త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BRS Complaint | భూ క‌బ్జాదారుల‌పై చ‌ర్య‌లు తీసుకోండి.. రంగారెడ్డి క‌లెక్ట‌రేట్‌లో బీఆర్ఎస్ ఫిర్యాదు

BRS Complaint | నాదర్గుల్ 373 ఎకరాల ప్రభుత్వ భూములను కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి క‌బ్జా చేస్తున్నార‌ని, వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని బీఆర్ఎస్ నేత‌లు (BRS Leaders) డిమాండ్ చేశారు. నాదర్ గుల్, కోహెడ మార్కెట్ భూముల వ్యవహారంలో బాధ్యుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డికి శుక్ర‌వారం ఫిర్యాదు (Complaint) చేశారు.

S

News | Published On Apr 10, 2026, 12.36 pm IST

BRS Complaint | భూ క‌బ్జాదారుల‌పై చ‌ర్య‌లు తీసుకోండి.. రంగారెడ్డి క‌లెక్ట‌రేట్‌లో బీఆర్ఎస్ ఫిర్యాదు
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: నాదర్గుల్ 373 ఎకరాల ప్రభుత్వ భూములను కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి క‌బ్జా చేస్తున్నార‌ని, వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని బీఆర్ఎస్ నేత‌లు (BRS Leaders) డిమాండ్ చేశారు. నాదర్ గుల్, కోహెడ మార్కెట్ భూముల వ్యవహారంలో బాధ్యుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డికి శుక్ర‌వారం ఫిర్యాదు (Complaint) చేశారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న బాధ్యుల‌పై క‌ఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞ‌ప్తి చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో మాజీ మంత్రి సబిత ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీలు దాసోజు శ్రావణ్, వాణిదేవి, మాజీ ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, అంజయ్య, పట్నం నరేందర్ రెడ్డి ఉన్నారు.

అనంత‌రం బీఆర్ఎస్ నేత‌లు మాట్లాడుతూ.. సర్వే నంబర్ 673 లో కొందరు కాంగ్రెస్ నేతల అక్రమాలకు పాల్ప‌డుతున్నార‌ని, 600 మంది రైతులకు చెందిన భూమిని స్వాహా చేసేందుకు య‌త్నిస్తున్నార‌న్నారు. బౌన్సర్లు గుండాలను అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ మంత్రి కబ్జాల‌కు తెర లేపార‌ని మండిపడ్డారు. చుట్టూ రేకులతో బార్కండ్లు నిర్మించి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.

రైతులకు సంబంధిన బోర్లను పగలకొట్టడం, వారిపై దాడి చేసిన బయటికి పంపడం దారుణ‌మ‌న్నారు. ప్రభుత్వ భూముల్లో కాంగ్రెస్ నాయకులు అక్రమ షెడ్లు వేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. వారిపై చర్యలు ఉండవా అని ప్ర‌శ్నించారు. స్థానిక ఆర్డీవోకు ఫిర్యాదు చేస్తే కనీసం ప‌ట్టించుకోలేదని విమ‌ర్శించారు. త‌క్ష‌ణ‌మే సంబంధిత అధికారులు స్పందించి కోట్ల రూపాయల విలువ చేసే ప్ర‌భుత్వ భూముల‌ను కాపాడాల‌ని డిమాండ్ చేశారు.

 

 

Advertisement
Advertisement