త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Lentils | ప‌ప్పు తిన్నాక గ్యాస్ ట్ర‌బుల్‌కు కార‌ణం ఇదే.. ఇలా చేస్తే స‌మ‌స్య ఉండ‌దు..

Lentils | భార‌తీయులు అన్ని ర‌కాల ప‌ప్పు దినుసుల‌ను అధికంగా తింటార‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. కందిప‌ప్పు, శ‌గ‌న‌ప‌ప్పు, మిన‌ప ప‌ప్పు, పెస‌ర ప‌ప్పు.. ఇలా అనేక ర‌కాల ప‌ప్పు దినుసుల‌ను అంద‌రూ తింటుంటారు. అయితే ప‌ప్పు తింటే క‌డుపు ఉబ్బ‌రం వ‌స్తుంద‌ని, గ్యాస్ అధికంగా ఉత్ప‌త్తి అవుతుంద‌ని చాలా మంది విశ్వ‌సిస్తారు.

S

Lifestyle | Published On Jan 5, 2026, 6.56 am IST

Lentils | ప‌ప్పు తిన్నాక గ్యాస్ ట్ర‌బుల్‌కు కార‌ణం ఇదే.. ఇలా చేస్తే స‌మ‌స్య ఉండ‌దు..
Advertisement

Lentils | భార‌తీయులు అన్ని ర‌కాల ప‌ప్పు దినుసుల‌ను అధికంగా తింటార‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. కందిప‌ప్పు, శ‌గ‌న‌ప‌ప్పు, మిన‌ప ప‌ప్పు, పెస‌ర ప‌ప్పు.. ఇలా అనేక ర‌కాల ప‌ప్పు దినుసుల‌ను అంద‌రూ తింటుంటారు. అయితే ప‌ప్పు తింటే క‌డుపు ఉబ్బ‌రం వ‌స్తుంద‌ని, గ్యాస్ అధికంగా ఉత్ప‌త్తి అవుతుంద‌ని చాలా మంది విశ్వ‌సిస్తారు. అది నిజ‌మే. కానీ ప‌ప్పును వండే ప‌ద్ధతిలో చిన్న మార్పును చేయాల్సి ఉంటుంది. అలా చేస్తే గ్యాస్ అస‌లు రాద‌ని, సుల‌భంగా జీర్ణం అవుతుంద‌ని, దాంతో అనేక పోష‌కాలు కూడా ల‌భిస్తాయని డాక్ట‌ర్ జ‌యేష్ శ‌ర్మ తెలిపారు. ఆయ‌న రాయ్‌పూర్‌లోని ఓ హాస్పిట‌ల్‌లో ఆంకాల‌జిస్టుగా ప‌నిచేస్తున్నారు. ఆయ‌న వృత్తిలో ఆయ‌న‌కు 25 ఏళ్ల అనుభ‌వం కూడా ఉంది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ప‌ప్పు గురించి ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను వెల్ల‌డించారు.

స‌రైన ప‌ద్ధ‌తిలో వండాలి..

సాధారణంగా చాలా మంది ఏదైనా ప‌ప్పును తింటే గ్యాస్ వ‌స్తుంది, క‌డుపు ఉబ్బ‌రంగా ఉంటుంద‌ని, త్వ‌ర‌గా జీర్ణం కాద‌ని భావిస్తారు. అది నిజమే. అయితే అలా జ‌రిగేందుకు కార‌ణాలు ఉంటాయి. ప‌ప్పు దినుసుల్లో ఉండే పోష‌కాల‌ను శ‌రీరం స‌రిగ్గా జీర్ణం చేయ‌లేదు. కొంద‌రిలో ఈ స‌మ‌స్య ఉంటుంది. క‌నుక ప‌ప్పు దినుసులు అంద‌రికీ స‌రిగ్గా జీర్ణం కావు. దీంతో గ్యాస్ ఏర్ప‌డుతుంది. క‌డుపు ఉబ్బ‌రం వస్తుంది. ఈ క్ర‌మంలో త‌మ‌కు ప‌ప్పు ప‌డ‌డం లేద‌ని, ప‌ప్పు తింటే జీర్ణం కావ‌డం లేద‌ని, గ్యాస్ వ‌స్తుంద‌ని అనుకుంటారు. అలాంటి వారు ప‌ప్పును తినేందుకు కూడా వెనుక‌డుగు వేస్తుంటారు. కానీ ఏ ప‌ప్పు దినుసుల‌ను అయినా స‌రే నిర్దిష్ట‌మైన ప‌ద్ధ‌తిలో వండాల్సి ఉంటుంది. అప్పుడే ఆయా జీర్ణ స‌మ‌స్య‌లు రాకుండా చూసుకోవ‌చ్చు.. అని డాక్ట‌ర్ శ‌ర్మ తెలిపారు.

