Sri Gouri Priya | సింగర్ కాబోయి యాక్టర్ అయ్యిందట – స్టేజ్‌పైనే కన్నీళ్లు పెట్టుకున్న టాలీవుడ్ హీరోయిన్
అచ్చ తెలుగు బ్యూటీ శ్రీ గౌరిప్రియ హీరోయిన్‌గా నటిస్తోన్న చెన్నై లవ్‌స్టోరీ త్వరలో థియేటర్లలోకి రాబోతుంది. కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తోన్న ఈ మూవీ నుంచి వదలనే అనే సాంగ్‌ను ఆస్కార్ విన్నర్ కీరవాణి సోమవారం రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లాంఛ్ వేడుకలో శ్రీ గౌరిప్రియ ఎమోషనల్ అయ్యింది. కన్నీళ్లు పెట్టుకుంది.
Sri Gouri Priya | మ్యాడ్ మూవీతో హీరోయిన్‌గా తొలి విజయాన్ని అందుకుంది అచ్చ తెలుగు బ్యూటీ శ్రీ గౌరిప్రియ. ఈ సినిమాలో శృతి అనే ఆధునిక భావాలున్న అమ్మాయిగా కనిపించి మెప్పించింది. మ్యాడ్ కంటే ముందు మెయిల్, లవ్‌స్టోరీలో డిఫరెంట్ రోల్స్‌లో నాచురల్ యాక్టింగ్‌ను కనబరిచింది. మ్యాడ్ తర్వాత తెలుగులో చెన్నై లవ్‌స్టోరీ సినిమా చేస్తోంది. కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తోన్న ఈ మూవీకి రవి నంబూరి దర్శకత్వం వహించారు. బేబీ డైరెక్టర్ సాయిరాజేష్ కథను అందిస్తూ ఎస్‌కేఎన్‌తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తోన్నారు.చెన్నై లవ్‌స్టోరీ నుంచి వదలనే అనే సాంగ్‌ను సోమవారం ఆస్కార్ విన్నర్ కీరవాణి రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లాంఛ్ ఈవెంట్‌లో తన కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితాన్ని గురించి మాట్లాడుతూ శ్రీ గౌరిప్రియ ఎమోషనల్ అయ్యింది.
మణిశర్మ స్ఫూర్తి...
"నేను సింగర్ కావాలని అనుకున్నాను. చాలా కాంపిటేషన్స్‌కు వెళ్లాను. ఎక్కడికి వెళ్లినా మణిశర్మ పాటలు పాడేదానిని. నేను సింగర్ కావాలని అనుకోవడానికి ఒక రకంగా మణిశర్మనే స్ఫూర్తి. ఇప్పుడు ఆయన మ్యూజిక్ అందిస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటించడం గౌరవంగా భావిస్తున్నా" అని చెప్పింది.
అమ్మకు అంకితం...
వదలనే అనే సాంగ్‌ను తన తల్లికి అంకితమిస్తున్నట్లు ఈ వేడుకలో శ్రీగౌరిప్రియ చెప్పింది. చనిపోయిన తన తల్లిని గుర్తుచేసుకొని కన్నీళ్లు పెట్టుకుంది. "మా అమ్మ నాకు దూరమై మూడేళ్లు అయ్యింది. అయినా తను నన్ను అస్సలు వదిలిపెట్టిపోవడం లేదు. నేను తనను ఎప్పటికీ వదలను" అంటూ చెప్పింది. శ్రీగౌరిప్రియ తల్లి వసుంధర మూడేళ్ల క్రితం క్యాన్సర్‌తో చనిపోయింది.తెలుగులోనే కాకుండా తమిళంలోనూ శ్రీ గౌరిప్రియ బిజీగా ఉంది. ట్రూ లవర్, హ్యాపీరాజ్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Kiran Abbavaram | వదలనే అంటోన్న కిరణ్ అబ్బవరం – అచ్చ తెలుగు బ్యూటీతో లవ్ సాంగ్
మే 23, 2026

Telugu OTT | ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం క్రైమ్ కామెడీ మూవీ – టీవీ దొంగతనంలో ట్విస్ట్‌లు
మే 7, 2026

Sri Gouri Priya | యాంకర్ నుంచి హీరోయిన్‌గా … కోలీవుడ్‌లో రాణిస్తున్న టాలీవుడ్ బ్యూటీ
ఏప్రిల్ 30, 2026
తాజావార్తలు
- ●Nitesh Rane Bakrid Remark | 'మటన్‌కు బదులు కాగితం తిని చూడు'.. వర్చువల్ బక్రీద్ వ్యాఖ్యలపై బీజేపీ మంత్రి నితేశ్ రాణేకు సొంత పార్టీ నేత షాక్
- ●Web Series | టైటాన్ వాచ్ చరిత్రపై వెబ్‌సిరీస్ - లీడ్ రోల్లో కుబేర విలన్ - ఎందులో స్ట్రీమింగ్ అంటే?
- ●Maheshkumar Goud | బాగా పని చేయండి.. బూత్ స్థాయి నుంచే పార్టీని బలోపేతం చేద్దాం: మహేశ్‌కుమార్‌గౌడ్
- ●Siddaramaiah vs DK Shivakumar | కర్ణాటక కాంగ్రెస్‌లో 'గేమ్ ఆఫ్ థ్రోన్స్'.. కొత్త సీఎంగా డీకే శివకుమార్? హైకమాండ్ ప్లాన్ ఇదే
- ●Tripti Dimri | ప్రభాస్ స్పిరిట్ సెట్స్‌లో త్రిప్తి డిమ్రి.. వానిటీ వ్యాన్ ఫొటోలు పంచుకున్న హాట్ బ్యూటీ
- ●Koppula Eshwar | సింగరేణి కాంగ్రెస్‌కు ఏటీఎంలా అయిపోయింది: కొప్పుల ఈశ్వర్

Nitesh Rane Bakrid Remark | 'మటన్‌కు బదులు కాగితం తిని చూడు'.. వర్చువల్ బక్రీద్ వ్యాఖ్యలపై బీజేపీ మంత్రి నితేశ్ రాణేకు సొంత పార్టీ నేత షాక్

Web Series | టైటాన్ వాచ్ చరిత్రపై వెబ్‌సిరీస్ - లీడ్ రోల్లో కుబేర విలన్ - ఎందులో స్ట్రీమింగ్ అంటే?

Maheshkumar Goud | బాగా పని చేయండి.. బూత్ స్థాయి నుంచే పార్టీని బలోపేతం చేద్దాం: మహేశ్‌కుమార్‌గౌడ్

Siddaramaiah vs DK Shivakumar | కర్ణాటక కాంగ్రెస్‌లో 'గేమ్ ఆఫ్ థ్రోన్స్'.. కొత్త సీఎంగా డీకే శివకుమార్? హైకమాండ్ ప్లాన్ ఇదే



