Sundeep Kishan | నితిన్‌తో అనుకొని సందీప్‌కిషన్‌తో అనౌన్స్ – పవర్ పేట పోస్టర్ రిలీజ్
సందీప్ కిషన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ రాబోతుంది. ఈ సినిమాకు పవర్ పేట అనే టైటిల్ ఖరారు చేశారు. ఓ ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. నితిన్ చేయాల్సిన సినిమాను సందీప్ కిషన్‌తో అనౌన్స్ చేయడం టాలీవుడ్‌లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Sundeep Kishan | నితిన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ సినిమా రావాల్సింది. స్క్రిప్ట్ కూడా లాకయ్యింది. ఈ సినిమాకు పవర్ పేట అనే టైటిల్‌ను అనుకుంటున్నట్లు నితిన్ కూడా చెప్పాడు. ఇందులో ట్రిపుల్ రోల్‌లో కనిపించబోతున్నట్లు ప్రకటించాడు. అనివార్య కారణాల వల్ల అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాకముందే ఈ సినిమా ఆగిపోయింది.
సందీప్ కిషన్...
తాజాగా పవర్ పేట మూవీని గురువారం అఫీషియల్‌గా అనౌన్స్‌చేశారు. అయితే నితిన్ కాకుండా సందీప్ కిషన్ ఈ సినిమాలో హీరోగా నటించనున్నట్లు ప్రకటించారు. ఓ ప్రీ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. రక్తతంతో తడిసిన ఓ చెస్ బోర్డ్, గులాబీ పువ్వు కనిపిస్తున్నాయి. ప్రేమ, గౌరవం, రాజకీయం టైటిల్‌కు జోడించిన క్యాప్షన్ ఆసక్తిని పంచుతోంది. పొలిటికల్ థ్రిల్లర్‌గా పవర్ పేట తెరకెక్కబోతున్నట్లు సమాచారం. ఇందులో డిఫరెంట్ ఏజ్‌తో కూడిన క్యారెక్టర్స్‌లో సందీప్ కిషన్ కనిపించబోతున్నాడట. అతడి కెరీర్‌లోనే మోస్ట్ ఇంటెన్స్ క్యారెక్టర్‌ను ఈ సినిమాలో చేయబోతున్నట్లు మేకర్స్ చెబుతోన్నారు.
మణిశర్మ మ్యూజిక్...
పవర్ పేట మూవీకి మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నాడు. 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశిదేవి రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్వరలోనే పవర్ పేటకు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ వెల్లడిస్తామని మేకర్స్ పేర్కొన్నారు.
సిగ్మా రిలీజ్...
ప్రస్తుతం సందీప్ కిషన్ హీరోగా నటించిన సిగ్మా మూవీ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఫరియా అబ్దుల్లా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. సూపర్ సుబ్బు పేరుతో ఓ కామెడీ వెబ్‌సిరీస్ చేశాడు. త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుంది.
లిరిసిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించిన కృష్ణ చైతన్య...రౌడీ ఫెల్లో మూవీతో డైరెక్టర్‌గా మారాడు. ఛల్ మోహన రంగతో పాటు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలను తెరకెక్కించాడు.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



