రకాల ఫాస్ట్ ఫుడ్స్ ను తింటుంటారు. అయితే జిహ్వా చాప‌ల్యాన్ని తీర్చుకోవ‌డం వ‌ర‌కు అంతా బాగానే ఉంటుంది. కానీ ఆ త‌రువాతే అస‌లు స‌మ‌స్య వ‌స్తుంది. ఫాస్ట్ ఫుడ్‌ను తిన్నంత వ‌ర‌కు రుచిగానే ఉంటుంది. కానీ అందులో ఉప‌యోగించే ప‌చ్చి ఆకులు, కూర‌గాయ‌ల కార‌ణంగా తీవ్ర‌మైన ఇన్‌ఫెక్ష‌న్ సోకి ప్రాణాలు పోయే ప్ర‌మాదం ఉంటుంది. ఫాస్ట్ ఫుడ్‌ను తింటే అంత‌టి తీవ్ర‌త ఉంటుందా..? అని ఆంద‌రూ న‌మ్మ‌క‌పోవచ్చు. కానీ ఇది నిజ‌మే. ఢిల్లీలో ఇలాంటిదే ఓ సంఘ‌ట‌న తాజాగా చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే..

ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ ఫుడ్ కార‌ణంగానే..

ఢిల్లీలోని అమ్రోహా అనే ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల ఇల్మా న‌దీం అనే యువ‌తి స్థానికంగా ఉన్న ఓ కాలేజీలో బీఏ మొద‌టి సంవ‌త్స‌రం విద్య‌ను అభ్య‌సిస్తోంది. కాగా ఆమె ఇటీవ‌ల అక్క‌డ ఓ ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్‌లో ఫుడ్ తిన‌గా కొంత సేప‌టికి ఆమెకు తీవ్రమైన త‌ల‌నొప్పి, మూర్ఛ వ‌చ్చాయి. దీంతో ఆమె స్పృహ త‌ప్పింది. ఈ క్ర‌మంలో ఆమెను చికిత్స నిమిత్తం అక్కడే ఉన్న రామ్ మ‌నోహ‌ర్ లోహియా (ఆర్ఎంఎల్‌) హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. అయితే ఆమెకు వైద్యులు సీటీ స్కాన్‌, ఎంఆర్ఐ త‌దిత‌ర ప‌రీక్ష‌లు నిర్వ‌హించగా ఆమెకు న్యూరోసిస్టిసెర్కోసిస్ అనే స‌మ‌స్య వ‌చ్చిన‌ట్లు గుర్తించారు. ఇది ఒక ప్రాణాంత‌క అనారోగ్య స‌మ‌స్య‌. ప‌చ్చి క్యాబేజీ లేదా కూర‌గాయ‌ల‌ను స‌రిగ్గా ఉడికించ‌కుండా లేదా క‌డ‌గ‌కుండా నేరుగా అలాగే తింటే వాటిపై ఉండే బ‌ద్దె పురుగులు మ‌న‌కు తెలియ‌కుండానే మ‌న శ‌రీరంలోకి చేరతాయి.

ప‌చ్చి క్యాబేజీతో జాగ్ర‌త్త‌..

అలా బ‌ద్దె పురుగులు ఒక‌సారి మ‌న శ‌రీరంలోకి ప్రవేశిస్తే మెద‌డుకు చేరుకుని తీవ్ర‌మైన ఇన్ఫెక్ష‌న్ ను క‌ల‌గ‌జేస్తాయి. ఆ పురుగులు అక్క‌డ గుడ్ల లాంటి చిన్న చిన్న గ‌డ్డ‌లు ఏర్పాట‌య్యేలా చేస్తాయి. అలా నదీం మెద‌డులోనూ బ‌ద్దె పురుగులు చేరి 20 నుంచి 25 వ‌ర‌కు గ‌డ్డ‌ల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు వైద్యులు గుర్తించారు. దీంతో ఆమెకు వైద్యులు వెంట‌నే శ‌స్త్ర చికిత్స చేసేందుకు య‌త్నించారు. కానీ అందుకు ఆ స‌మ‌స్య స‌మ‌యం కూడా ఇవ్వ‌లేదు. ఆమె ఆరోగ్యం నిమిష నిమిషానికి క్షీణించింది. దీంతో ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. బ‌ద్దె పురుగులు మ‌న శ‌రీరంలో ప్ర‌వేశిస్తే నేరుగా నాడీ మండ‌ల వ్య‌వ‌స్థ పైనే ప్ర‌భావం చూపిస్తాయ‌ని, దీంతో ప్రాణాపాయ ప‌రిస్థితులు ఏర్ప‌డుతాయ‌ని వైద్యులు తెలిపారు. క‌నుక ప‌చ్చి క్యాబేజీని అధికంగా వాడే ఫాస్ట్ ఫుడ్‌ను తిన‌కూడ‌ద‌ని, పూర్తిగా శుభ్ర‌మైన వాతావ‌ర‌ణంలో వండిన ఆహారాల‌నే తినాల‌ని వారు హెచ్చ‌రిస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement