Samantha | నాగార్జున మేనకోడలి సినిమాపై సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్ – నెటిజన్ల ప్రశంసలు
నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డ నిర్మించిన డెకాయిట్ మూవీ బ్లాక్‌బస్టర్ కావాలంటూ సమంత గురువారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. అక్కినేని ఫ్యామిలీ సినిమాకు సమంత సపోర్ట్ చేయడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
Samantha | అక్కినేని హీరో నాగచైతన్య నటించిన ఏ మాయ చేశావేతోనే హీరోయిన్‌గా సమంత తెలుగు కెరీర్ ప్రారంభమైంది. ఆ తర్వాత నాలుగైదు సినిమాల్లో వీరిద్దరూ జంటగా కనిపించారు. నాగచైతన్యతో ప్రేమలో పడ్డ సమంత అతడిని పెళ్లి చేసుకుంది. కానీ మూడేళ్లకే మనస్పర్థల కారణంగా చైతూ, సామ్ విడిపోయారు. విడాకుల తర్వాత అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన విషయాలకు దూరంగా ఉంటూ వస్తోంది సమంత. విడాకుల గురించి పలు ఇంటర్వ్యూలలో మాట్లాడిన సామ్....నాగచైతన్యపై మాత్రం ఎలాంటి నెగెటివ్ కామెంట్స్ చేయలేదు.
డెకాయిట్....
తాజాగా సమంత చేసిన ఓ పని అక్కినేని అభిమానులను ఆకట్టుకుంటోంది. నాగార్జున మేనకోడలు నిర్మించిన ఓ సినిమాకు సమంత సపోర్ట్‌గా నిలిచింది. సినిమా బ్లాక్‌బస్టర్ కావాలంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. సుప్రియ యార్లగర్డ నిర్మించిన డెకాయిట్ మూవీ ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అడివిశేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ సినిమాకు షానీల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు. ఈ వారం రిలీజ్ అవుతోన్న సినిమాల్లో డెకాయిట్‌పైనే భారీగా బజ్ నెలకొంది.
నీ కష్టాన్ని చూశా....
డెకాయిట్ మూవీ ప్రొడ్యూసర్ సుప్రియ యార్లగడ్డను ఉద్దేశించి గురువారం సమంత చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. "డెకాయిట్ కోసం నువ్వు పడ్డ కష్టం, సినిమాపై నీకున్న ప్రేమ, అంకితభావాన్ని ప్రత్యక్షంగా చూశా. బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకోవడానికి నీకంటే ఎవరూ అర్హులు కారు. డెకాయిట్ మూవీతో నీకు అంత మంచే జరగాలి. దేవుడి ఆశీస్సులు ఉండాలి" అంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో సమంత ఓ పోస్ట్ పెట్టింది. అక్కినేని మేనకోడలి సినిమా హిట్ కావాలంటూ సమంత పోస్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది. సమంత మనసు మంచిదంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తోన్నారు.
రెండేళ్ల గ్యాప్ తర్వాత...
కాగా ప్రస్తుతం మా ఇంటి బంగారం మూవీతో సమంత బిజీగా ఉంది. క్రైమ్ కామెడీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తూనే భర్త రాజ్ నిడిమోరుతో కలిసి నిర్మిస్తుంది. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ మూవీ మే 15న రిలీజ్ కానుంది. మా ఇంటి బంగారంతోనే హీరోయిన్‌గా రెండేళ్ల గ్యాప్ తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది సమంత.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



