Kiara Advani | కియారా అద్వానీ పేరు వెనకున్న సీక్రెట్ ఇదేనట – ప్రియాంక చోప్రాపై అభిమానంతో…
కియారా అద్వానీ అసలు పేరు అలియా అద్వానీ అట. అప్పటికే అలియా భట్ స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతుండటంతో కియారాగా తన పేరును మార్చుకుందట. కియారా పేరు మార్పుకు, ప్రియాంక చోప్రాకు సంబంధం ఉందట. ఈ సీక్రెట్‌ను ఇటీవలే కియారా బయటపెట్టింది.
Kiara Advani |సినిమాల కోసం హీరోహీరోయిన్లు తమ అసలు పేర్లు మార్చుకోవడం ఇండస్ట్రీలో కామన్. అప్పటికే ఆ పేరుతో మరో నాయకానాయికలు ఉండటమో లేదంటే ఆడియెన్స్ ఈజీగా గుర్తుపెట్టుకోవడానికో, న్యూమరాలజీ కోసమే..ఇలా రకరకాల కారణాలతో నేమ్స్ ఛేంజ్ చేసుకుంటుంటారు. కియారా అద్వానీ కూడా అలాగే పేరు మార్చుకుందట. తన పేరు మార్పు వెనకున్న సీక్రెట్‌ను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసింది. ప్రియాంక చోప్రాపై ఉన్న అభిమానంతోనే కియారా గా పేరు పెట్టుకున్నట్లు తెలిపింది. అంతే కాకుండా కెరీర్ ఆరంభంలో ఎదురైన కష్టాలను వివరిస్తూ కియారా ఎమోషనల్ అయ్యింది.
ప్రియాంక చోప్రా వీరాభిమానిని...
"చిన్నప్పటి నుంచి నటిని కావాలని కలలు కన్నాను. సల్మాన్ ఖాన్, జూహీ చావ్లాలతో మా ఫ్యామిలీకి చక్కటి అనుబంధముంది. వారి కారణంగా సినిమాలపై ఇష్టం మరింత పెరిగింది. ఎవరి రికమండేషన్ లేకుండా అవకాశాల కోసం ప్రయత్నించా. లక్కీగా ఫగ్లీ మూవీలో ఛాన్స్ వచ్చింది. నా అసలు పేరు అలియా అద్వానీ. నేను హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చే టైమ్‌కు అలియా భట్ స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. దాంతో నా పేరు మార్చుకోమని సల్మాన్ ఖాన్ సలహా ఇచ్చారు. ప్రియాంక చోప్రా అంజనా అంజానీ సినిమా అంటే ఎంతో ఇష్టం. ఆ సినిమాతోలో ఆమెకు వీరాభిమానిగా మారిపోయా. అందులో ప్రియాంక చోప్రా క్యారెక్టర్ పేరు కియారా. నాకు ఇష్టమైన నటి చేసిన పాత్ర పేరునే నేను పెట్టుకున్నా" అని అన్నది.
ఓవర్‌నైట్‌లో వచ్చినవి కావు....
"పెద్ద సినిమాల్లో అవకాశాలు, స్టార్ హీరోయిన్ హోదా ఇవన్నీ ఓవర్‌నైట్‌లో వచ్చినవి కావని కియారా అద్వానీ అన్నది. వాటి వెనుక ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని చెప్పింది. కెరీర్ ఆరంభంలో అవకాశాల కోసం చాలా కష్టాలు ఎదుర్కొన్నా. ఫగ్లీ రిలీజై హిట్టయినా రెండేళ్ల పాటు నాకు ఒక్క ఆఫర్ రాలేదు. ఎన్నో ఆడిషన్లకు అటెండ్ అయ్యాను. కొందరు దర్శకులు నన్ను కలవడానికి ఇష్టపడేవారు కాదు. ఛాన్స్ ఇవ్వలేమని మొహం మీదే చెప్పేవారు. ఒకానొక టైమ్‌లో ఇండస్ట్రీని వదిలేద్దామని అనుకున్నా. అప్పుడు రిజెక్ట్ చేసిన డైరెక్టర్లు ఇప్పుడు నాతో సినిమాలు చేసేందుకు ఎదురుచూస్తున్నారు" అని కియారా అద్వానీ అన్నది.
ప్రస్తుతం యశ్ టాక్సిక్ మూవీలో హీరోయిన్‌గా నటిస్తోంది కియారా అద్వానీ. పీరియాడికల్ యాక్షన్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా జూన్ 4న థియేటర్లలోకి రాబోతుంది. ఈ సినిమాలో కియారా అద్వానీతో పాటు నయనతార, తారా సుతారియా, రుక్మిణి వసంత్ కథానాయికలుగా కనిపించబోతున్నారు.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



