త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rishab Shetty | రెండు పార్ట్‌లుగా ఛ‌త్ర‌ప‌తి శివాజీ బ‌యోపిక్ – టైటిల్ పాత్ర‌లో కాంతార హీరో

ఛ‌త్ర‌ప‌తి శివాజీ జీవితం ఆధారంగా బాలీవుడ్‌లో ఓ బ‌యోపిక్ రాబోతుంది. కాంతార ఫేమ్ రిష‌బ్ శెట్టి ఈ సినిమాతో హిందీ ఇండ‌స్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. ఈ బ‌యోపిక్ సెట్స్‌పైకి వ‌చ్చేది ఎప్పుడంటే?

N

News | Published On Oct 30, 2026, 9.08 pm IST

Rishab Shetty | రెండు పార్ట్‌లుగా ఛ‌త్ర‌ప‌తి శివాజీ బ‌యోపిక్ – టైటిల్ పాత్ర‌లో కాంతార హీరో
Advertisement

Rishab Shetty |  ఛ‌త్ర‌ప‌తి శివాజీ జీవితం వెండితెర‌పై ఆవిష్కృతం కాబోతుంది. మ‌రాఠా వీరుడి బ‌యోపిక్‌లో కాంతార ఫేమ్ రిష‌భ్ శెట్టి హీరోగా న‌టించ‌బోతున్నారు. "ది ప్రైడ్ ఆఫ్ భార‌త్ ఛ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హారాజ్" పేరుతో తెర‌కెక్కుతోన్న ఈ పాన్ ఇండియ‌న్ సినిమాను బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ‌ టీ సిరీస్ సంస్థ నిర్మిస్తోంది.

వందేళ్ల చిత్ర‌ప‌టం...

2027 ఆరంభంలో ది ప్రైడ్ ఆఫ్ భార‌త్ సెట్స్‌పైకి రానున్న‌ట్లు శుక్ర‌వారం మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు హీరో రిష‌బ్ శెట్టిని టీ సిరీస్ అధినేత భూష‌ణ్‌ కుమార్ క‌లిశారు. ఛ‌త్ర‌ప‌తి శివాజీకి చెందిన వందేళ్ల క్రితం నాటి చిత్ర‌ప‌టాన్ని ఆయ‌న‌కు బ‌హుక‌రించారు. ఇందుకు సంబంధించిన ఫొటోను టీ సిరీస్ సంస్థ సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో పంచుకుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ రెండు భాగాలుగా తెర‌కెక్కుతోన్న‌ట్లు ప్ర‌క‌టించారు.

శివాజీ త్యాగాలు, యుద్దాలు...

శివాజీ గురించి ఎవ‌రికి తెలియ‌ని నిజాల‌తో పాటు ఆయ‌న చేసిన యుద్దాలు, అసాధార‌ణ త్యాగాల‌ను ఈ సినిమాలో చూపించ‌బోతున్నారు. శివాజీ సైనిక మేథ‌స్సు, వ్యూహాత్మ‌క దూర‌దృష్టి, నాయ‌క‌త్వ‌ప‌ఠిమ‌ను స్ఫూర్తిమంతంగా బ‌యోపిక్‌లో ఆవిష్క‌రించ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ది ప్రైడ్ ఆఫ్ భార‌త్ మూవీకి సందీప్ సింగ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. రిషి విర్మానితో క‌లిసి సందీప్ సింగ్ క‌థ‌ను అందిస్తోన్నారు. హీరోగా న‌టిస్తూనే ఈ మూవీకి స‌హ నిర్మాత‌గా కూడా రిష‌బ్ శెట్టి వ్య‌వ‌హ‌రించ‌బోతున్నారు.

య‌శ్ త‌ర్వాత‌...

రామాయ‌ణ మూవీతో క‌న్న‌డ హీరో య‌శ్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నారు. య‌శ్ బాట‌లోనే రిష‌బ్‌శెట్టి అడుగులు వేయ‌బోతుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. ప్ర‌జెంట్ జై హ‌నుమాన్ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు రిష‌బ్ శెట్టి. హ‌నుమాన్‌కు సీక్వెల్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

 

ట్యాగ్స్:

BollywoodChhatrapati Shivaji BiopicHindi CinemaKantara HeroRishab ShettyRishab Shetty Bollywood DebutT SeriesThe Pride Of Bharat
Advertisement
Advertisement