త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Shah Rukh Khan | వార్ ఎఫెక్ట్ … షారుఖ్ కోసం ముంబైలోనే దుబాయ్ ఎడారి సెట్

ఇరాన్ - ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్ సినిమా ఇండ‌స్ట్రీపై కూడా ప‌డింది. యుద్ధ ప‌రిస్థితుల వ‌ల్ల దుబాయ్‌లో జ‌ర‌గాల్సిన షారుఖ్‌ఖాన్ కింగ్‌తో పాటు అల్లు అర్జున్ - అట్లీ మూవీ షూటింగ్స్ వాయిదాప‌డిన‌ట్లు స‌మాచారం. షారుఖ్ కింగ్ మేక‌ర్స్ దుబాయ్ ఎడారిని త‌ల‌పించేలా భారీ వ్య‌యంతో ఓ స్పెష‌ల్ సెట్ వేశార‌ట‌.

N

News | Published On Mar 31, 2026, 6.54 pm IST

Shah Rukh Khan |   వార్ ఎఫెక్ట్ … షారుఖ్ కోసం ముంబైలోనే  దుబాయ్ ఎడారి సెట్
Advertisement

Shah Rukh Khan | బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ఖాన్ సినిమా రిలీజై మూడేళ్లు దాటిపోయింది. రాజ్ కుమార్ హిరానీ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన డంకీ త‌ర్వాత కొత్త సినిమాల విష‌యంలో ఆచితూచి అడుగులు వేస్తోన్నాడు షారుఖ్‌ఖాన్‌. ప్ర‌స్తుతం కింగ్ సినిమాలో న‌టిస్తున్నాడు. సిద్దార్థ్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ పాన్ ఇండియ‌న్ మూవీ క్రిస్మ‌స్ కానుక‌గా ఈ ఏడాది డిసెంబ‌ర్ 24న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

సీనియ‌ర్ యాక్ట‌ర్లు...

కింగ్ మూవీలో దీపికా ప‌దుకొనే హీరోయిన్‌గా న‌టిస్తోంది. అభిషేక్ బ‌చ్చ‌న్, అనిల్ క‌పూర్, రాణిముఖ‌ర్జీ, అర్ష‌ద్ వార్సీతో పాటు ప‌లువురు బాలీవుడ్ సీనియ‌ర్ యాక్ట‌ర్లు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు.
ప్ర‌స్తుతం కింగ్ షూటింగ్ శ‌ర‌వేగంగా సాగుతోంది. ముంబైలోని విలేపార్లేలోని స్టూడియోలో షారుఖ్, అభిషేక్‌తో పాటు ప్ర‌ధాన తారాగ‌ణంపై ఎడారి ఛేజింగ్ సీక్వెన్స్‌ను చిత్రీక‌రించేందుకు ద‌ర్శ‌కుడు సిద్ధార్థ్ ఆనంద్ ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఏప్రిల్ సెకండ్ వీక్ నుంచి ఈ కొత్త షెడ్యూల్ మొద‌లుకాబోతున్న‌ట్లు స‌మాచారం.

ఎడారి సెట్‌...

ఈ యాక్ష‌న్ ఛేజింగ్ సీక్వెన్స్‌ను దుబాయ్‌లోని ఎడారిలో భారీ లెవెల్‌లో తెర‌కెక్కించాల‌ని డైరెక్ట‌ర్‌ సిద్ధార్థ్ ఆనంద్ ప్లాన్ చేశార‌ట‌. ఇందుకు సంబంధించిన అనుమ‌తులు కూడా తీసుకున్నార‌ట‌. ఏప్రిల్ సెకండ్ వీక్‌లో దుబాయ్ వెళ్లాల‌ని షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నారు. కానీ ఇరాన్‌, ఇజ్రాయెల్ వార్‌తో వారి ప్లాన్స్ మొత్తం త‌ల‌కిందుల‌య్యాయి. యుద్ధ ప‌రిస్థితుల కార‌ణంగా దుబాయ్ వెళ్ల‌డం క‌ష్టం కావ‌డంతో మేక‌ర్స్ ఎడారి సెట్‌ను భారీ ఖ‌ర్చుతో ముంబైలోనే వేశార‌ట‌. ఈ సెట్‌లోనే యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌బోతున్నార‌ట‌. రియ‌ల్‌గానే ఎడారిని త‌ల‌పించేలా ఈ సెట్‌ను తీర్చిదిద్దార‌ట. ఈ సెట్ కోసం ప‌ది కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చుచేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. షూటింగ్ డిలే కాకూడ‌ద‌నే ఈ నిర్ణ‌యాన్ని తీసుకున్నార‌ట‌.

అల్లు అర్జున్ మూవీ కూడా...

ఇరాన్‌, ఇజ్రాయెల్ వార్ కార‌ణంగా షారుఖ్‌ఖాన్ కింగ్‌తో పాటు అల్లు అర్జున్ - అట్లీ మూవీ కూడా ఇబ్బందుల‌ను ఎదుర్కొంటున్న‌ట్లు స‌మాచారం. ఈ సినిమాకు సంబంధించి ఏప్రిల్ నెల‌లో దుబాయ్‌లో ఓ భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారు అట్లీ. కానీ యుద్ధ ప‌రిస్థితుల వ‌ల్ల ఈ షెడ్యూల్ క్యాన్సిల్ అయిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. దాదాపు 1300 కోట్ల బ‌డ్జెట్‌తో స‌న్ పిక్చ‌ర్స్ సంస్థ అల్లు అర్జున్ - అట్లీ మూవీని నిర్మిస్తోంది.

Advertisement

తాజావార్తలు

Advertisement