FODMAPs అంటే ఏమిటి..?

ప‌ప్పు దినుసుల‌ను వండేముందు క‌చ్చితంగా కొన్ని గంట‌ల‌పాటు నీటిలో నాన‌బెట్టాలి. దీని వ‌ల్ల అవి త్వ‌ర‌గా ఉడ‌క‌డ‌మే కాదు, మెత్త‌గా కూడా మారుతాయి. ఎంతో వంట ఇంధ‌నం ఆదా అవుతుంది. ఇక ప‌ప్పు దినుసుల‌లో FODMAPs అని పిల‌వ‌బ‌డే ప్ర‌త్యేక‌మైన సంక్లిష్ట చ‌క్కెర‌లు ఉంటాయి. అవి ఉడికేందుకు సమ‌యం ప‌డుతుంది, ఈ క్ర‌మంలో స‌రిగ్గా ఉడ‌క‌ని ప‌ప్పును తింటే FODMAPs అధికంగా ఉంటాయి క‌నుక ఆ ప‌ప్పు మ‌న‌కు త్వ‌ర‌గా జీర్ణం కాదు. గ్యాస్ ఏర్ప‌డేలా చేస్తాయి. దీంతో క‌డుపు ఉబ్బ‌రంగా కూడా మారుతుంది. క‌నుక FODMAPs అధికంగా ఉండ‌కుండా చూడాలి. అందుకు గాను ప‌ప్పు దినుసుల‌ను బాగా ఉడికించాలి. బాగా మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడ‌క‌బెట్టాలి. దీంతో FODMAPs ప్ర‌భావం త‌గ్గుతుంది. ఆ త‌రువాత ఆ ప‌ప్పును తిన్నా కూడా మ‌న‌కు జీర్ణ స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి.

ప్రెష‌ర్ కుక్క‌ర్ అయితే మంచిది..

ఇక ప‌ప్పు దినుసుల‌ను ఎల్ల‌ప్పుడూ ప్రెష‌ర్ కుక్క‌ర్‌లోనే ఉడికించాలి. దీని వ‌ల్ల కూడా చాలా వ‌ర‌కు FODMAPs ప్ర‌భావాన్ని త‌గ్గించ‌వ‌చ్చు. ఈ క్ర‌మంలో ప్రెష‌ర్ కుక్క‌ర్‌లో అత్య‌ధిక ఉష్ణోగ్ర‌త‌ల వ‌ద్ద FODMAPs విచ్ఛిన్నం అవుతాయి. ఆ త‌రువాత ప‌ప్పు ఉడికిన అనంత‌రం దాన్ని తింటే సుల‌భంగా జీర్ణ‌మ‌వుతుంది. గ్యాస్ ఏర్ప‌డ‌కుండా ఉంటుంది. క‌డుపు ఉబ్బ‌రం కూడా రాదు. ఈ విధంగా ప‌ప్పు దినుసుల‌ను వండే విష‌యంలో జాగ్ర‌త్త‌ల‌ను పాటిస్తే వాటి ద్వారా ఆయా జీర్ణ స‌మ‌స్య‌లు రాకుండా చూసుకోవ‌చ్చ‌ని డాక్ట‌ర్ శ‌ర్మ తెలియ‌జేశారు. ప‌ప్పు దినుసుల‌ను అలాగే వండుకోవాల‌ని ఆయ‌న సూచించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement