త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

5th Jan 2026 Gold And Silver Rates | వెనెజువెలాపై అమెరికా చ‌ర్య ఎఫెక్ట్‌.. పెరిగిన బంగారం ధ‌ర‌లు..

5th Jan 2026 Gold And Silver Rates | అంత‌ర్జాతీయంగా చోటు చేసుకుంటున్న ప‌రిణామాల ప్ర‌భావం బంగారం ధ‌ర‌ల‌పై కూడా ప‌డుతోంది. జ‌న‌వ‌రి 3వ తేదీన వెనెజువెలా అధ్య‌క్షుడు నికోలాస్ మ‌దురోను అమెరికా మిలిట‌రీ బ‌ల‌గాలు అరెస్టు చేయ‌డంతో ఆ ప్ర‌భావం జ‌న‌వ‌రి 5న బంగారం ధ‌ర‌ల‌పై ప‌డింది.

S

Business | Published On Jan 5, 2026, 9.37 am IST

5th Jan 2026 Gold And Silver Rates | వెనెజువెలాపై అమెరికా చ‌ర్య ఎఫెక్ట్‌.. పెరిగిన బంగారం ధ‌ర‌లు..
Advertisement

5th Jan 2026 Gold And Silver Rates | అంత‌ర్జాతీయంగా చోటు చేసుకుంటున్న ప‌రిణామాల ప్ర‌భావం బంగారం ధ‌ర‌ల‌పై కూడా ప‌డుతోంది. జ‌న‌వ‌రి 3వ తేదీన వెనెజువెలా అధ్య‌క్షుడు నికోలాస్ మ‌దురోను అమెరికా మిలిట‌రీ బ‌ల‌గాలు అరెస్టు చేయ‌డంతో ఆ ప్ర‌భావం జ‌న‌వ‌రి 5న బంగారం ధ‌ర‌ల‌పై ప‌డింది. ఈ క్ర‌మంలోనే సోమ‌వారం ఒక్క రోజే బంగారం ధ‌ర భారీగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధ‌ర ఒక ఔన్సుకు 4391 డాల‌ర్లుగా కొన‌సాగుతోంది. అంత‌కు ముందు సెష‌న్ల‌లో ట్రేడ్ అయిన‌ ధ‌ర‌తో పోలిస్తే బంగారం ధ‌ర‌ 1.40 శాతం పెరిగింది. వారం రోజుల ధ‌ర‌ల ప్ర‌కారం చూస్తే బంగారం ధ‌ర‌లో 3.68 శాతం పెరుగుద‌ల క‌నిపించింది. కాగా అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధ‌ర డిసెంబ‌ర్ 26, 2025వ తేదీన 4546 డాల‌ర్ల‌కు ఆల్ టైమ్ హై కి చేరుకుని రికార్డు సృష్టించింది.

జ‌న‌వ‌రి 2వ తేదీన భార‌త్‌కు చెందిన ఎంసీఎక్స్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛ‌మైన‌ బంగారం ధ‌ర 10 గ్రాముల‌కు రూ.1,35,821 వ‌ద్ద ముగియ‌గా, ప్రస్తుతం రూ.1,37,350 వద్ద కొన‌సాగుతోంది. ఉద‌యం 9 గంట‌ల‌కు మార్కెట్ ఆరంభం కాగానే బంగారం ధ‌ర ఒక్క‌సారిగా భారీగా పెరిగింది. ఈ క్ర‌మంలోనే గ‌త సెష‌న్‌తో పోలిస్తే ప్ర‌స్తుతం బంగారం ధ‌ర‌లో రూ.1500 వ‌ర‌కు పెరుగుద‌ల క‌నిపించింది. సోమ‌వారం సెష‌న్‌లో బంగారం ధ‌ర రూ.1,38,207 గ‌రిష్ట స్థాయిని తాకింది. అనంత‌రం రూ.1,37,350 వ‌ద్ద కొన‌సాగుతోంది. కాగా అమెరికా డాల‌ర్‌తో పోలిస్తే భార‌త రూపాయి విలువ కాస్త త‌గ్గింది. ఈ క్ర‌మంలోనే డాల‌ర్‌కు రూ.90.016 వ‌ద్ద ప్ర‌స్తుతం ధ‌ర కొన‌సాగుతోంది. గ‌త సెష‌న్‌తో పోలిస్తే డాల‌ర్ ధ‌రలో 0.02 శాతం పెరుగుద‌ల క‌నిపించింది.

కాగా భార‌త మార్కెట్‌లో ప్ర‌స్తుతం 24 గ్రాముల స్వ‌చ్ఛ‌మైన బంగారాన్ని 10 గ్రాములకు రూ.1,35,810 ధ‌ర‌కు వ్యాపారులు విక్ర‌యిస్తున్నారు. అలాగే 22 క్యారెట్ల బంగారాన్ని 10 గ్రాముల‌కు రూ.1,24,490 ధ‌ర‌కు విక్ర‌యిస్తుండ‌గా, 18 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధ‌ర రూ.1,01,860గా ఉంది. ఇక కిలో వెండి ధ‌ర రూ.2,56,900 ఉండ‌గా, ఎంసీఎక్స్‌లో మాత్రం గ‌త సెష‌న్‌తో పోలిస్తే వెండి ధ‌ర రూ.6వేల మేర పెరిగింది. ప్ర‌స్తుతం ఎంసీఎక్స్‌లో వెండి ఫ్యూచ‌ర్స్ రూ.2,42,400 వ‌ద్ద కొన‌సాగుతుండ‌గా, సోమ‌వారం సెషన్‌లో మాత్రం వెండి ధ‌ర కింద‌కు దిగి వ‌స్తోంది. అయితే ఎంసీఎక్స్‌లో ట్రేడ్ అయ్యే బంగారం, వెండి ధ‌ర‌లు మ‌రుస‌టి రోజు భార‌త బంగారం మార్కెట్‌లో ప్ర‌తిబింబిస్తాయి. క‌నుక బంగారం ధ‌ర పెర‌గ‌నుండగా, వెండి ధ‌ర మాత్రం త‌గ్గ‌నుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement