Census 2027 | జనాభా లెక్కలకు ముహూర్తం ఖరారు.. 2027 జనవరి 25 నుంచి షురూ..
Census 2027 | దేశవ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జనాభా గణన ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం తేదీలను ప్రకటించింది. 2027 జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు దేశవ్యాప్తంగా జనాభా లెక్కల సేకరణ చేపట్టనుంది. అయితే, ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు, మంచు ప్రభావిత ప్రాంతాలకు ఈ షెడ్యూల్ నుంచి మినహాయింపు ఇచ్చింది. ఆయా రాష్ట్రాల్లో జనాభా గణన ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదు.
Census 2027 | దేశవ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జనాభా గణన ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం తేదీలను ప్రకటించింది. 2027 జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు దేశవ్యాప్తంగా జనాభా లెక్కల సేకరణ చేపట్టనుంది. అయితే, ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు, మంచు ప్రభావిత ప్రాంతాలకు ఈ షెడ్యూల్ నుంచి మినహాయింపు ఇచ్చింది. ఆయా రాష్ట్రాల్లో జనాభా గణన ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదు.
మూడు దశల్లో జనాభా లెక్కలు
జనాభా గణన ప్రక్రియను మూడు దశల్లో నిర్వహించనున్నారు. తొలిదశలో భాగంగా 2027 జనవరి 10 నుంచి 24 వరకు ప్రజలు ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకునే అవకాశం కల్పించనున్నారు. రెండో దశలో జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు గణన సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వివరాలను సేకరిస్తారు. చివరిదశలో మార్చి 1 నుంచి 5 వరకు ఇప్పటికే నమోదు చేసిన సమాచారాన్ని మరోసారి పరిశీలించి, అవసరమైన సవరణలు చేపట్టనున్నారు.
ఎన్నికలు, మంచు ప్రభావిత రాష్ట్రాలకు మినహాయింపు
ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు, మంచు ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాలను ప్రస్తుత జనాభా గణన షెడ్యూల్ నుంచి మినహాయించారు. మంచు కారణంగా కొన్ని ప్రాంతాలకు చేరుకోవడం, అక్కడ గణన నిర్వహించడం సవాళ్లతో కూడుకున్నది. మరోవైపు ఎన్నికల సమయంలో రాష్ట్ర యంత్రాంగం ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాలకు ప్రత్యేక షెడ్యూల్ రూపొందించే అవకాశం ఉంది. అయితే ఏయే రాష్ట్రాలకు మినహాయింపు ఇచ్చారు? అక్కడ జనాభా గణన ఎప్పుడు చేపడతారు? అనే వివరాలను ప్రభుత్వం వెల్లడించలేదు.
2011 తర్వాత మళ్లీ ఇప్పుడే..
భారత్‌లో చివరిసారిగా 2011లో జనాభా గణన నిర్వహించారు. అనంతరం 2021లో మరోసారి జనాభా లెక్కలు చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం రెండు దశల్లో ఏర్పాట్లు చేసింది. 2020 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు తొలి దశ, 2021 ఫిబ్రవరిలో రెండో దశ నిర్వహించాలని ప్రతిపాదించింది. 2020 ఏప్రిల్ 1 నుంచి కొన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు కూడా పూర్తయ్యాయి. అయితే అదే సమయంలో కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా విస్తరించడంతో జనాభా గణన ప్రక్రియ వాయిదా పడింది. అప్పటి నుంచి ఇప్పటివరకు దేశంలో కొత్తగా జనాభా లెక్కలు నిర్వహించలేదు.
భవిష్యత్ ప్రణాళికలకు కీలకం
ఒక దేశ జనాభా ఎంత? వయస్సుల వారీగా జనాభా నిర్మాణం ఎలా ఉంది? వంటి కీలక వివరాలను జనాభా గణన ద్వారా తెలుసుకోవచ్చు. ప్రభుత్వ పథకాల రూపకల్పన, మౌలిక సదుపాయాల కల్పన, విద్య, వైద్యం, ఉపాధి వంటి రంగాల్లో భవిష్యత్ అవసరాలను అంచనా వేయడానికి ఈ గణాంకాలు ఉపయోగపడతాయి. 2011 తర్వాత దాదాపు 16 ఏళ్లకు చేపట్టనున్న ఈ జనాభా గణన ద్వారా దేశ జనాభా స్థితిగతులపై తాజా సమాచారం అందుబాటులోకి రానుంది. తద్వారా రాబోయే రోజుల్లో ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి ప్రణాళికలకు ఈ గణాంకాలు కీలక ఆధారంగా నిలవనున్నాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Sanjay Raut | మాల్యా మోసగాడు కాదు.. మోదీ ప్రసంగాలు బాగుంటాయి.. సంజయ్ రౌత్ పుస్తకంలో ఆసక్తికర వ్యాఖ్యలు
అక్టోబర్ 30, 2026

Gaddam Vamshi | రైల్వేల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వండి.. కేంద్రమంత్రికి పెద్దపల్లి ఎంపీ వినతి
అక్టోబర్ 30, 2026

Manisha Bhanwala | చరిత్ర సృష్టించిన మనీషా.. ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారత్కు స్వర్ణం
అక్టోబర్ 30, 2026
తాజావార్తలు
- ●Sanjay Raut | మాల్యా మోసగాడు కాదు.. మోదీ ప్రసంగాలు బాగుంటాయి.. సంజయ్ రౌత్ పుస్తకంలో ఆసక్తికర వ్యాఖ్యలు
- ●Bhatti Vikramarka | హైదరాబాద్ అభివృద్ధి కోసం రూ.84,790 కోట్లతో సమగ్ర కార్యాచరణ : భట్టి విక్రమార్క
- ●Krithi Shetty | ట్రెడిషనల్ డ్రెస్లో కృతిశెట్టి - క్యూట్ అందాలతో ఫిదా
- ●HYDRAA | గుట్టల బేగంపేటలో.. ప్రభుత్వ భూమిని కాపాడిన 'హైడ్రా'
- ●Gaddam Vamshi | రైల్వేల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వండి.. కేంద్రమంత్రికి పెద్దపల్లి ఎంపీ వినతి
- ●CM Revanth Reddy | హై స్పీడ్ రైళ్లకు ఎలాంటి భూసేకరణ చేయలేదు.. కేంద్రానికి సీఎం వివరణ

Sanjay Raut | మాల్యా మోసగాడు కాదు.. మోదీ ప్రసంగాలు బాగుంటాయి.. సంజయ్ రౌత్ పుస్తకంలో ఆసక్తికర వ్యాఖ్యలు

Bhatti Vikramarka | హైదరాబాద్ అభివృద్ధి కోసం రూ.84,790 కోట్లతో సమగ్ర కార్యాచరణ : భట్టి విక్రమార్క

Krithi Shetty | ట్రెడిషనల్ డ్రెస్లో కృతిశెట్టి - క్యూట్ అందాలతో ఫిదా

HYDRAA | గుట్టల బేగంపేటలో.. ప్రభుత్వ భూమిని కాపాడిన 'హైడ్రా'



