BRS | విత్తన బిల్లుతో రైతులకు తీవ్ర నష్టం: కేటీఆర్
BRS | కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న విత్తన బిల్లు (Central Seed Bill) ముసాయిదాను భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) (BRS) తీవ్రంగా వ్యతిరేకించింది. కేంద్రం ప్రతిపాదిస్తున్న ఈ విత్తన బిల్లు వలన రైతన్నలకు తీవ్రమైన నష్టం జరుగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఈ బిల్లును పూర్తిగా ఆపివేసి, రైతులు, రైతు సంఘాలు, నిపుణులు, రాజకీయ పార్టీలతో చర్చించిన అనంతరం ముందకు సాగాలని డిమాండ్ చేశారు. ముసాయిదా బిల్లులో కీలక సవరణలు సూచిస్తూ సుదీర్ఘ వివరణను కేటీఆర్ కేంద్రప్రభుత్వానికి అందజేశారు.
A
A Sudheeksha
News | Dec 11, 2025, 5.53 pm IST
















