Rajashekar Reddy | ఈర్ష్యారావు అండతో పండ్ల మార్కెట్‌కు అడ్డుపడుతున్నరు: జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ రాజశేఖర్‌రెడ్డి
Koheda Froot Market | ఈర్ష్యారావు అండతో సబితా ఇంద్రారెడ్డి, సుధీరెడ్డి కలిసి కోహెడ పండ్ల మార్కెట్ (Koheda Froot Market)కు అడ్డు పడుతున్నారని జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్‌రెడ్డి (Darpally Rajashekar Reddy) ఆరోపించారు. అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ నిర్మాణానికి పూనుకుంటే ఇలా ఆటంకాలు సృష్టించడం సమంజసమా అని ప్రశ్నించారు.
త్రినేత్ర.న్యూస్: ఈర్ష్యారావు అండతో సబితా ఇంద్రారెడ్డి, సుధీరెడ్డి కలిసి కోహెడ పండ్ల మార్కెట్ (Koheda Froot Market)కు అడ్డు పడుతున్నారని జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్‌రెడ్డి (Darpally Rajashekar Reddy) ఆరోపించారు. అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ నిర్మాణానికి పూనుకుంటే ఇలా ఆటంకాలు సృష్టించడం సమంజసమా అని ప్రశ్నించారు. మంగళవారం గాంధీభవన్(Gandhi Bhavan) లో నిర్వహించిన మీడియా సమావేశం(Press meet)లో ఆయన మాట్లాడారు. పండ్ల మార్కెట్ ఎక్కడికో వెళ్లిపోతుంది, ఏదో చేస్తున్నరనే అద్భుతమైన అబద్దాన్ని నిజం చేసేందుకు వస్తున్నారని మండిపడ్డారు.
హరీశ్‌రావు చెప్పాలే..
హరీశ్‌రావు, సబితా, సుధీర్‌రెడ్డి, కిషన్‌రెడ్డి నిన్న కోహెడకు వచ్చారు. ప్రతిపక్షంగా ఒక బాధ్యత తీసుకొని ముందుకు వచ్చినందుకు అభినందిస్తున్నం. నేను ఆ మార్కెట్ చైర్మన్‌గా 2010 నుంచి 2014 వరకు పని చేసిన. అధికారులు, సర్వేయర్లతో కలిసి ఆ భూమి అంతా నేనే సర్వే చేయించిన. 170 ఎకరాల లావణి పట్టాలుండే. బ్యాంక్ ఆఫ్ బరోడాలో మార్కెట్ కమిటీకి సంబంధించిన రూ. 8 కోట్లు డిపాజిట్ ఉండే. రికరింగ్ డిపాజిట్ పెట్టి నాలుగు సంవత్సరాలల్ల దాన్నిరూ.11కోట్లకు పెంచిన. ఉన్న లావాణి పట్టాలకు ఎకరం చొప్పున రూ.8 లక్షలు కట్టిన మాట వాస్తవమో కాదో హరీశ్‌రావు చెప్పాలే అని రాజశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు.
సింగారం లేని మార్కెట్ అది..
బాట సింగారం దగ్గర సింగారం లేని ఒక ఆర్టీఫిషియల్ మార్కెట్‌ను సృష్టించిర్రు. గాలికి రేకులు కొట్టుకుపోతయ్ అని నేను ముందే చెప్పిన. అన్నట్టే జరిగి చాలా మంది గాయపడ్డరు. మీరు పది సంవత్సరాలు ఉన్నరు. ఈరోజు అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు కాలే.. అప్పుడే మమ్మల్ని ప్రశ్నిస్తున్నరు. భూమిని ఎవరికన్నా ధారాదత్తం చేసినమా? అక్కడే ఉంది కదా భూమి. రూ.2000 కోట్లతో అంతర్జాతీయ స్థాయి మార్కెట్ నిర్మాణం చేద్దామని అనుకుంటే దాన్ని మీరు తప్పు పట్టడం సమంజసమా అని అడుగుతున్న. అంతర్జాతీయ కంపెనీలు వస్తయి. అది రైతులకే లాభం. ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి అయితది అని రాజశేఖర్‌రెడ్డి వివరించారు.
సుధీర్‌రెడ్డివి పచ్చి అబద్దాలు..
2021లో మార్కెటింగ్ శాఖ జీవో నం.397 ఇచ్చారు. వాళ్లిచ్చిన జీవోనే కదా.. ఎందుకు అమలు కాలేదు. కోల్డ్ స్టోరేజ్ సెంటర్‌లు పెడుతుంటే ఇంత ఈర్ష్య ఎందుకు? రైతులు బాగు పడొద్దా.. దళారులే బాగు పడాలా.. మీరు ఏర్పాటు చేసిన మార్కెట్‌లో కల్పించిన సదుపాయాలేందో చెప్పండి. కేసీఆర్ మార్కెట్ కోసం ఆలోచన చేశారని సుధీర్‌రెడ్డి అనడం దారుణం. అది పచ్చి అబద్ధం. ప్రభుత్వానికి మంచి పేరు రావొద్దని ఎప్పుడు ఏదో ఒకటి ముంగటేసుకుని వస్తున్నరు హరీశ్‌రావు ఐదేండ్లు మార్కెటింగ్ శాఖ మంత్రిగా పని చేసిండు. టీఆర్ఎస్‌ల పెద్ద పాత్ర పోషించినవ్. మరి 170 ఎకరాలల్ల మార్కెట్ ఎందుకు నిర్మించలేదో చెప్పండి. కొవిడ్ సమయంలో అక్కడున్న రైతులను అన్యాయంగా వెళ్లగొట్టారు అని ఫైరయ్యాయి.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




