Taskforce Rides | ఏ వన్ చికెన్ షాప్‌పై దాడులు.. 800 కిలోల కుళ్లిన చికెన్ సీజ్
సికింద్రాబాద్ (Secunderabad) పార్సి గుట్టలోని ఏ వన్ ఫ్రెష్ చికెన్ షాప్ (A1 Chicken shop) లో మంగళవారం సికింద్రాబాద్ టాస్క్‌ఫోర్స్, జీహెచ్ఎంసీ అధికారులు (Taskforce, GHMC Officers) సంయుక్తంగా దాడులు (Rides) నిర్వహించారు. 800 కిలోల కుళ్లిన చికెన్ స్వాధీనం చేసుకున్నారు.
త్రినేత్ర.న్యూస్: కొన్నినెలల క్రితం బేగంపేటలో వందల కిలోల కుళ్లిన మాంసం పట్టుబడిన విషయం మరవకముందే తాజాగా జరిపిన దాడుల్లో 800 కిలోల కుళ్లిన చికెన్ (800 KG Rotten Chicken) బయటపడింది. సికింద్రాబాద్ (Secunderabad) పార్సి గుట్టలోని ఏ వన్ ఫ్రెష్ చికెన్ షాప్ (A1 Chicken shop) లో మంగళవారం సికింద్రాబాద్ టాస్క్‌ఫోర్స్, జీహెచ్ఎంసీ అధికారులు (Taskforce, GHMC Officers) సంయుక్తంగా దాడులు (Rides) నిర్వహించారు.
చాలా రోజుల నుంచి నిలువ ఉంచిన చికెన్ అమ్ముతున్నట్లు గుర్తించారు. 800 కిలోల కుళ్లిన చికెన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ పాడైన చికెన్‌ను వైన్స్‌లకు, బార్ల రెస్టారెంట్లకు సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతోపాటు ఈ చికెన్‌షాప్ లైసెన్స్ గడువు గత జనవరి నెలలోనే ముగిసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈమేరకు కేసు నమోదు (case file) చేసి షాపు నిర్వాహకుడు షకిల్ తో పాటు మరికొంత మందిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలియజేస్తామని పోలీసులు తెలిపారు.
నగరంలో ఎక్కడ చూసినా కల్తీ రాజ్యమేలుతుంది. ఎటువంటి నాణ్యతా ప్రమాణాలు పాటించడం నగరవాసిని కలవరపెడుతోంది. బయటకెల్లి ఏం తినాలన్నా, ఇంటికి తెచ్చుకోవాలన్నా జంకే పరిస్థితులు ఏర్పడ్డాయి. పేర్లలోనే ఫ్రెష్ అని రాస్తారని, అమ్మే వస్తువుల్లో నాణ్యత ఉండడం లేదని పలువురు మండిపడుతున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు దాడులు చేసి నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చూడాలని కోరుతున్నారు.
[video width="848" height="478" mp4="https://www.trinethra.news/static-media/wp-content/uploads/2026/03/WhatsApp-Video-2026-03-17-at-2.52.47-PM-1.mp4"][/video]
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






