త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Shruthi Haasan | తండ్రి సినిమాలో యాక్ట‌ర్‌గా ఛాన్స్ – రిజెక్ట్ చేసిన శృతి హాస‌న్‌

కోలీవుడ్ స్టార్ హీరోలు ర‌జ‌నీకాంత్, క‌మ‌ల్‌హాస‌న్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న ధ‌ర్మ‌న్ మూవీ ఇటీవ‌ల లాంఛ్ అయ్యింది. అశ్వ‌త్ మారిముత్తు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో సిమ్రాన్‌, రాశీఖ‌న్నా కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ధ‌ర్మ‌న్ లో శృతి హాస‌న్ కూడా న‌టించాల్సింద‌ట‌. తండ్రి ఆఫ‌ర్‌ను ఈ హీరోయిన్ రిజెక్ట్ చేసిన‌ట్లు స‌మాచారం.

N

News | Published On Jun 26, 2026, 5.36 pm IST

Shruthi Haasan | తండ్రి సినిమాలో యాక్ట‌ర్‌గా ఛాన్స్ – రిజెక్ట్ చేసిన శృతి హాస‌న్‌
Advertisement

Shruthi Haasan |  ద‌క్షిణాదితో పాటు బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ప‌లు సినిమాలు చేసింది శృతి హాస‌న్‌. కేవ‌లం న‌ట‌న‌కే ప‌రిమితం కాకుండా సింగ‌ర్‌గా, లిరిసిస్ట్‌గా, మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా కూడా రాణించింది. మ‌ల్టీటాలెంటెడ్‌గా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ తండ్రికి త‌గ్గ త‌న‌య‌గా నిరూపించుకుంది.

ర‌జ‌నీకాంత్ సినిమాలో...

తాజాగా తండ్రి సినిమాలో యాక్ట‌ర్‌గా శృతి హాస‌న్‌కు ఛాన్స్ వ‌చ్చింద‌ట‌. కానీ ఆ అవ‌కాశాన్ని ఈ ముద్దుగుమ్మ రిజెక్ట్ చేసిన‌ట్లు స‌మాచారం. ర‌జ‌నీకాంత్ హీరోగా క‌మ‌ల్‌హాస‌న్ నిర్మాత‌గా తెర‌కెక్కుతోన్న ధ‌ర్మ‌న్ మూవీ ఇటీవ‌ల అఫీషియ‌ల్‌గా లాంఛ్ అయ్యింది. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకు అశ్వ‌త్ మారిముత్తు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. శుక్ర‌వారం నుంచి ధ‌ర్మ‌న్ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభ‌మైంది.

విమ‌ర్శ‌ల‌కు భ‌య‌ప‌డి...

ఈ పాన్ ఇండియ‌న్ మూవీలో సీనియ‌ర్ హీరోయిన్ సిమ్రాన్‌తో పాటు రాశీఖ‌న్నా కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. కాగా రాశీఖ‌న్నా పాత్ర కోసం మొద‌ట శృతి హాస‌న్‌ను తీసుకోవాల‌ని క‌మ‌ల్‌హాస‌న్ అనుకున్నార‌ట‌. కానీ తండ్రి ఆఫ‌ర్‌ను శృతిహాస‌న్ రిజెక్ట్ చేసింద‌ట. తండ్రి నిర్మాత కావ‌డంతో త‌న పాత్ర విష‌యంలో ద‌ర్శ‌కుడు అవ‌స‌రానికి మించి ప్రాముఖ్య‌త ఇవ్వ‌డంతో పాటు త‌న టాలెంట్‌ను కాకుండా క‌మ‌ల్‌హాస‌న్ వ‌ల్లే ఛాన్స్ వ‌చ్చింద‌ని విమ‌ర్శ‌లు ఎదుర‌య్యే అవ‌కాశం ఉండ‌టంతోనే ధ‌ర్మ‌న్‌లో న‌టించ‌కూడ‌ద‌ని శృతి హాస‌న్ నిర్ణ‌యించుకుంద‌ట‌. ఈ రోల్ కోసం రాశీఖ‌న్నా పేరును కూడా శృతి హాస‌న్ స‌జెస్ట్ చేసింద‌ట‌. త‌ను మాత్ర‌మే ఈ క్యారెక్ట‌ర్‌కు న్యాయం చేయ‌గ‌ల‌ద‌ని చెప్పింద‌ట‌. శృతి హాస‌న్ వ‌ల్లే రాశీఖ‌న్నాకు ర‌జ‌నీకాంత్ సినిమాలో న‌టించే అవ‌కాశం ద‌క్కిన‌ట్లు చెబుతోన్నారు. ఇటీవ‌ల పెద్దిలో ఐటెమ్ సాంగ్‌లో మెరిసింది శృతి హాస‌న్‌. ప్ర‌స్తుతం దుల్క‌ర్ స‌ల్మాన్ హీరోగా న‌టిస్తోన్న ఆకాశంలో ఒక తార సినిమాలో ఓ స్పెష‌ల్ రోల్‌లో క‌నిపించ‌బోతుంది.

 

Advertisement
Advertisement