త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Deepika Padukone | దీపికా పడుకోణ్‌తో సినిమా – నా కెరీర్‌లో చేసిన‌ పెద్ద త‌ప్పు – బాలీవుడ్ హీరో కామెంట్స్‌

దీపికా ప‌డుకోణ్ సూప‌ర్ హిట్ మూవీపై బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ చేసిన కామెంట్లు దుమారాన్ని రేపుతున్నాయి. కాక్ టెయిల్ సినిమాలో న‌టించ‌డ‌మే త‌న కెరీర్‌లో చేసిన అతి పెద్ద త‌ప్పు అంటూ ఓ ఇంట‌ర్వ్యూలో సైఫ్ అలీఖాన్ అన్నారు. అత‌డి వ్యాఖ్య‌ల‌ను దీపికా ఫ్యాన్స్ త‌ప్పుప‌డుతున్నారు.

N

News | Published On Sep 11, 2026, 5.16 pm IST

Deepika Padukone | దీపికా పడుకోణ్‌తో సినిమా – నా కెరీర్‌లో చేసిన‌ పెద్ద త‌ప్పు – బాలీవుడ్ హీరో కామెంట్స్‌
Advertisement

Deepika Padukone | దీపికా ప‌డుకోణ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీపై హీరో సైఫ్ అలీఖాన్ చేసిన కామెంట్లు బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. అత‌డిని దీపికా ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. దీపికా ప‌డుకోణ్, సైఫ్ అలీఖాన్ హీరోహీరోయిన్లుగా న‌టించిన కాక్ టెయిల్ బాక్సాఫీస్ వ‌ద్ద 120 కోట్ల వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది. 2012లో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన హిందీ సినిమాగా నిలిచింది. హోమీ అద్జానియా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాను సైఫ్ అలీఖాన్ నిర్మించారు. కాక్ టెయిల్ రిలీజైన ప‌ధ్నాలుగేళ్ల త‌ర్వాత ఈ సినిమాపై సైఫ్ అలీఖాన్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

హైవాన్‌...

సైఫ్ అలీఖాన్ హీరోగా న‌టించిన హైవాన్ మూవీ శుక్ర‌వారం థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా అన‌వ‌స‌రంగా చేశాన‌ని బాధ‌ప‌డ్డ సినిమాలు మీ కెరీర్‌లో ఉన్నాయా అని అడిగిన ప్ర‌శ్న‌కు దీపికా ప‌డుకోణ్ కాక్‌టెయిల్ సినిమా పేరు చెప్పాడు సైఫ్ అలీఖాన్‌.

అతి పెద్ద త‌ప్పు...

"కాక్ టెయిల్‌లో న‌టించ‌డ‌మే నా కెరీర్‌లో చేసిన అతిపెద్ద త‌ప్పు. ఆ స్క్రిప్ట్ అస్స‌లు న‌చ్చ‌లేదు. పాత‌కాల‌పు ఆలోచ‌న‌ల‌ను ప్రోత్స‌హించే విధంగా ఉంద‌ని, ట్రెండ్‌కు త‌గిన‌ది కాద‌ని అనిపించింది. ఇష్టం లేక‌పోయినా కొన్ని ప‌రిస్థితుల వ‌ల్ల నిర్మాణ బాధ్య‌త‌లు చేప‌ట్టాను. ఆ సినిమా చేయ‌డానికి హీరోలు ఎవ‌రూ ముందుకు రాలేదు. అప్ప‌టికే స‌గం వ‌ర‌కు షూటింగ్ పూర్త‌య్యింది. ఎలాగైనా సినిమాను పూర్తిచేయాల‌నే కాక్ టెయిల్ లో నేనే న‌టించా. ఇప్ప‌టికీ ఆ సినిమా విష‌యంలో రిగ్రేట్‌గా ఫీల‌వుతుంటా. సినిమా పెద్ద హిట్ట‌యిన క్రియేట్‌వ్‌గా మాత్రం నాకు సంతృప్తినివ్వ‌లేక‌పోయింది కాక్ టెయిల్ తో పాటు హ‌మ్‌ష‌క‌ల్స్ కూడా చేసుండాల్సింది కాదు" అని సైఫ్ అలీఖాన్ అన్నారు.

ఫ్యాన్స్ ట్రోల్‌...

సైఫ్ అలీఖాన్ కామెంట్ల‌ను దీపికా ప‌డుకోణ్ ఫ్యాన్స్ త‌ప్పుప‌డుతున్నారు. దీపికా ప‌డుకోణ్ వ‌ల్లే సినిమా ఆడింద‌నే నిజాన్ని ఒప్పుకోలేక సైఫ్ ఇలాంటి కామెంట్లు చేస్తున్నాడ‌ని అంటున్నారు. కాగా కాక్ టెయిల్ మూవీకి ఇటీవ‌లే సీక్వెల్ వ‌చ్చింది. కాక్‌టెయిల్ 2 పేరుతో తెర‌కెక్కిన ఈ సీక్వెల్‌లో ర‌ష్మిక మంద‌న్న‌, షాహిద్ క‌పూర్‌, కృతి స‌న‌న్ హీరోహీరోయిన్లుగా న‌టించారు. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ మూవీ డిజాస్ట‌ర్‌గా నిలిచింది

 

Advertisement
Advertisement