త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sukumar | సుకుమార్ బ్యాన‌ర్‌లో కిర‌ణ్ అబ్బ‌వ‌రం రికార్డ్ – వెరైటీ జాన‌ర్‌లో…

టాలీవుడ్ అగ్ర ద‌ర్శ‌కుడు సుకుమార్, యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం కాంబినేష‌న్‌లో ఓ సినిమా రాబోతుంది. సోమ‌వారం అఫీషియ‌ల్‌లా లాంఛ్ అయిన ఈ సినిమాకు రికార్డ్ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. వీరు కోగ‌టం డైరెక్ట‌ర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న ఈ సినిమాకు సుకుమార్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

N

Entertainment | Published On Nov 23, 2026, 3.00 pm IST

Sukumar | సుకుమార్ బ్యాన‌ర్‌లో కిర‌ణ్ అబ్బ‌వ‌రం రికార్డ్ – వెరైటీ జాన‌ర్‌లో…
Advertisement

Sukumar | టాలీవుడ్ యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం వ‌రుస‌గా సినిమాల‌ను ప‌ట్టాలెక్కిస్తున్నాడు. తాజాగా అగ్ర ద‌ర్శ‌కుడు సుకుమార్ బ్యాన‌ర్‌లో కిర‌ణ్ అబ్బ‌వ‌రం ఓ సినిమా చేయ‌బోతున్నాడు. సోమ‌వారం పూజా కార్య‌క్ర‌మాలో ఈ కొత్త సినిమా అఫీషియ‌ల్‌గా ప్రారంభ‌మైంది. కిర‌ణ్ అబ్బ‌వ‌రం హీరోగా న‌టిస్తోన్న 14వ సినిమా ఇది. ఈ మూవీకి రికార్డ్ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. పుష్ప‌, పుష్ప 2 సినిమాల‌కు సుకుమార్ వ‌ద్ద స‌హాయ ర‌చ‌యిత‌గా ప‌నిచేసిన వీర కోగ‌టం ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు.

దిల్‌రాజు క్లాప్‌తో...

రికార్డ్ మూవీ పూజా కార్య‌క్ర‌మాల్లో సుకుమార్‌తో పాటు నిర్మాత‌లు దిల్‌రాజు, బీన్నీవాసు, సునీల్ నారంగ్ త‌దిత‌రులు పాల్గొన్నారు. ముహూర్త‌పు స‌న్నివేశానికి దిల్‌రాజు క్లాప్ నివ్వ‌గా...సుకుమార్ కెమెరా స్విఛాన్ చేశారు. రికార్డ్ మూవీ టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. కెమెరాకు సంబంధించిన సాంకేతిక పదాలతో రూపొందించిన ఈ పోస్టర్ ఆసక్తిని పంచుతోంది. ఎర్రటి పౌర్ణమి చంద్రుడితో పాటు గాడిద, పొడ‌వైన గ‌డ్డిపోచ‌ల‌తో వెరైటీగా పోస్ట‌ర్‌ను డిజైన్ చేశారు. వాటితో పాటు కిర‌ణ్ అబ్బ‌వ‌రం ముఖం సీరియ‌స్ లుక్‌లో క‌నిపించ‌డం క్యూరియాసిటీని క‌లిగిస్తోంది. విభిన్న‌మైన‌ జాన‌ర్‌లో ఈ సినిమా రూపొంద‌నున్న‌ట్లు టైటిల్ పోస్ట‌ర్‌తోనే మేక‌ర్స్ క్లారిటీ ఇచ్చారు.

అంద‌రికి న‌చ్చుతుంది...

ఈ సందర్భంగా హీరో కిరణ్‌ అబ్బవరం మాట్లాడుతూ టైటిల్‌తో పాటు సినిమా కూడా అందరికి నచ్చుతుంది. 18 సంవత్సరాలు మీడియాలో పనిచేసిన వీర ఈ సినిమాతో దర్శకుడు అవుతున్నాడు. ఈ కథతో పాటు అత‌డి తపన బాగా నచ్చింది. అంద‌రూ గర్వపడే సినిమా అవుతుంది' అన్నారు. కిరణ్‌ అబ్బవరంతో చేస్తున్న ఈ 'రికార్డ్‌' సినిమా ఇండస్ట్రీలోని రికార్ట్‌లన్నీ బద్దలు కొట్టాలని కోరుకుంటున్నామ‌ని నిర్మాత‌లు చెప్పారు.

జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్‌...

రికార్డ్ సినిమాకు మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, జస్టిన్ ప్రభాకరన్ సంగీతం సమకూరుస్తున్నారు. వంశీ నందిపాటి, అశోక్ బండ్రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్, సుకుమార్ రైటింగ్స్, ది స్టోరీస్ బ్యానర్లపై ఈ చిత్రం రూపొందుతోంది. త్వ‌ర‌లోనే న‌టీన‌టుల‌తో పాటు షూటింగ్ వివ‌రాల‌ను వెల్ల‌డిస్తామ‌ని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

 

Advertisement
Advertisement