త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nora Fatehi | మనీలాండరింగ్‌ కేసులో నోరా ఫతేహీకి కోర్టు సమన్లు!

Nora Fatehi | బాలీవుడ్ న‌టి నోరా ఫతేహీ మరోసారి వార్తల్లో వ్య‌క్తిగా నిలిచింది. రూ.200 కోట్ల కుంభకోణం, మనీలాండరింగ్‌ కేసులో ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు ఆమెకు సమన్లు జారీ చేసింది. నవంబర్ 2ప కోర్టుకు హాజరై సాక్ష్యం ఇవ్వాలని ఆదేశించింది. ఈ కేసులో నోరా పేరును సాక్షిగా పేర్కొంటూ దాఖలైన మూడో అనుబంధ ఛార్జ్‌షీట్‌ ఆధారంగా న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.

P

Entertainment | Published On Oct 30, 2026, 5.53 pm IST

Nora Fatehi | మనీలాండరింగ్‌ కేసులో నోరా ఫతేహీకి కోర్టు సమన్లు!
Advertisement
  • నవంబర్‌ 2న హాజరుకావాలని ఆదేశం..
  • సుకేశ్‌ చంద్రశేఖర్‌ కేసులో కీలక పరిణామం

Nora Fatehi | బాలీవుడ్ న‌టి నోరా ఫతేహీ మరోసారి వార్తల్లో వ్య‌క్తిగా నిలిచింది. రూ.200 కోట్ల కుంభకోణం, మనీలాండరింగ్‌ కేసులో ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు ఆమెకు సమన్లు జారీ చేసింది. నవంబర్ 2ప కోర్టుకు హాజరై సాక్ష్యం ఇవ్వాలని ఆదేశించింది. ఈ కేసులో నోరా పేరును సాక్షిగా పేర్కొంటూ దాఖలైన మూడో అనుబంధ ఛార్జ్‌షీట్‌ ఆధారంగా న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.

సుకేశ్‌ కేసులో..

రూ.200 కోట్ల మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సుకేశ్‌ చంద్రశేఖర్‌ ప్రస్తుతం తీహార్‌ జైలులో ఉన్నాడు. అతడికి సంబంధించిన వసూళ్ల కేసులో మనీలాండరింగ్‌ కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే నోరా ఫతేహీతో పాటు బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. ఈ కేసులో దర్యాప్తు సంస్థలు దాఖలు చేసిన మూడో అనుబంధ ఛార్జ్‌షీట్‌లో నోరా ఫతేహీని సాక్షిగా చేర్చాయి. ఈ నేపథ్యంలో ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు కోర్టు సమన్లు జారీ చేసింది. నవంబర్‌ 2న నోరా కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. ఈ కేసులో ఆమె సాక్ష్యం కీలకంగా మారనుంది.

ట్యాగ్స్:

200 Crore Extortion CaseBollywoodDelhi Rouse Avenue CourtMoney Laundering CaseNora FatehiNora Fatehi Court SummonsSukesh ChandrashekharTelugu News
Advertisement
Advertisement