HYDRAA | గుట్టల బేగంపేటలో.. ప్రభుత్వ భూమిని కాపాడిన ‘హైడ్రా’
HYDRAA | రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం పరిధిలోని గుట్టలబేగంపేట విలేజ్ సర్వే నంబరు 63లో ప్రభుత్వ భూమిని హైడ్రా( HYDRAA ) కాపాడింది. ఈ సర్వే నంబరులో మొత్తం 78 ఎకరాలుండగా.. ఇందులో కొంత భూమి ఇప్పటికే కబ్జాలై.. నివాసాలు వచ్చాయి. ఈ భూమి తమ పూర్వీకులదని కొంతమంది అమ్ముకుంటూ వస్తున్నారు.
రెవెన్యూ అధికారుల వినతి మేరకు హైడ్రా చర్యలు
HYDRAA | త్రినేత్ర న్యూస్ : రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం పరిధిలోని గుట్టలబేగంపేట విలేజ్ సర్వే నంబరు 63లో ప్రభుత్వ భూమిని హైడ్రా( HYDRAA ) కాపాడింది. ఈ సర్వే నంబరులో మొత్తం 78 ఎకరాలుండగా.. ఇందులో కొంత భూమి ఇప్పటికే కబ్జాలై.. నివాసాలు వచ్చాయి. ఈ భూమి తమ పూర్వీకులదని కొంతమంది అమ్ముకుంటూ వస్తున్నారు.
అలాగే మరి కొంతమంది ప్రహరీలు నిర్మించుకుని భూమిని కాపాడుతున్నారు. ఈ వివాదం హైకోర్టుకు వెళ్లింది. హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ స్టేటస్ కో ఉత్తర్వులను పట్టించుకోకుండా.. అక్కడ ప్లాట్ల అమ్మకాలు కొత్తగా నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారులు హైడ్రాను ఆశ్రయించారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం అక్కడ యథాస్థితి కొనసాగేలా చర్యలు తీసుకోవాలని హైడ్రాను రెవెన్యూ కోరింది. ఈ మేరకు శుక్రవారం గుట్టల బేగంపేటలోని సర్వే నంబరు 63లో హైడ్రా ఫెన్సింగ్ వేసింది. 500ల మీటర్లకు పైగా ఫెన్సింగ్ వేసి ఆక్రమణలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంది. రెవెన్యూ అధికారుల సమక్షంలో హైడ్రా ఈ చర్యలు తీసుకుంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●CM Revanth Reddy | హై స్పీడ్ రైళ్లకు ఎలాంటి భూసేకరణ చేయలేదు.. కేంద్రానికి సీఎం వివరణ
- ●Kalvakuntla Kavitha | పంటలు వేయొద్దన్న ముఖ్యమంత్రి అధికారంలో ఉండొద్దు
- ●Gold Prices | బంగారం ధరలు ఢమాల్.. అంచనాలకు మించి అమెరికా వృద్ధి..
- ●Manisha Bhanwala | చరిత్ర సృష్టించిన మనీషా.. ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారత్కు స్వర్ణం
- ●Helicopter Accident | హెలికాప్టర్ కూలిన ఘటనలో ఆరుగురి మృతి
- ●Aditi Shankar | మణిరత్నం కల్ట్ క్లాసిక్ టైటిల్ కొట్టేసిన శంకర్ కూతురు

CM Revanth Reddy | హై స్పీడ్ రైళ్లకు ఎలాంటి భూసేకరణ చేయలేదు.. కేంద్రానికి సీఎం వివరణ

Kalvakuntla Kavitha | పంటలు వేయొద్దన్న ముఖ్యమంత్రి అధికారంలో ఉండొద్దు

Gold Prices | బంగారం ధరలు ఢమాల్.. అంచనాలకు మించి అమెరికా వృద్ధి..

Manisha Bhanwala | చరిత్ర సృష్టించిన మనీషా.. ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారత్కు స్వర్ణం




