Gaddam Vamshi | రైల్వేల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వండి.. కేంద్రమంత్రికి పెద్దపల్లి ఎంపీ వినతి
Gaddam Vamshi | పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కోరినట్లు స్థానిక ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్ర మంత్రివర్గ సభ్యుల ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రితో జరిగిన సమావేశంలో పాల్గొని నియోజకవర్గ సమస్యలపై వినతిపత్రం అందజేశారు.
Gaddam Vamshi | పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కోరినట్లు స్థానిక ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్ర మంత్రివర్గ సభ్యుల ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రితో జరిగిన సమావేశంలో పాల్గొని నియోజకవర్గ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. పెండింగ్ ప్రాజెక్టులను వేగవంతం చేయడంతోపాటు కొత్త రైళ్ల స్టాపేజీలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో సుమారు రూ.1,000 కోట్లతో మంజూరైన 16 రైల్వే ఓవర్ బ్రిడ్జిల (ROB) నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కోరారు. ఓదెల, కొలనూర్, కొన్నారం, కన్నాల, కుందనపల్లి తదితర ప్రాంతాల్లో భూసేకరణ, సాంకేతిక అనుమతుల సమస్యలను పరిష్కరించి పనులు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.
మంచిర్యాల జిల్లాలో సబ్‌వేలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు
మంచిర్యాల హైటెక్ సిటీ–రాజీవ్ నగర్, నర్లాపూర్–అందుగులపేట మధ్య సబ్‌వేలు నిర్మించాలని కోరారు. హమాలీవాడలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి (FOB) ఏర్పాటు చేయడంతోపాటు మందమర్రి, రేచ్ని రోడ్ రైల్వే స్టేషన్లలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిల విస్తరణకు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో భగత్ కీ కోఠి, కేరళ ఎక్స్‌ప్రెస్‌తో పాటు ఇతర ముఖ్యమైన రైళ్లకు స్టాపేజీలు కల్పించాలని కోరారు. పెద్దపల్లిలో తెలంగాణ సూపర్‌ఫాస్ట్, నవజీవన్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లకు హాల్టింగ్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 207.8 కిలోమీటర్ల రామగుండం–మణుగూరు రైల్వే లైన్ ప్రాజెక్టును త్వరితగతిన ప్రారంభించాలని కోరారు. గతంలో రూ.5,818 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టులో మంథని, ముత్తారం, కమాన్‌పూర్, మల్హర్ మండలాల ప్రజలకు ప్రయోజనం కలిగేలా ప్రయాణికుల రైల్వే స్టేషన్లను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు.
ఏడు నియోజకవర్గాలకు సమాన ప్రాధాన్యం
పెద్దపల్లి, రామగుండం, మంథని, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు, ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గాల్లో రైల్వే కనెక్టివిటీని మెరుగుపర్చాలని కోరారు. మంథనికి దశాబ్దాలుగా మంత్రి స్థాయి ప్రాతినిధ్యం ఉన్నప్పటికీ సరైన రైల్వే కనెక్టివిటీ లేకపోవడంపై ప్రశ్నించారు. ప్రజల రవాణా అవసరాలకు శాశ్వత పరిష్కారం చూపాలని పేర్కొన్నారు. పెండింగ్ రైల్వే ప్రాజెక్టులన్నింటికీ నిర్దిష్ట గడువులు ప్రకటించి పనులు పూర్తి చేయాలని కేంద్రాన్ని కోరినట్లు ఎంపీ వెల్లడించారు. రైల్వే అభివృద్ధి ద్వారా గ్రామాలు, పట్టణాలు, విద్య, ఉపాధి అవకాశాలకు మెరుగైన అనుసంధానం కలుగుతుందని పేర్కొన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని అన్ని ప్రాంతాలకు మెరుగైన రైల్వే సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●CM Revanth Reddy | హై స్పీడ్ రైళ్లకు ఎలాంటి భూసేకరణ చేయలేదు.. కేంద్రానికి సీఎం వివరణ
- ●Kalvakuntla Kavitha | పంటలు వేయొద్దన్న ముఖ్యమంత్రి అధికారంలో ఉండొద్దు
- ●Gold Prices | బంగారం ధరలు ఢమాల్.. అంచనాలకు మించి అమెరికా వృద్ధి..
- ●Manisha Bhanwala | చరిత్ర సృష్టించిన మనీషా.. ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు స్వర్ణం
- ●Helicopter Accident | హెలికాప్టర్ కూలిన ఘటనలో ఆరుగురి మృతి
- ●Aditi Shankar | మణిరత్నం కల్ట్ క్లాసిక్ టైటిల్ కొట్టేసిన శంకర్ కూతురు

CM Revanth Reddy | హై స్పీడ్ రైళ్లకు ఎలాంటి భూసేకరణ చేయలేదు.. కేంద్రానికి సీఎం వివరణ

Kalvakuntla Kavitha | పంటలు వేయొద్దన్న ముఖ్యమంత్రి అధికారంలో ఉండొద్దు

Gold Prices | బంగారం ధరలు ఢమాల్.. అంచనాలకు మించి అమెరికా వృద్ధి..

Manisha Bhanwala | చరిత్ర సృష్టించిన మనీషా.. ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు స్వర్ణం




