Dandiya Event | దాండియా వేడుకలో కూలిన లైటింగ్ సిస్టమ్.. విద్యార్థిని మృతి
Dandiya Event | దసరా పండుగ వేళ విద్యార్థులంతా ఉత్సాహంగా దాండియా నృత్యం (Dandiya Celebration) చేస్తుండగా జరిగిన ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. హైదరాబాద్లోని నాదర్గుల్లో ఉన్న ఎంవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో (MVSR Engineering College) దాండియా ఈవెంట్ (Dandiya Event) నిర్వహించారు.
Dandiya Event | త్రినేత్ర న్యూస్: దసరా పండుగ వేళ విద్యార్థులంతా ఉత్సాహంగా దాండియా నృత్యం (Dandiya Celebration) చేస్తుండగా జరిగిన ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. హైదరాబాద్లోని నాదర్గుల్లో ఉన్న ఎంవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో (MVSR Engineering College) దాండియా ఈవెంట్ (Dandiya Event) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులంతా కలిసి దాండియా నృత్యం చేస్తుండగా లైటింగ్ సిస్టమ్ (Lighting System) ఒక్కసారిగా కుప్పకూలాయి. దీంతో మంటలు చెలరేగడంతో ఓ విద్యార్థిని మృతి చెందింది. పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
మృతిచెందిన విద్యార్థినిని వనపర్తి జిల్లాకు చెందిన సోనీగా గుర్తించారు. ప్రమాదంలో ఆమె సోదరి కూడా తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది. కళాశాల సమీపంలో గాలివాన రావడంతో లైటింగ్ సిస్టమ్ ఒక్కసారిగా కింద పడిపోవటంతో (Collapses) ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ దుర్ఘటనలో సుమారు 25 మంది విద్యార్థులు గాయపడగా అక్కడే ఉన్న మిగిలిన విద్యార్థులు, సిబ్బంది హుటాహుటిన వారిని సమీపంలోని ప్రైవేటు హాస్పిటల్కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి
ఇంజినీరింగ్ కళాశాలలో లైటింగ్ సిస్టమ్ కూలిపడి విద్యార్థిని మృతి చెందిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్యాన్ని అందించాలని అధికారులకు సూచించారు. ప్రమాదానికి బాధ్యులైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశింశారు.
విద్యార్థిని మృతిపై కేటీఆర్ ఆవేదన
విద్యార్థిని మృతి చెందడం తీవ్ర ఆవేదనకి గురిచేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఈ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థిని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో గాయపడిన విద్యార్థులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందేలా చూడాలని కోరారు. బాధిత కుటుంబాలకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.
Lighting collapse kills one at MVSR Dandiya event
A Dandiya celebration at MVSR Engineering College in Nadargul ended in tragedy when a lighting system fell onto the crowd during the event. One person died on spot. Several students were reportedly hurt, and college staff rushed them to hospitals for urgent care. The cause of the collapse is still unknown. More details are awaited.
Telangana Chief Minister Revanth Reddy said he was shocked by the death of a student, offered condolences to the family, and ordered better medical care for the injured. He also directed officials to find out who was responsible and to take strict action.
#MVSRcollegeaccidnets #Hyderabadnews #Nadargulnews #Hyderabaddandiyaevent
— Hyderabad Mail (@Hyderabad_Mail) October 17, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Saddula Bathukamma | సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ: సీఎం రేవంత్రెడ్డి
అక్టోబర్ 17, 2026

Dudimetla Balaraju Yadav | కేసీఆర్ ఫ్యామిలీపై అబద్ధాలు చెప్పే ఆ ఆరుగురు ఎవరంటే..
అక్టోబర్ 17, 2026

MLA Anirudh Reddy | కోమటిరెడ్డి కోసం ప్రాణాలిస్తా.. నీళ్లను తరలిస్తే ఆయనతోనే యుద్ధం చేస్తా
అక్టోబర్ 17, 2026
తాజావార్తలు
- ●Horoscope | అక్టోబర్ 18 రాశిఫలాలు.. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం!
- ●US Shooting | అమెరికాలో నలుగురి ప్రాణాలు తీసిన దుండగుడు..
- ●Navaratri Brahmotsavams | తిరుమలలో గజవాహనంపై మలయప్పస్వామి దివ్యదర్శనం
- ●FSSAI | నెస్లే, హిందుస్థాన్ యూనిలీవర్కు FSSAI నోటీసులు!
- ●Ajay Devgn | అజయ్ దేవ్గణ్ నివాసంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత - క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్...
- ●ACB Raids | కీసర ఇన్స్పెక్టర్పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.. రూ.2.28 కోట్ల ఆస్తులు గుర్తింపు..

Horoscope | అక్టోబర్ 18 రాశిఫలాలు.. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం!

US Shooting | అమెరికాలో నలుగురి ప్రాణాలు తీసిన దుండగుడు..

Navaratri Brahmotsavams | తిరుమలలో గజవాహనంపై మలయప్పస్వామి దివ్యదర్శనం

FSSAI | నెస్లే, హిందుస్థాన్ యూనిలీవర్కు FSSAI నోటీసులు!



