Satvika Veeravalli | “పెద్ది” వివాదం ఎఫెక్ట్ – ధృవ్ విక్రమ్ సినిమా నుంచి జాన్వీ ఔట్ – అచ్చ తెలుగు అమ్మాయికి ఛాన్స్
హీరోయిన్‌గా తొలి సినిమా రిలీజ్ కాకముందే సాత్విక వీరవల్లి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది. రామ్‌చరణ్, సుకుమార్ మూవీతో పాటు గీతా ఆర్ట్స్‌లో ఓ రెండు సినిమాల్లో ఈ అమ్మడి పేరు వినిపిస్తోంది. తాజాగా సాత్విక వీరవల్లి తమిళంలోకి ఎంట్రీ ఇస్తోంది. విక్రమ్ తనయుడితో జోడీకట్టబోతుంది.
Entertainment | Published On Nov 17, 2026, 3.42 pm IST
Satvika Veeravalli | దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తోన్న తెలుగు మూవీ "ఆకాశంలో ఒక తార " నవంబర్ 20న థియేటర్లలోకి రాబోతుంది. పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్న ఈ ఎమోషనల్ డ్రామా మూవీతో సాత్విక వీరవల్లి (Satvika Veeravalli)హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ సినిమా టీజర్, ట్రైలర్స్‌తో టాలీవుడ్ వర్గాల దృష్టిని ఆకర్షించింది అమెరికాలో పుట్టి పెరిగిన ఈ అచ్చ తెలుగు అమ్మాయి. ప్రస్తుతం టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది. గీతా ఆర్ట్స్‌లో సాత్విక వీరవల్లితో మరో రెండు సినిమాలకు అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు ఆకాశంలో ఒక తార ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ప్రకటించారు. మరోవైపు రామ్‌చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఆర్‌సీ 17లో హీరోయిన్‌గా ఈ అమ్మడు రేసులో ఉంది. ఇటీవలే సాత్విక వీరవల్లిపై డైరెక్టర్ లుక్ టెస్ట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
కోలీవుడ్‌లోకి...
తాజాగా ఈ అచ్చ తెలుగు బ్యూటీ మరో లక్కీ ఛాన్స్ అందుకుంది. విక్రమ్ తనయుడి సినిమాతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ హీరోగా తమిళంలో "జాకీ" పేరుతో ఓ యాక్షన్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతోంది. కరణ్ అరవింద్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ కోలీవుడ్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. సినిమా పరిశ్రమ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న జాకీలో హీరోలకు డూప్‌గా ధృవ్ విక్రమ్ కనిపించబోతున్నాడు.
జాన్వీకపూర్...
జాకీ సినిమాలో తొలుత హీరోయిన్‌గా జాన్వీకపూర్‌ను (Janhvi Kapoor) తీసుకోవాలని నిర్మాతలు ప్లాన్ చేశారు. కానీ పెద్ది సినిమా వివాదంలో దక్షిణాది సినీ పరిశ్రమపై శ్రీదేవి తనయ విమర్శలు గుప్పించింది. ఈ కామెంట్లతో జాన్వీ కపూర్‌ను పక్కనపెట్టిన మేకర్స్ జాకీలో హీరోయిన్‌గా సాత్విక వీరవల్లిని ఎంపిక చేసినట్లు వార్తలొస్తున్నాయి. ధృవ్ విక్రమ్ సినిమాతోనే సాత్విక వీరవల్లి తమిళ ఇండస్ట్రీకి పరిచయం కాబోతుంది.
ఒరాకిల్‌లో...
సినిమాల్లోకి రాకముందే సాత్విక వీరవల్లి అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఒరాకిల్‌లో పనిచేసింది. నటనపై ఇష్టంతో జాబ్ వదులుకున్నట్లు చెప్పింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం






