త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Indigo | విమాన‌యాన సంక్షోభం వెనుక‌…

నాలుగు రోజులుగా దేశంలో విమాన‌యాన (Indigo) సంక్షోభం ద‌రిమిలా అస‌లు ఈ స‌మ‌స్య ఎందుకు వ‌చ్చిందో ఒక‌సారి ప‌రిశీలిద్దాం...

A

News | Published On Dec 6, 2025, 4.02 pm IST

Indigo | విమాన‌యాన సంక్షోభం వెనుక‌…
Advertisement

నాలుగు రోజులుగా దేశంలో విమాన‌యాన (Indigo) సంక్షోభం ద‌రిమిలా అస‌లు ఈ స‌మ‌స్య ఎందుకు వ‌చ్చిందో ఒక‌సారి ప‌రిశీలిద్దాం...

పౌర విమానాల కోసం గ‌తేడాది జ‌న‌వ‌రిలో డైరెక్ట‌రేట్‌ జ‌న‌ర‌ల్ ఆఫ్ సివిల్ ఏవియేష‌న్ (డీజీసీఏ) (DGCA) నూత‌న నిబంధ‌న‌ల‌ను ప్ర‌వేశ‌పెట్టింది. ప్ర‌యాణీకుల భ‌ద్ర‌త‌ను పెంచే ఉద్దేశంతో ఈ మార్పులు చేప‌ట్టిన‌ట్లు పేర్కొంది. పైలట్లు, ఇత‌ర సిబ్బందికి త‌గినంత విశ్రాంతిని త‌ప్ప‌నిస‌రి చేస్తూ ఈ నిబంధ‌న‌ల‌కు తీసుకువ‌చ్చింది. ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేష‌న్స్ (ఎఫ్‌డీటీఎల్‌) (FDTL) పేరుతో ఉన్న ఈ నూత‌న నియ‌మావ‌ళి ప్ర‌కారం పైల‌ట్ల‌కు వారానికి 48 గంట‌ల విశ్రాంతి త‌ప్ప‌నిస‌రి. ఇది అంత‌కుముందు 36 గంట‌లుగా ఉండేది. దీనితో పాటు ఒక రోజు సెల‌వు ఉంటుంది. అంటే వారంలో మొత్త‌మ్మీద మూడు రోజులు సెల‌వు ఉంటుంది. నూత‌న నిబంధ‌న‌ల మేర‌కు పైల‌ట్ (Pilot) కు వారంలో రెండు నైట్ టైమ్ ల్యాండింగ్ (Nighttime Landing) కు మాత్ర‌మే అనుమ‌తి ఉంటుంది. ఇది గ‌తంలో ఆరు నైట్ టైమ్ ల్యాండింగ్‌కు అనుమ‌తి ఉండేది. ఈ నిబంధ‌న‌ల్లో రెండ‌వ ద‌శ గ‌త నెల 1వ తేదీ నుంచి అమ‌ల్లోకి వ‌చ్చింది. ఈ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా పైల‌ట్ల డ్యూటీలు షెడ్యూల్ చేయ‌డంలో, మ‌రింత మంది పైల‌ట్లు, సిబ్బందిని నియ‌మించుకోవ‌డంలో ఇండిగో విఫ‌ల‌మైంది. దీంతోపాటు శీతాకాలం (Winter), క్రిస్మ‌స్ (Christmas) నేప‌థ్యంలో విమాన స‌ర్వీసుల‌ను ఆరు శాతం పెంచింది. దీంతో ప‌రిస్థితి మ‌రింత జ‌ఠిల‌మైంది.

ఏటా ఇండిగోకు 12 కోట్ల ప్ర‌యాణీకులు

2005లో స్థాపించిన ఇండిగో ఎయిర్‌లైన్స్ (Indigo Airlines) త‌న స‌ర్వీసుల‌ను 2006లో ప్రారంభించింది. 434 విమానాల‌తో రోజుకు 2300 స‌ర్వీసుల‌ను న‌డుపుతుంది. ఈ స‌ర్వీసుల్లో దేశీయ విమాన స‌ర్వీసుల వాటా దాదాపు 64 శాతం. ఈ విమానాల్లో ఏటా దాదాపు 12 కోట్ల మంది త‌మ ప్ర‌యాణాలు చేస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement