త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLAs Disqualification | స్పీక‌ర్ నిర్ణ‌యం రాజ్యాంగ వ్య‌తిరేకం: రాంచంద‌ర్‌రావు

MLAs Disqualification | తెలంగాణ (Telangana) రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపుల‌కు పాల్ప‌డిన ఎమ్మెల్యేల అన‌ర్హ‌త పిటిష‌న్ల‌ (MLAs Disqualification) ను తోసిపుచ్చుతూ స్పీక‌ర్ తీసుకున్న నిర్ణ‌యం రాజ్యాంగ వ్య‌తిరేక‌మ‌ని బీజేపీ (BJP) రాష్ట్ర అధ్య‌క్షుడు ఎన్‌. రాంచంద‌ర్‌రావు (Ramchander Rao) మండిప‌డ్డారు.

A

News | Published On Dec 17, 2025, 6.53 pm IST

MLAs Disqualification | స్పీక‌ర్ నిర్ణ‌యం రాజ్యాంగ వ్య‌తిరేకం: రాంచంద‌ర్‌రావు
Advertisement

MLAs Disqualification | తెలంగాణ (Telangana) రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపుల‌కు పాల్ప‌డిన ఎమ్మెల్యేల అన‌ర్హ‌త పిటిష‌న్ల‌ (MLAs Disqualification) ను తోసిపుచ్చుతూ స్పీక‌ర్ తీసుకున్న నిర్ణ‌యం రాజ్యాంగ వ్య‌తిరేక‌మ‌ని బీజేపీ (BJP) రాష్ట్ర అధ్య‌క్షుడు ఎన్‌. రాంచంద‌ర్‌రావు (Ramchander Rao) మండిప‌డ్డారు. స‌రైన నిర్ణ‌యం తీసుకోకుండా స్పీక‌ర్ కార్యాల‌యాన్ని కాంగ్రెస్ పార్టీ ప్ర‌భావితం చేసిందని ఆరోపించారు. రాజ్యాంగబ‌ద్ధ కార్యాల‌యాల‌ను కాంగ్రెస్ పార్టీ నాశ‌నం చేస్తోందని దుయ్య‌బ‌ట్టారు. పార్టీ ఫిరాయింపుల చ‌ట్టాన్ని రాజీవ్‌గాంధీయే రూపొందించారని గుర్తు చేశారు. ప్ర‌స్తుతం అదే చ‌ట్టాన్ని కాంగ్రెస్ పార్టీయే ఉల్లంఘిస్తోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. రాజ్యాంగాన్ని సంర‌క్షించుకోవాలంటూ ఇప్పుడు అదే కాంగ్రెస్ ప్ర‌భుత్వం నీతులు చెబుతోంది. కాంగ్రెస్ త‌న‌ వైఖ‌రితో తెలంగాణ‌లో రాజ్యాంగం, ప్ర‌జాస్వామ్యంల‌ను హ‌త్య చేసింద‌ని విమ‌ర్శించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement