MVSR Student death Case | ఎంవీఎస్ఆర్ స్టూడెంట్‌కు కోటి పరిహారం ఇవ్వండి.. బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోండి
MVSR Student death Case | ఎంవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థిని కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. కళాశాల యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు.
- కరస్పాండెంట్, ప్రిన్సిపల్, ఈవెంట్ నిర్వాహకులపై నాన్-బెయిలబుల్ కేసులు పెట్టాలి
- కళాశాల గుర్తింపును రద్దు చేయాలి
- ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ డిమాండ్
MVSR Student death Case | త్రినేత్ర న్యూస్: ఎంవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థిని కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. కళాశాల యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. బతుకమ్మ పండగ వేల విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. రెక్కలు ముక్కలు చేసుకొని ఇంజినీరింగ్ చదివిస్తున్న నిరుపేద కుటుంబానికి తీరని అన్యాయం జరిగిందన్నారు. విద్యను వ్యాపారంగా, వినోద కార్యక్రమంగా మార్చి ప్రాణాలతో చెలగాటమాడిన యాజమాన్యం తీరు క్షమించరానిదన్నారు. ఈమేరకు ఆదివారం ఆయన ఎక్స్ వేదికగా పెట్టిన పోస్టు పెట్టారు.
ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి
రంగారెడ్డి జిల్లా నాదర్గుల్లోని ఎంవీఎస్ఆర్ (MVSR) ఇంజినీరింగ్ కళాశాలలో ఇటీవల నిర్వహించిన బతుకమ్మ సంబరాల సందర్భంగా యాజమాన్య నిర్లక్ష్యం, కనీస భద్రతా చర్యలు లోపించడం వల్ల తీవ్ర విషాదం జరిగింది. ఈ దుర్ఘటనలో వనపర్తి జిల్లాకు చెందిన బలహీన వర్గాల కుటుంబాలకు చెందిన విద్యార్థినులలో సోనీ అనే విద్యార్థిని మృతి చెందింది. మీనకు తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతున్నారు. ఈ ఉదంతంలో ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలి. యాజమాన్య నిర్లక్ష్యానికి బలైన సోనీ కుటుంబానికి కళాశాల నిధుల నుంచి రూ.కోటి, తీవ్రంగా గాయపడిన మీనాకు రూ. కోటి పరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి.
వేలాది మంది విద్యార్థులు హాజరయ్యే వేడుకల్లో అగ్నిమాపక (Fire Safety), తొక్కిసలాట నివారణ (Crowd Control), ప్రథమ చికిత్స లేదా అత్యవసర వైద్య సదుపాయాలు ఏవీ సమకూర్చలేదు. నిబంధనల ప్రకారం స్థానిక పోలీసు, మున్సిపల్ అనుమతులు లేకుండానే కార్యక్రమాన్ని నిర్వహించినట్లు స్పష్టమవుతోంది. ప్రవేశం కోసం టికెట్ ద్వారా సొమ్ము వసూలు చేస్తూ, అనుమతి లేని ఈవెంట్‌ను అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం ఏం చేస్తోంది? ఇది ముమ్మాటికీ ప్రభుత్వ పాలనా వైఫల్యమే!
నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేయాలి
దాదాపు రూ.50 లక్షల మేర ఫీజులు చెల్లించి తమ పిల్లలను ఇంజినీరింగ్ చదివిస్తున్న నిరుపేద కుటుంబానికి తీరని అన్యాయం జరిగింది. ఇది అనుకోకుండా జరిగిన ప్రమాదం కాదు. ప్రమాణాలను గాలికొదిలేసి నిర్వాహకులు చేసిన "నేరపూరిత నిర్లక్ష్యం. కళాశాల కరస్పాండెంట్, ప్రిన్సిపాల్, ఈవెంట్ నిర్వాహకులపై బీఎన్ఎస్ (BNS/IPC) సంబంధిత కఠిన సెక్షన్ల కింద నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలి.
ప్రభుత్వ నిమ్మకు నీరెత్తిన వైఖరి నశించాలి! ప్రజాపాలన అంటే పేదల ప్రాణాలు గాల్లో కలవడమేనా? ప్రభుత్వమా.. నిద్ర వీడు! కార్పొరేట్ విద్యాసంస్థలు వేలాది మందితో ఈవెంట్లు నడుపుతూ వినోద వ్యాపారం చేస్తుంటే... అనుమతులు లేకున్నా స్థానిక పోలీసులు, విద్యాశాఖ నిఘా ఏమైంది? ప్రభుత్వం కార్పొరేట్ పెద్దలకు కొమ్ము కాస్తోందా?
హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
ఈ ఘటనపై ఉన్నత స్థాయి ఐఏఎస్/ఐపీఎస్ అధికారితో నిష్పాక్షిక విచారణ జరిపించాలి. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. మృతి చెందిన విద్యార్థిని కుటుంబానికి కళాశాల నిధుల నుంచి రూ. కోటి పరిహారం, ప్రభుత్వం తరఫున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి. తీవ్రంగా గాయపడిన విద్యార్థినికి కార్పొరేట్ ఆసుపత్రిలో ప్రభుత్వ ఖర్చుతో మెరుగైన వైద్యం అందించాలి.
భద్రతా నిబంధనలు పాటించని కళాశాల గుర్తింపును తాత్కాలికంగా రద్దు చేయడం లేదా భారీ పెనాల్టీ విధించడం చేయాలి. రాష్ట్రంలోని విద్యను వ్యాపార వినోదంగా మారుస్తున్న అన్ని విద్యాసంస్థల్లో ఇలాంటి కార్యక్రమాలకు స్పష్టమైన ‘స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్’ (SOP) జారీ చేయాలి. ప్రభుత్వం ఇప్పటికైనా కార్పొరేట్ యాజమాన్యాల మోచేతి నీళ్లు తాగడం ఆపి, బాధితులకు న్యాయం చేయాలి అని దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Bhatti Vikramarka | రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి రూ. 2,500 కోట్లు : భట్టి విక్రమార్క
అక్టోబర్ 18, 2026

