త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Trisha | సూర్య‌, త్రిష మ‌ధ్య విభేదాలు? – చెన్నై క్వీన్‌ను అవ‌మానించారంటూ ఫ్యాన్స్ ఫైర్‌

సూర్య‌, త్రిష హీరోహీరోయిన్లుగా న‌టించిన క‌రుప్పు మూవీ ఇటీవ‌లే థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. మూడు రోజుల్లోనే వంద కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌తో బ్లాక్‌బ‌స్ట‌ర్ దిశ‌గా సాగుతోంది. కాగా క‌రుప్పు స‌క్సెస్‌ కంటే సూర్య‌, త్రిష మ‌ధ్య కోల్డ్ వార్ అభిమానుల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. క‌రుప్పుకు వ‌స్తోన్న రెస్పాన్స్‌ను ఉద్దేశించి సోష‌ల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టిన సూర్య‌...త్రిష పేరును మాత్రం అవైడ్ చేయ‌డం వివాదానికి దారితీసింది.

N

News | Published On May 18, 2026, 3.20 pm IST

Trisha | సూర్య‌, త్రిష మ‌ధ్య విభేదాలు? – చెన్నై క్వీన్‌ను అవ‌మానించారంటూ ఫ్యాన్స్ ఫైర్‌
Advertisement

Trisha |  కోలీవుడ్ హీరో సూర్య‌, చెన్నై క్వీన్ త్రిష మ‌ధ్య కోల్డ్ వార్ త‌మిళ సినీ ప‌రిశ్ర‌మ‌లో హాట్ టాపిక్‌గా మారింది. వీరిద్ద‌రి మ‌ధ్య విభేదాల‌కు కార‌ణ‌మేమిట‌న్న‌ది అభిమానుల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. సూర్య‌, త్రిష హీరోహీరోయిన్లుగా న‌టించిన క‌రుప్పు మూవీ ఇటీవ‌లే రిలీజైంది. ఎన్నో అడ్డంకులు, అవాంత‌రాల‌ను దాటుకొని థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన క‌రుప్పు మూడు రోజుల్లోనే వంద కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. బ్లాక్‌బ‌స్ట‌ర్ దిశ‌గా దూసుకుపోతుంది. మే 14నే ఈ సినిమా రిలీజ్ కావాల్సింది. మ‌రికొన్ని గంట‌ల్లో ప్రీమియ‌ర్స్ మొద‌ల‌వుతాయ‌న‌గా ఫైనాన్షియ‌ల్ ఇష్యూస్ కార‌ణంగా త‌మిళ‌నాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో షోస్ క్యాన్సిల్ చేశారు. ఓ రోజు ఆల‌స్యంగా మే 15న ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.

త్రిష దూరం...

కాగా సినిమా యూనిట్‌తో ఏర్ప‌డిన విభేదాలు, మ‌న‌స్ప‌ర్థ‌ల కార‌ణంగా క‌రుప్పు ప్ర‌మోష‌న్స్‌కు త్రిష దూర‌మైంది. ఆడియో లాంఛ్ వేడుక‌లో క‌నిపించ‌లేదు. తాను సినిమాలో న‌టించిన విష‌యం మేక‌ర్స్ మ‌ర్చిపోయిన‌ట్లు ఉన్నారంటూ త్రిష వారిపై సెటైర్ వేసింది. ఈ ఆడియో లాంఛ్ ఈవెంట్‌లో త్రిష పేరును సూర్య తో పాటు మిగిలిన యూనిట్ మెంబ‌ర్స్‌ ఎక్క‌డ ప్ర‌స్తావించ‌క‌పోవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. సినిమాతో పాటు ప్ర‌మోష‌న్స్‌లో సూర్య‌కు ఎక్కువ‌గా ఇంపార్టెన్స్ ఇచ్చి త‌న‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డంతో త్రిష హ‌ర్ట్ అయిన‌ట్లు వార్త‌లొచ్చాయి. రిలీజ్ రోజు కూడా డైరెక్ట‌ర్ ఆర్‌జే బాలాజీతో క‌లిసి త్రిష ఈ సినిమా చూసింది. సూర్య క‌నిపించ‌లేదు.

సూర్య పోస్ట్‌....

క‌రుప్పు బ్లాక్‌బ‌స్ట‌ర్ సంద‌ర్భంగా సోష‌ల్ మీడియాలో సూర్య ఓ పోస్ట్ పెట్టారు. క‌రుప్పుతో త‌న‌కు బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ ఇస్తాన‌ని ఆర్‌జే బాలాజీ ప్రామిస్ చేశాడ‌ని, ఆ మాట‌ను నిల‌బెట్టుకున్నాడంటూ సూర్య పేర్కొన్నాడు. డైరెక్ట‌ర్‌తో పాటు నిర్మాత‌లు, మ్యూజిక్ డైరెక్ట‌ర్‌, కెమెరామెన్‌తో పాటు ప్ర‌తి ఒక్క‌రి పేరును ప్ర‌స్తావించ‌డ‌మే కాకుండా వారు సినిమా కోసం ఎంతో క‌ష్ట‌ప‌డ్డారంటూ సూర్య గుర్తుచేశాడు. అంద‌రికి కృత‌జ్ఞ‌త‌లు చెప్పాడు. హీరోయిన్‌గా న‌టించిన త్రిష పేరును మాత్రం సూర్య ట్వీట్‌లో క‌నిపించ‌లేదు. కావాల‌నే త్రిష పేరును సూర్య అవైడ్ చేశాడంటూ చెన్నై క్వీన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతోన్నారు. అప్పుడు ఆడియో లాంఛ్‌కు దూరం పెట్టారు...ఇప్పుడు ట్వీట్‌లో ఆమె పేరును చెప్ప‌కుండా త్రిష‌ను సూర్య అవ‌మానించాడంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. త్రిష‌పై ద్వేషంతోనే ఇదంతా చేస్తున్నాడ‌ని అంటున్నారు. త్రిష ఫ్యాన్స్ ట్వీట్స్ వైర‌ల్ అవుతోన్నాయి.

 

Advertisement
Advertisement