త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ashes Series 2025-26 | యాషెస్ సిరీస్ 5వ టెస్టు.. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 384 ప‌రుగుల‌కు ఆలౌట్‌..

Ashes Series 2025-26 | యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాలోని సిడ్నీలో కొన‌సాగుతున్న చివ‌రిదైన 5వ టెస్టులో ఇంగ్లండ్ త‌న తొలి ఇన్నింగ్స్‌లో 384 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ మొత్తం 97.3 ఓవ‌ర్లు ఆడి ఆ స్కోరు చేసింది.

S

Cricket | Published On Jan 5, 2026, 10.03 am IST

Ashes Series 2025-26 | యాషెస్ సిరీస్ 5వ టెస్టు.. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 384 ప‌రుగుల‌కు ఆలౌట్‌..
Advertisement

Ashes Series 2025-26 | యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాలోని సిడ్నీలో కొన‌సాగుతున్న చివ‌రిదైన 5వ టెస్టులో ఇంగ్లండ్ త‌న తొలి ఇన్నింగ్స్‌లో 384 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ మొత్తం 97.3 ఓవ‌ర్లు ఆడి ఆ స్కోరు చేసింది. ఇంగ్లండ్ ప్లేయ‌ర్ల‌లో జో రూట్ రాణించ‌గా, హారీ బ్రూక్ సెంచ‌రీ మిస్ చేసుకున్నాడు. ఇత‌ర ప్లేయ‌ర్లు కూడా క్రీజులో కాసేపు నిలిచినా ప‌రుగుల‌ను రాబ‌ట్ట‌డంలో విజ‌యం సాధించారు. మొత్తం 242 బంతులు ఆడిన జో రూట్ 15 ఫోర్ల‌తో 160 ప‌రుగులు చేయ‌గా, 97 బంతుల్లో హారీ బ్రూక్ 6 ఫోర్లు, 1 సిక్స‌ర్ తో 84 ప‌రుగులు చేశాడు. ఇక ఆసీస్ బౌల‌ర్ల‌లో మైకేల్ నెస‌ర్ అత్య‌ధికంగా 4 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా, మిచెల్ స్టార్క్‌, స్కాట్ బోలండ్‌ల‌కు చెరో 2 వికెట్లు ద‌క్కాయి. అలాగే కామెరాన్ గ్రీన్‌, మార్న‌స్ ల‌బుషేన్ చెరొక వికెట్ తీశారు.

138 ఏళ్ల‌లో తొలిసారిగా..

ఆస్ట్రేలియాలోని సిడ్నీ క్రికెట్ మైదానం స్పిన్న‌ర్ల‌కు అనుకూలిస్తుంది. ఆ దేశంలో 95 శాతం వ‌ర‌కు ఉన్న‌వి ఫాస్ట్ బౌలింగ్ పిచ్‌లే. సిడ్నీ లాంటి కొన్ని వేదిక‌లు మాత్ర‌మే స్పిన్న‌ర్ల‌కు అనుకూలంగా ఉంటాయి. ఈ క్ర‌మంలోనే భార‌త్‌, పాకిస్థాన్‌, శ్రీ‌లంక వంటి జ‌ట్లు సిడ్నీలో ఆస్ట్రేలియాపై చాలా సార్లు విజ‌యం సాధించాయి. స్పిన్న‌ర్లు ఈ మైదానంలో రాణించ‌డ‌మే ఇందుకు కార‌ణం. అయితే ఇంగ్లండ్‌తో సిడ్నీలో జ‌రుగుతున్న 5వ టెస్టులో ఆస్ట్రేలియా మాత్రం స్పిన్న‌ర్ లేకుండానే బ‌రిలోకి దిగింది. దీంతో అంద‌రూ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. కాగా 138 ఏళ్ల‌లో ఆస్ట్రేలియా ఇలా చేయ‌డం తొలిసారి అని గ‌ణాంకాలు చెబుతున్నాయి. స్పిన్న‌ర్ లేకుండానే ఆస్ట్రేలియా సిడ్నీ టెస్టులో బ‌రిలోకి దిగ‌డం అన్నేళ్ల‌లో ఇదే తొలిసార‌ని అంటున్నారు. అయితే స్పిన్న‌ర్ లేని ప్ర‌భావం ఆసీస్‌పై గట్టిగానే ప‌డింది. పార్ట్ టైమ్ స్పిన్న‌ర్‌ల‌పై ఆధార ప‌డ‌డంతో వారు అంత‌గా రాణించ‌లేక‌పోయారు. ఈ క్ర‌మంలో క్రీజులో నిల‌దొక్కుకున్న ఇంగ్లండ్ ప్లేయ‌ర్లు త‌మ తొలి ఇన్నింగ్స్‌లో గౌర‌వ ప్ర‌ద‌మైన స్కోరు చేయ‌గ‌లిగారు.

బాండీ బీచ్ మృతుల‌కు నివాళులు..

యాషెస్ సిరీస్ 5వ టెస్టు సంద‌ర్బంగా సిడ్నీ మైదానంలో బాండీ బీచ్ మృతుల‌కు క్రికెట‌ర్లు, ప్రేక్ష‌కులు నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా ఉగ్రదాడి అనంత‌రం అత్య‌వ‌స‌ర సేవ‌ల‌ను అందించిన సిబ్బందితోపాటు మృతుల కుటుంబాల‌కు క్రికెట‌ర్లు గార్డ్ ఆఫ్ ఆన‌ర్ ఇచ్చారు. అలాగే ఓ ఉగ్ర‌వాది నుంచి గ‌న్ లాక్కుని ఇంకా ఎక్కువ ప్రాణ నష్టం జ‌ర‌గ‌కుండా ప్రాణాల‌కు తెగించి మ‌రీ పోరాటం చేసిన అహ్మ‌ద్ అల్ అహ్మ‌ద్‌ను కూడా వారు గౌరవించారు. అత‌ను మైదానంలోకి అడుగు పెట్ట‌గానే ప్రేక్ష‌కులు మ‌రింత ఎక్కువ శబ్దంతో చ‌ప్ప‌ట్ల‌ను కొడుతూ అత‌నికి మ‌ద్ద‌తుగా నిలిచారు. కాగా ప్ర‌స్తుతం క్రికెట్ ఆడుతున్న సిడ్నీ మైదానానికి స‌ద‌రు బాండీ బీచ్ అత్యంత స‌మీపంలోనే ఉండ‌డం విశేషం.

Advertisement

తాజావార్తలు

Advertisement