BRS Party | ‘కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు మళ్లిన కొండపోచమ్మ’.. ‘వెలుగు’ యాజమాన్యానికి బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
అక్టోబర్ 18, 2026

Jalamandali | తాగునీటి దుర్వినియోగం.. ఫోర్ ఫాదర్స్ పబ్‌కు రూ. 20 వేల జరిమానా
అక్టోబర్ 18, 2026
తాజావార్తలు
- ●Lok Bhavan | తెలంగాణ లోక్ భవన్లో ఆయుధ పూజ
- ●Navratri Special | ఆయుధ పూజ నుంచి ఆత్మనిగ్రహం వరకు.. దసరా చెప్పే జీవన పాఠాలు!
- ●Bhatti Vikramarka | రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి రూ. 2,500 కోట్లు : భట్టి విక్రమార్క
- ●Jagadish reddy | కన్నెపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోసి ఉంటే.. ఈరోజు తెలంగాణలో కరువు ఉండేది కాదు
- ●Traffic Jam | ఊర్లకు బారులు తీరిన వాహనాలు.. టోల్ ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్
- ●Airtel | డేటా అవసరం లేదా? కాల్స్ కోసమే రీఛార్జ్.. ఎయిర్టెల్ మూడు అదిరిపోయే ప్లాన్లు!

Lok Bhavan | తెలంగాణ లోక్ భవన్లో ఆయుధ పూజ

Navratri Special | ఆయుధ పూజ నుంచి ఆత్మనిగ్రహం వరకు.. దసరా చెప్పే జీవన పాఠాలు!

Bhatti Vikramarka | రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి రూ. 2,500 కోట్లు : భట్టి విక్రమార్క

Jagadish reddy | కన్నెపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోసి ఉంటే.. ఈరోజు తెలంగాణలో కరువు ఉండేది కాదు



